
ఇద్దరి ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
అరకు సమీపంలోని డుంబ్రిగూడ మండలం లాచేరులో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు బలిగొంది. తన భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన ఓ గిరిజనుడు కత్తి తీసుకుని అవతలి వ్యక్తిని నరికేందుకు వెళ్లాడు. అది చూసిన మరో వ్యక్తి... అది తప్పని అడ్డుకోవడంతో అతడిని నరికేశాడు.
అక్కడే ఉన్నమరో గ్రామస్థుడు అడ్డుకోగా అతడిపై కూడా దాడి చేశాడు. దాంతో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై తమకు ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని డుంబ్రిగూడ పోలీసులు చెబుతున్నారు. ఫిర్యాదు వస్తే హత్యకేసు నమోదు చేస్తామని అంటున్నారు.