కాకి= చిలుక+పిల్లి+కుక్క
అవును. ఈ కాకి విషయంలో ఇంతే. కాకి ఏమనును.. కావ్‌కావ్ మనును అని మాత్రమే మనం చదువుకున్నాం. మరింకేమీ చేయదా..? ఈ కాకి చేస్తుంది.. ఈ కాకి కావ్‌కావ్‌తోపాటు కబుర్లూ చెబుతుంది! మాట్లాడుతుంది.. అందుకే దీన్ని చిలుకతో పోల్చాం. కుక్క ఇంటికి కాపలా కాస్తుంది. ఆ పని ఇదీ చేస్తుంది. అంతేకాదు.. కుక్కలా భౌభౌమని అరుస్తుంది కూడా.. అందుకే కుక్కన్నాం.. అంతేకాదు.. పిల్లిలా ఇది ఎలుకలనూ పట్టుకుంటుంది. అందుకే మార్జాలంతో సమానమన్నాం.
ఇంతకీ ఇన్ని టాలెంట్లు ఉన్న కాకి ఎక్కడుందన్నదే కదా మీ ప్రశ్న. ఈ వాయసం ఉండేది చైనాలోని నానింగ్‌లో. మా బావోచెంగ్ అనే ఆయన ఇంటికి వెళ్తే.. మనల్ని ఎంచక్కా చైనీస్ భాషలో హెలో అంటూ వెల్‌కం చెబుతుంది.