సాక్షి నెట్‌వర్‌క: తెలంగాణలో కల్తీ కల్లు కల్లోలం కొన సాగుతోంది. కల్తీ కల్లు అమ్మకాలను ఒక్కసారిగా నిలిపివేయడంతో బాధితులు మృత్యువాతపడుతున్నారు. పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం 21 మంది మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనే 15 మంది మరణించారు. వందల సంఖ్యలో బాధితులు ఆస్పత్రుల్లో చికి త్స పొందుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం చేగిరెడ్డిఘనాపూర్ చెన్నారెడ్డిగూడకు చెందిన పెంటమ్మ(68) ఉరేసుకోగా, షాద్‌నగర్‌కు చెందిన భీమమ్మ(73) నీటి గుంతలో దూకింది.
విజయనగర్ కాలనీకి చెందిన లక్ష్మమ్మ(40), ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్‌కు చెందిన సాలె యాదగిరి(60), కొందుర్గు మండలం లింగారెడ్డిగూడకు చెందిన ఖాజామియా(60), కర్రోల్లపెంటమ్మ(70), బాబుమియా(60), కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వకు చెందిన శాంతమ్మ(70) అనారోగ్యంతో మరణించారు. కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన ఇబ్రహీం(75), దేవరకద్ర మండలం పెద్దరాజమూర్‌కు చెందిన చెన్నరాయుడు(60) సొమ్మ వచ్చి పడిపోయి మృతి చెందారు. గద్వాలకు చెందిన సత్యమ్మ(35) ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుంది. గంజిపేట కాలనీకి చెందిన అబ్దుల్‌సలాం(60) మంగళవారం విం తగా ప్రవర్తిస్తూ కుప్పకూలిపోయాడు.
కొడంగల్‌కు చెం దిన రాంపురం వెంకటలక్ష్మి(27), ధరూరు మండలం ఉప్పేరుకు చెందిన చాకలి సవారన్న(45), అల్వాలపాడులో కావలికారు నర్సమ్మ ఆస్పత్రులలో చికిత్స పొందు తూ మృతి చెందారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం సిద్దాపూర్‌లో నాగరాజు(28), నందికందిలో కిష్టయ్య (35), కల్హేర్ మండలం బాచేపల్లిలో రాములు(55), మెదక్ పిట్లంబేస్ వీధికి చెందిన అప్పల బాలయ్య(54) కల్లుకు బానిసై వింతగా ప్రవర్తిస్తూ మృతి చెందారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్‌కి చెందిన సాదుల నాగభూషణం(38) పిచ్చిగా ప్రవర్తిస్తూ రోడ్డుపై పడిపోయి మరణించాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో రిక్షా కార్మికుడు మొహినొద్దీన్(65) కల్లుకు బానిసయ్యాడు. అది దొరకపోవడంతో రోడ్డుపై పడిపోగా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన సాయమ్మ (48) చెరువులో దూకగా గత ఈతగాడు కాపాడారు. కాగా, మెదక్ జిల్లా సదాశివపేట మండలంలో 50 మంది, కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు.
‘కల్లు’ తేలేస్తున్నారు..!
Published Wed, Sep 23 2015 3:07 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
Advertisement
Advertisement