న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీలు ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులర్, వొడాఫోన్‌లు మొబైల్ ఇంటర్నెట్ రేట్లను పెంచాయి. 2జీ నెట్‌వర్క్‌లో కొన్ని నిర్దిష్ట ప్లాన్‌ల కింద డౌన్‌లోడ్ చేసుకునే డేటాను సగానికి తగ్గించాయి.ప్లాన్‌ల వ్యాలిడిటీ వ్యవధినీ తగ్గించాయి. దీంతో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసుల వినియోగం కొంచెం ఖరీదవుతుంది.
ఉదాహరణకు, 1జీబీ డౌన్‌లోడ్‌కు వినియోగదారులు 25% అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ మూడు కంపెనీలు 1జీబీ(1024 ఎంబీ)ఇంటర్నెట్ యూసేజ్‌కు రూ. 125 చార్జ్ చేశాయి. ఇప్పుడు ఈ యూసేజీని 525 ఎంబీకు తగ్గించాయి. ఎయిర్‌టెల్ వినియోగదారులు 1 జీబీ ఇంటర్నెట్ యూసేజీకి ఇప్పుడు రూ.156 చెల్లించాల్సి ఉంటుంది. ఐడియాకు అయితే రూ.154, వొడాఫోన్‌కు అయితే రూ.155 చెల్లించాలి. ఇవి ఢిల్లీ ధరలు. ఇక ఎయిర్‌టెల్ ఢిల్లీలో రూ.98 ప్యాక్ వ్యాలిడిటీని 28 రోజుల నుంచి 14 రోజులకు తగ్గించింది. డేటా యూసేజీని కూడా సగానికి తగ్గించింది. ఈ ధరల మార్పు ఎప్పటి నుంచి వర్తిస్తుందో ఈ కంపెనీలు వెల్లడించలేదు. ఏడాదిలోపు కాలంలో 2జీ ఇంటర్నెట్ రేట్లు పెరగడం ఇది రెండోసారి.
మొబైల్ ఇంటర్నెట్ రేట్లు పెరిగాయ్
Published Wed, Oct 16 2013 12:50 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM
Advertisement