
బీజేపీ గ్రాఫ్ పడిపోతోంది: పవార్
ముంబై: బీజేపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. పది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కమలం పార్టీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోందని తెలిపారు. మంచి రోజులు వస్తాయని ఎన్నికల ప్రచారంలో బీజేపీ హామీయిచ్చిందని కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కషాయ పార్టీకి గడ్డుకాలం దాపురించిందని ఎద్దేవా చేశారు.
ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడిగా సునీల్ తత్కారే తిరిగి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ... విదేశీ పర్యటనల్లో ప్రధాని నరేంద్ర మోదీ మనదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం తగదని అన్నారు. రాహుల్ గాంధీ వల్లే నేపాల్ భూకంపం వచ్చిందని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ చేసిన వ్యాఖ్యలను పవార్ తప్పుబట్టారు.