వీడే ఆ దుర్మార్గుడు! | Chennai Infosys employee murder, Police release high resolution image of suspect | Sakshi
Sakshi News home page

వీడే ఆ దుర్మార్గుడు!

Published Thu, Jun 30 2016 2:36 PM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM

వీడే ఆ దుర్మార్గుడు! - Sakshi

వీడే ఆ దుర్మార్గుడు!

టెక్కీ స్వాతి హత్యకేసులో నిందితుడి హై రిజుల్యూషన్ ఫొటో విడుదల


చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసు విచారణలో కీలక పరిణామం. స్వాతిని హత్యచేసిన నిందితుడి హై రిజుల్యూషన్ ఫొటోను చెన్నై పోలీసులు గురువారం విడుదల చేశారు. మద్రాస్ హైకోర్టు జోక్యంతో ఈ హత్యకేసు విచారణను రైల్వే పోలీసుల నుంచి చెన్నై పోలీసులకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

స్వాతిని గత శుక్రవారం చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్‌లో ఓ దుండగుడు దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరిట గత మే నెల నుంచి స్వాతిని వెంటాడుతున్న ఓ యువకుడే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ ఫొరెన్సిక్ సంస్థ సాయంతో నిందితుడి హై రిజుల్యూషన్ ఫొటోలను చెన్నై పోలీసులు సంపాదించినట్టు సమాచారం. స్వాతి హత్య జరిగి వారం రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో నిందితుడి స్పష్టమైన ఫొటోను విడుదల చేయడం ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామంగా పోలీసులు భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement