భారత్ యుద్ధానికి దిగితే వారు మావెంటే...
భారత్ యుద్ధానికి దిగితే వారు మావెంటే...
Published Sat, Nov 26 2016 3:45 PM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM
ఒకవేళ భారత్ యుద్ధానికి దిగితే.. తమ చిరకాల మిత్రుడు చైనా మద్దతు ఇస్లామాబాద్కే ఉంటుందంటూ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ధీమా వ్యక్తంచేశారు. తమ దేశానికి చెందిన అన్ని రక్షణ సంబంధిత వ్యవహారాల్లో చైనా మద్దతు తమకేనని ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భారత్ సైనికులు చేసిన దాడుల్లో 10 మంది తమ దేశ పౌరులు చనిపోయారని, 21 మంది గాయాలపాలైనట్టు పాకిస్తాన్ ఆరోపించింది.
భారత్ చేస్తున్న ఈ దాడులను తిప్పికొట్టిన తమ ఆర్మీ కూడా ముగ్గురు భారత సైనికులను బలిగొన్నట్టు ఆ దేశం పేర్కొంది. తమ పౌరులపై, అంబులెన్స్లపై, మహిళలపై, చిన్నపిల్లలపై, పౌర రవాణాపై, భారత్ చేస్తున్న ఉద్దేశ్యపూర్వక దాడులను తాము సహించేది లేదంటూ పాకిస్తానీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా హెచ్చరించారు. అయితే ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సహమిస్తూ నియంత్రణ రేఖ వెంబడి భారత్పై ఉసుగొల్పుతున్న పాకిస్తాన్, తిరిగి తమకేమీ తెలియదన్నట్టు, అంతా భారతే చేస్తుందంటూ హెచ్చరికలు చేయడం గమనార్హం.
Advertisement