న్యూఢిల్లీ: గతఆర్థిక సంవత్సరం (2013-14)లో విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీల్లో బీజేపీకి అత్యధికంగా రూ. 41కోట్లురాగా, కాంగ్రెస్‌కు రూ. 36కోట్లు అందాయి. ఎన్నికల కమిషన్ గుర్తించిన, ఢిల్లీకి చెందిన ‘సత్యా ఎలక్టోరల్ ట్రస్ట్’, రాజకీయ విరాళాలపై సమర్పించిన తన తొలి నివేదికలో ఈ విషయం తెలిపింది. 2013-14లో వివిధ దాతలనుంచి రాజకీయ విరాళాలుగా తమకు సుమారు రూ. 85కోట్ల 40లక్షల విరాళాలు అందాయని ఈ ట్రస్ట్ తన నివేదికలో పేర్కొంది. విరాళాలపై పన్ను మినహారుుంపుకోసం ఎన్నికల కమిషన్ గుర్తింపుతో, ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)వద్ద రిజిస్టరైన ఏడు ఎలక్టోరల్ ట్రస్ట్‌లలో ఈ ట్రస్ట్ ఒకటి.
గత ఆర్థిక సంవత్సరంలో విరాళంకింద బీజేపీకి రూ. 41,37,20,000లు, కాంగ్రెస్‌కు రూ. 36,50, 00,000లు జమచేసినట్టు ట్రస్ట్ తెలిపింది. ఎక్కువ మెుత్తంలో విరాళాలు అందించిన సంస్థల్లో భారతీ ఎయిర్ టెల్ (రూ. 28కోట్లు), డీఎల్‌ఎఫ్ లిమిటెడ్ (రూ. 20కోట్లు) ఉన్నాయి.