ఆర్థిక మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఈమెయిల్ అకౌంట్ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. ఇంగ్లండ్లోని ఈ హ్యాకర్, ఏకంగా డబ్బులు పంపాలని కోరుతూ ఆ అకౌంట్ నుంచి మెయిల్స్ పంపేశాడు కూడా. తన ఈమెయిల్ హ్యాకింగ్కు గురైందని, అందువల్ల లండన్ చిరునామా నుంచి వచ్చే మెయిళ్లు వేటినీ పట్టిచుకోవద్దని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి, అదనపు డీజీ (మీడియా అండ్ కమ్యూనికేషన్) డీఎస్ మాలిక్ తెలిపారు. తాను చాలా ఇబ్బందుల్లో ఉన్నానని, అందువల్ల అత్యవసరంగా డబ్బులు అవసరమని చెబుతూ అత్యవసరంగా 1500 పౌండ్లు ('సుమారు లక్షన్నర రూపాయలు) పంపాలని సదరు హ్యాకర్ తన మెయిళ్లలో పేర్కొన్నాడు.
లండన్లో ఉన్నానని, తన పనులన్నీ పూర్తిచేసుకోవాలంటే 1500 పౌండ్లు కావాలని, వీలైనంత త్వరగా ఆ సొమ్ము తిరిగి ఇచ్చేస్తానని తెలిపాడు. వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా ఆ సొమ్ము పంపాలంటూ పలువురు పాత్రికేయులకు ఈ మెయిల్ పంపాడు. తన చిరునామాను 191 కింగ్స్టన్ రోడ్డు, లండన్, ఎస్డబ్ల్యు1హెచ్, యునైటెడ్ కింగ్డమ్ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న మాలిక్, లండన్ నుంచి పంపినట్లుగా ఆ హ్యాకర్ మెయిల్స్ పంపేశాడు!!
ఆర్థికశాఖలో ఈమెయిల్ అకౌంట్ హ్యాక్!!
Published Fri, Feb 7 2014 3:07 PM | Last Updated on Tue, Oct 2 2018 4:36 PM
Advertisement
Advertisement