పిల్లల పంచాయితీ పెద్దల పంచాయితీగా మారి.. | Eve-teasing leads to clash between 2 communities, 4 held | Sakshi
Sakshi News home page

పిల్లల పంచాయితీ పెద్దల పంచాయితీగా మారి..

Published Tue, Sep 8 2015 12:07 PM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM

పిల్లల పంచాయితీ పెద్దల పంచాయితీగా మారి.. - Sakshi

పిల్లల పంచాయితీ పెద్దల పంచాయితీగా మారి..

ముజఫర్నగర్: ఓ బాలికను కొందరు ఆకతాయి యువకులు అల్లరి పెట్టడంతో అది కాస్త రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లోగల హైబత్ పూర్లో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం ఈ ఘటనకు ముందు బాలిక ఓ బస్సులో వస్తుండగా మరో వర్గానికి చెందిన ఇద్దరు యువకులు కించపరిచేలా మాట్లాడారు.

ఈవ్ టీజింగ్కు పాల్పడ్డారు. ఆ విషయం సదరు అమ్మాయి వాళ్ల వర్గంతో చెప్పడంతో అది కాస్త రెండు వర్గాల ఘర్షణకు దారి తీసి గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన పోలీసులు ఇరు వర్గాల నుంచి చెరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 13మందిపై కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement