కంటి లెన్స్‌ ధరలు తగ్గుతాయ్‌! | Eye lens prices will be decrease | Sakshi
Sakshi News home page

కంటి లెన్స్‌ ధరలు తగ్గుతాయ్‌!

Published Mon, Mar 6 2017 12:43 AM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

కంటి లెన్స్‌ ధరలు తగ్గుతాయ్‌!

కంటి లెన్స్‌ ధరలు తగ్గుతాయ్‌!

ధరలకు కళ్లెం వేయనున్న ఎన్‌పీపీఏ

సాక్షి, అమరావతి:  స్టెంట్ల ధరలను అదుపు లోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించిన నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) మరో కీలక అడుగు వెయ్య బోతోంది. కంటి లెన్స్‌లు, కృత్రిమ మోకాలి చిప్పల ధరలపై కూడా నియంత్రణ విధించ నున్నట్లు ఫార్మాస్యూటికల్‌ వర్గాలు తెలిపా యి. వీటితోపాటు వెన్నుపూసకు వేసే స్క్రూలు, రాడ్లు, తుంటి∙ఎముకలో వేసే స్క్రూలు, మోకాలి కింద ఎముకలకు వేసే స్క్రూలు, రాడ్ల ధరలకు కళ్లెం వేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మోకాలి చిప్పల మార్పిడి ఖరీదైన వ్యవహారంగా మారిపో యింది. ఒక్క మోకాలి చిప్పను మార్చాలంటే రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. మోకాలి చిప్ప మార్పిడి అనేది సామాన్యులకు అందని ద్రాక్షగా మారింది.

స్టెంట్ల ధరలు తగ్గినా బాదుడేనా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కంటికి లెన్స్‌లు వేయించుకుంటున్న వారిసంఖ్య ప్రతిఏటా లక్షల్లోనే ఉంటోంది. ఒక కంటికి లెన్స్‌ వేయించుకుంటే రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ వసూలు చేస్తున్నారు. విదేశీ లెన్స్‌లని, దిగుమతి చేసుకున్నవని, బ్రాండెడ్‌ లెన్స్‌లని.. ఇలా రకరకాల కారణాలతో రోగుల జేబులను గుల్ల చేస్తున్నారు. రూ.2 లక్షల దాకా ఉన్న స్టెంట్‌ ధరను రూ.30 వేలకు నియంత్రించినట్టే, కంటి లెన్స్‌ల ధర కూడా రూ.4 వేల నుంచి రూ.5 వేల లోపు ఉండేలా చర్యలు తీసుకోవా లని భావిస్తున్నట్టు ఫార్మాస్యూటికల్‌ అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్‌పీపీఏ త్వరలో సమావేశమై, ధరల తగ్గింపుపై తుది నిర్ణయం తీసుకోనుంది. డ్రగ్‌ ఎల్యూటెడ్‌ స్టెంట్లను కూడా ఒక్కొక్కటి రూ.30 వేలకు మించి అమ్మకూడదని ఎన్‌పీపీఏ స్పష్టం చేసింది. అయినా సరే కార్పొరేట్‌ ఆస్పత్రులు రూ.2 లక్షల దాకా చార్జి చేస్తున్నాయి. ఈ దోపిడీని ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని రోగులు కోరుతున్నారు.

కచ్చితమైన నియంత్రణ వ్యవస్థ ఉండాలి
‘‘స్టెంట్ల ధరలను తగ్గించినా కార్పొరేట్‌ హాస్పిటళ్లు పాత ధరలనే వసూలు చేస్తుండడంతో రోగులు నష్టపో తున్నారు. ఆస్పత్రులు వసూలు చేస్తున్న ధరలకు అడ్డుకట్ట వేయాలి. ఇందుకోసం కచ్చితమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. లేకుంటే స్టెంట్లు, లెన్స్‌లు, స్క్రూలు, రాడ్ల ధరలను తగ్గించినా రోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు’’
    – డా.సాంబశివారెడ్డి,న్యూరోసర్జన్, సిటీ న్యూరో సెంటర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement