తెలంగాణ ప్రజలకు అభినందనలు
కోల్‌కతా: ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ఏకపక్ష నిర్ణయంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్లే పశ్చిమ బెంగాల్‌ను విడదీసి గూర్ఖాలాండ్‌ను ఏర్పాటు చేయాలని జీజేఎం (గూర్ఖా జన్‌ముక్తి మోర్చా) అధినేత బిమల్ గురుంగ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం గడిచిన కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నామని, దేశంలో అత్యంత పురాతన ఉద్యమం తమదేనని చెప్పారు. విభజన కోసం రాష్ట్రాల అంగీకారం అక్కర్లేదనే విషయం మంగళవారం నాటి తెలంగాణ బిల్లు ఆమోదం ద్వారా స్పష్టమైందని, ఈ విషయాన్ని తాము కొన్నేళ్లుగా అనేక వేదికలపై నొక్కి చెప్పామన్నారు. కాబట్టి బెంగాల్‌లో వస్తున్న వ్యతిరేకతను పక్కన పెట్టి గూర్ఖాలాండ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ఫేస్‌బుక్‌లో విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.
గూర్ఖాలాండ్ కూడా ఏర్పాటు చేయండి : జీజేఎం
Published Wed, Feb 19 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM
Advertisement
Advertisement