గూగుల్ ఆండ్రాయిడ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ లాంచ్
పుణే: టెక్నాలజీ జెయింట్ గూగుల్ ఆండ్రాయిడ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంను సోమవారం లాంచ్ చేసింది. లక్షలాది విద్యార్థులను మొబైల్ డెవలపర్స్ గా తీర్చిదిద్దేందుకు ఓ శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా ఇరవై లక్షలమంది (2 మిలియన్) మొబైల్ డెవలపర్స్ ని తయారుచేసేందుకు యోచిస్తోంది. గూగుల్ ప్రత్యేకంగా రూపొందించిన ఆండ్రాయిడ్ ఫండమెంటల్స్ శిక్షణ కార్యక్రమం ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి శిక్షణా సంస్థల్లో అందుబాటులో ఉండనుంది.
భారతదేశంలో నాలుగు మిలియన్ డెవలపర్లు 2018 ప్రపంచంలో ధీటుగా నిలబడతారని భావిస్తున్నామని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ సేన్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం 25శాతం మాత్రమే మొబైల్ డెవలపర్స్ ఉన్నారని తెలిపారు. జులై18 నుంచి ప్రారంభం కాబోయే ఈ ఆన్లైన్ మొబైల్ కంప్యూటింగ్ కోర్సును (ఐఐటీలు, ఐఐఎస్సీల సహకారంతో). ఆన్లైన్ వెబ్ , వీడియో కోర్సులు వివిధ ప్రవాహాలు ద్వారా ఇ-లెర్నింగ్ ఉచితంగా అందిస్తోంది. గూగుల్ ఎడ్యురకా, కోనిగ్, మణిపాల్ గ్లోబల్, సింప్లీ లెర్న్, అడాసిటీ, అప్ గ్రేడ లాంటి ఇతర శిక్షణా సంస్థల భాగస్వామ్యంతో పనిచేస్తామని తెలిపారు.
విశ్వవిద్యాలయ విద్యార్థులు కోసం ఆండ్రాయిడ్ ఫండమెంటల్స్ కోర్సును విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడు మొదటిసారి పరిచయం చేస్తున్నామని గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ శిక్షణ హెడ్ పీటర్ లుబ్బర్స్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన జాబ్ ఓరియెంటెడ్ సర్టిఫికేషన్ ద్వారా ఇండస్ట్రీలో ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ డెవలపర్ ఉద్యోగాలు లభ్యమవుతాయని తెలిపారు. శిక్షణ తర్వాత గూగుల్ డెవలపర్ ట్రైనింగ్ వెబ్ సైట్ ద్వారా 6500 ఫీజు కట్టి సర్టిఫికేషన్ పరీక్షకు హాజరు కావచ్చన్నారు.