బాలుడి వీపు చిట్లేలా టీచర్ బాదేశాడు | J&K: Teacher beats class 2 student with stick for shouting in class, arrested | Sakshi
Sakshi News home page

బాలుడి వీపు చిట్లేలా టీచర్ బాదేశాడు

Published Mon, Aug 10 2015 10:23 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

బాలుడి వీపు చిట్లేలా టీచర్ బాదేశాడు - Sakshi

బాలుడి వీపు చిట్లేలా టీచర్ బాదేశాడు

కుప్వారా: జమ్ముకశ్మీర్లో ఘోరం జరిగింది. పిల్లల మానసిక ప్రవర్తనను అర్ధం చేసుకొని వారి బాహ్య ప్రవర్తనను అదుపుచేయాల్సిన ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. అల్లరి చేస్తున్నాడనే కారణంతో ఒళ్లంతా చిట్లిపోయేలా రెండో తరగతి చదువుతున్న బాలుడిని కర్రతో చితక్కొట్టాడు.

దీంతో ఆ బాలుడి వీపంతా వాతలు తేలాయి. హంద్వారా ప్రాంతంలోని కుప్వారా ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన ఉపాధ్యాయుడిపై కేసు నమోదైంది. జువెనైల్ చట్టం ప్రకారం తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా అతడిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement