ఎర్రవెల్లిలో కేసీఆర్ సహఫంక్తి భోజనం
మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎర్రవల్లికి 200 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
అనంతరం కేసీఆర్ ఎర్రవల్లి గ్రామస్తులతో కలసి సహఫంక్తి భోజనం చేశారు. గురువారం కూడా కేసీఆర్ ఎర్రవెల్లి గ్రామాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఈ గ్రామంలోనే ఉంది.