పాపులర్ హీరోయిన్, భర్త, మరిది అరెస్ట్ | Kerala: Police arrest actor Dhanya Mary Varghese and her husband in connection with a real estate fraud case. | Sakshi
Sakshi News home page

పాపులర్ హీరోయిన్, భర్త, మరిది అరెస్ట్

Published Fri, Dec 16 2016 4:28 PM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

పాపులర్ హీరోయిన్,  భర్త, మరిది అరెస్ట్ - Sakshi

పాపులర్ హీరోయిన్, భర్త, మరిది అరెస్ట్

తిరువనంతపురం: చీటింగ్ కేసులో  మలయాళ పాపులర్ నటి, హీరోయిన్, ఆమె భర్త, మరిదిలను పోలీసులు   అరెస్ట్ చేశారు. రి యల్ ఎస్టేట్ వ్యవహారంలో మోసానికి పాల్పడిన ఆరోపణలపై దక్షిణాది  నటి ధన్య మేరీ వర్గీస్‌ (31)ఆమె భర్త జాన్ జాకబ్‌, జాకబ్ సోదరుడు శ్యామ్యల్ జాకబ్ లను శనివారం  అరెస్ట్ చేశారు. 2014  నాటి కేసుకు సంబంధించిన వీరిని తాజాగా అదుపులోకి తీసుకొన్నట్టు తెలుస్తోంది.

కేరళ రాజధాని తిరువనంతపురం పరిసరాల్లో నిర్మిస్తున్న నోవా కాజిల్ ఫ్లాట్ కాంప్లెక్స్‌లో తమకు అపార్ట్‌మెంట్లు ఇప్పిస్తామని ధన్య భర్త జాన్ జాకబ్‌కు చెందిన సంస్థ శాంసన్ అండ్ సన్స్ ద్వారా కోట్లాది రూపాయలూ కాజేశారని అందిన ఫిర్యాదు నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేశారు.  2011  లో శాంసన్ అండ్ సన్స్ సంస్థ తరపున కలిసి బాధితుల భారీ ఎత్తున  సొమ్మును  తీసుకొని  ప్లాట్ లు  కేటాయించకుండా  మోసానికి పాల్పడ్డారు. ఒకొక్కరి నుంచి రూ.40 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ మొత్తం 100 కోట్ల రూపాయల మేర వసూళ్ళు చేసిన ఆరోపణలపై  కేసులు నమోదయ్యాయి. ధన్య మామ జాకబ్ శాంసన్‌ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు.
 
కాగా 31 సంవత్సరాల ధన్య తమిళ సినిమా 'తిరుడి' (దొంగ) చిత్రం ద్వారా 2006లో సినీ రంగంలోకి ప్రవేశించారు. తర్వాత మలయాళ రంగంలోకి అడుగుపెట్టారు. టీవీ సీరియళ్ళలో  కూడా దర్శనమిచ్చిన నర్గీస్ తలప్పావు సినిమాకు ఆమె ఉత్తమ  నటి అవార్డును అందుకున్నారు.  దీంతోపాటుగా మళయాంలో కేరళ  కేఫ్, నాయగన్ సినిమాల్లో కూడా నటించారు. జాన్ కూడా పలు సినిమాల్లో నటించార. 2012లో వివాహం చేసుకున్న ధన్య, జాన్ జంటకు మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement