అందగత్తెల దేశానికి మరో రికార్డు | Latvian woman confirmed as world's tallest | Sakshi
Sakshi News home page

అందగత్తెల దేశానికి మరో రికార్డు

Published Tue, Jul 26 2016 4:49 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

అందగత్తెల దేశానికి మరో రికార్డు

అందగత్తెల దేశానికి మరో రికార్డు

లండన్: పూల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు రంగరించిట్లుండే బొమ్మల్ని చూస్తే.. 'అమ్మ బ్రహ్మదేవుడో..!' అని పాడకుండా ఉండలేం. ఇక దేశం మొత్తం అలాంటి వాళ్లే ఉంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు! అలా 'ప్రంపంచంలోనే గొప్ప అందగత్తెల దేశం'గా ఖ్యాతికెక్కిన లాట్వియాకు మరో ఘనత కూడా దక్కింది. సరాసరి 169.8 సెంటీమీటర్ల (5.6 ఇంచుల) పొడవుండే లాట్వియన్ మహిళలు.. ప్రంపంచంలోనే పొడుగరి మహిళలుగా రికార్డు సొంతం చేసుకున్నారు.

పౌరుల ఒడ్డూపొడుగులపై లండన్ కు చెందిన రీసెర్చర్లు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. లాట్వియా తర్వాతి స్థానంలో 168.7 సెంటీమీటర్ల యావరేజ్ హైట్ తో డచ్(నెదర్లాండ్) వనితలున్నారు. మూడో స్థానంలో ఎస్టోనియా, చెక్ రిపబ్లిక్ నాలుగు, సెర్బియా ఐదో స్థానాల్లో ఉన్నాయి. గ్వాటెలామా దేశపు మహిళలు 149.4 సెంటీమీటర్ల యావరేజ్ పొడవుతో 'ప్రపంచంలోనే పొట్టి మహిళలు'గా నమోదయ్యారు. మహిళ ఎత్తులో గ్వాటిలామా తర్వాతి జాబితా.. ఫిలిఫీన్స్ (149.6 సెంటీమీటర్లు), బంగ్లాదేశ్(150.8 సెంమీ), నేపాల్(150.9 సెంమీ), తూర్పు తిమోర్ (151.2 సెంటీమీటర్లు) ఉన్నారు. భారతీయ మహిళల యావరేజ్ హైట్ 152.6 సెంటీమీటర్లు.(ఐదు అడుగులు)


ఇక మగవాళ్ల విషయానికి వస్తే 182.5 సెంమీ(5.11 అడుగుల) సరాసరి ఎత్తున్న నెదర్లాండ్(డచ్) పురుషులు.. ప్రంపంచంలోనే పొడుగరి పురుషులుగా నిలిచారు. వారి తర్వాతి స్థానం బెల్జియం పురుషులకు(181.7 సెంమీ) దక్కింది. తర్వాతి పొజిషన్లలో ఎస్టోనియా(181.6సెంమీ), లాట్వియా(181.4 సెంమీ)దేశపు పురుషులున్నారు.

159.8సెంటీ మీటర్ల (5.2 ఇంచుల) యావరేజ్ హైట్ తో తూర్పు తిమోర్ పురుషులు ప్రంపంచంలో పొట్టి మగాళ్లలుగా నిర్ధారణ అయ్యారు. వాళ్ల తర్వాత పొట్టి మగాళ్లంటే యెమెన్(159.9 సెంమీ), లావోస్(160.5 సెంమీ), మడగస్కర్(161.5) పురుషులున్నారు. ఇక భారత్ విషయానికి వస్తే ఇండియన్ మెన్ యావరేజ్ హైట్ 166.2 సెంటీమీటర్లు. అంటే ఐదడుగుల ఐదున్నర అంగులాలన్నమాట!

200 దేశాలకు చెందిన 100 ఏళ్ల నాటి(1914 నుంచి 2014 వరకు) జనాభా లెక్కలు, ఇతర వివరాలు సేకరించి, క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత పొడుగరి మహిళలు లేదా పొడుగరి పురుషుల దేశాల జాబితా విడుదల చేశామని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్  రీసెర్చర్లు పేర్కొన్నారు.

Advertisement

పోల్

Advertisement