ఎవరెస్ట్‌పై స్వచ్ఛభారత్
న్యూఢిల్లీ: హిమాలయాల్లోకెల్లా అత్యంత ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ప్రతి పర్వతారోహకుడి స్వప్నం. దశాబ్దాలుగా ఈ శిఖరాన్ని ఎంతోమంది అధిరోహించారు. ఈ క్రమంలో వీరు తీసుకెళ్లిన ప్లాస్టిక్ కవర్లు, నీళ్ల సీసాలు, ఇతరత్రా చెత్త ఈ మంచు శిఖరంపై పేరుకుపోతూ వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్‌ను స్ఫూర్తిగా తీసుకున్న భారత సైనికులు ఇప్పుడీ చెత్తను కిందకుతెచ్చే కార్యక్రమం చేపట్టారు.
8,848 మీటర్ల ఎత్తున్న ఈ శిఖరంపైకి మేజర్ రణ్‌బీర్‌సింగ్ సారథ్యంలోని బృందం శనివారం నేపాల్‌వైపు నుంచి బయలుదేరింది. ఎవరెస్ట్ పర్వత సానువుల్లో పేరుకుపోయిన నాలుగు వేల కిలోల చెత్తను పోగేసి... కిందకు తేనున్నారు.