అడాల్ఫ్ హిట్లర్ లా నరేంద్రమోడీ మరో నియంత: దిగ్విజయ్ సింగ్
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మళ్లీ విరుచుకుపడ్డారు. ఈసారి నరేంద్రమోడిని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తో పోల్చుతూ దిగ్విజయ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చరిత్ర హీనుడైన హిట్లర్ బాటలో నడుస్తూ అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నాడని దిగ్విజయ్ అన్నాడు.
హిట్లర్, మోడీల మధ్య చాలా పోలికలు ఉన్నాయని.. మోడీ కూడా హిట్లర్ ను ఫాలో అవుతూ అధికారం కోసం పాకులాడుతున్నాడని ఆయన ఆరోపించారు. గుజరాత్ లాంటి చిన్న రాష్ట్రం నుంచి మోడీ వెలుగులోకి వచ్చాడని, ఆ రాష్ట్రంలో మోడీ ఉన్నాడు కాని బీజేపీ లేదని విమర్శించాడు. మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్ లో కూడా అదే పరిస్థితి ఉందన్నాడు. మధ్య ప్రదేశ్ శివరాజ్ చౌహాన్, చత్తీస్ ఘడ్ లో రమణ్ సింగ్ లున్నారని.. బీజేపీ అక్కడ పాపులారిటీ లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ లేకుండా చేయడమేది మోడీ కలగానే మిగిలిపోతుందని ఎద్దేవా చేశాడు.