ఫ్యాన్స్‌ తాకిడితో పవన్‌ ఉక్కిరిబిక్కిరి! | over enthusiatic fans mada pawan troubles | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌ తాకిడితో పవన్‌ ఉక్కిరిబిక్కిరి!

Published Sat, Aug 27 2016 4:19 PM | Last Updated on Mon, Jul 29 2019 7:35 PM

ఫ్యాన్స్‌ తాకిడితో పవన్‌ ఉక్కిరిబిక్కిరి! - Sakshi

ఫ్యాన్స్‌ తాకిడితో పవన్‌ ఉక్కిరిబిక్కిరి!

తిరుపతి: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన బస చేసిన తిరుపతి గెస్ట్‌హౌస్‌ వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. గెస్ట్‌హౌస్‌ నుంచి సభకు బయలుదేరే సమయంలో బయటకువచ్చిన పవన్‌ను చూసి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. కరచాలనాల కోసం పోటీపడ్డారు. అంతే, ఆ గందరగోళంలో పవన్‌ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఒకదశలో కిందపడబోయారు. అతికష్టం మీద సెక్యూరిటీ సిబ్బంది పవన్‌ను వాహనంలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన నేరుగా సభ ప్రాంగణానికి చేరుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement