అధ్యక్షుడి కొడుకే టార్గెట్ | Pakistan: Three killed in blast targeting President Mamnoon Hussain's son | Sakshi
Sakshi News home page

అధ్యక్షుడి కొడుకే టార్గెట్

Published Mon, May 25 2015 10:24 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

అధ్యక్షుడి కొడుకే టార్గెట్

అధ్యక్షుడి కొడుకే టార్గెట్

కరాచీ: పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ కుమారుడికి ప్రాణ గండం తప్పింది. అతడి కుమారుడు సల్మాన్ మమ్నూన్ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబు దాడి జరిపారు. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలుకోల్పోగా.. 13 మందికిపైగా గాయాలపాలయ్యారు. సల్మాన్కు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు. బాలోచిస్తాన్ ప్రావిన్స్లో రిమాట్ ద్వారా ఉగ్రవాదులు ఈ చర్యకు దిగారు. 'ఓ మోటారు సైకిల్పై భారీ పేలుడు పదార్థాలు అమర్చి సల్మాన్ వెళ్లే దారిలోని ఓ రెస్టారెంట్ వద్ద ఉంచారు. ఆయన నిర్వహించే పలు వ్యాపారా లావాదేవీలకోసం ఆ మార్గం నుంచే వెళతారని వారు ఊహించి ఈ ఘటనకు దిగారు' అని పాక్ అధికారిక వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement