సీఎస్‌సీల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు | Passport Seva goes rural through Common Services Centers | Sakshi
Sakshi News home page

సీఎస్‌సీల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు

Published Thu, Mar 6 2014 9:33 PM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

సీఎస్‌సీల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు

సీఎస్‌సీల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు

సాక్షి, హైదరాబాద్: ఇకపై కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్‌సీ)ల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు అందించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది.  దీనికోసం లక్షకు పైగా సీఎస్‌సీలను ఎంపిక చేసింది. ఈ సెంటర్ల ద్వారా పాస్‌పోర్ట్ సంబంధిత సేవలు అందిస్తారు. ఈ విధానానికి జాతీయ ఈ-గవర్నెన్స్ ప్రణాళికలో 2006లోనే ఆమోదం తెలిపినా ఇప్పటికి కార్యాచరణ మొదలైంది. ఈ సెంటర్లలో పాస్‌పోర్ట్ దరఖాస్తు పూర్తి చేయడం, ఆ దరఖాస్తును ఇంటర్నెట్‌కు అప్‌లోడ్ చేయడం, ఫీజులు చెల్లింపు తదితర పనులు నిర్వహిస్తారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. దీనికోసం రూ.100 నామమాత్రపు రుసుము వసూలుచేస్తారు. తొలుత ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లో 15 కేంద్రాల్లో మార్చి రెండవ వారంలో ఈ సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తారు. మార్చి చివరినాటికి లేదా ఏప్రిల్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు విదేశీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

పాస్‌పోర్ట్ సేవలకు సంబంధించిన సమాచారం కోసం www.passportindia.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అంతేగాకుండా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన 1800-258-1800 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కూడా ఫోన్ చేసి పాస్‌పోర్ట్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. గతంలో పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవలు ప్రారంభించినా అనుకున్నంతగా అది సఫలం కాలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement