ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తప్పకుండా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా కేవలం సమాచారం తెలుసుకోవడమే ప్రజల హక్కుగా ఉండకూడదని, దాని ద్వారా తప్పకుండా ప్రశ్నించాలని గుర్తుచేశారు.
న్యూఢిల్లీ: ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తప్పకుండా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా కేవలం సమాచారం తెలుసుకోవడమే ప్రజల హక్కుగా ఉండకూడదని, దాని ద్వారా తప్పకుండా ప్రశ్నించాలని గుర్తుచేశారు. అప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందని తెలిపారు.
వ్యవహార లావేదేవీలు ఆన్లైన్ ద్వారా జరగడంవల్ల పారదర్శకత దానంతట అదే పెరుగుతుందని, విశ్వాసం కూడా మెరుగవుతుందని చెప్పారు. ఇంతకాలానీకి కూడా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమీ లేదని పరిపాలనలో చాటుగా కాకుండా బాహాటంగా వ్యవహరించాలని దానితో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.