పెద్దనోట్ల రద్దుపై రాజన్ ఏమన్నారు?
అహ్మదాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా రాజీనామా చేసిన రఘురామ రాజన్ మొదటి సారి అహ్మదాబాద్ ఐఐఎం-ఎ ను సందర్శించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ క్యాంపస్ లో ప్రసంగించారు.
చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యూనివర్శిటీ విశిష్ట్ ప్రొఫెసర్ గా 'ప్రపంచ ఆర్థిక వ్యవస్థ:అవకాశాలు మరియు సవాళ్లు' అనే అంశంపై లెక్చరిచ్చారు. కానీ పెద్ద నోట్ల రద్దుపై ఒక ముక్క కూడా మాట్లాడకపోవడం విశేషం. డీమానిటైజేషన్ పై ఎలాంటి ప్రస్తావన లేకుండానే ఆయన ప్రసంగ పాఠం ముగిసింది. డీమానిటైజేషన్ సహా దేశంలోని కొన్ని నిర్దిష్ట ఆర్థిక అంశాల ప్రస్తావన ఉంటుందని విశ్వసించిన వారికి నిరాశే ఎదురైంది.
రాజన్ ఉపన్యాసానికి శ్రీ రామకృష్ణ ప్రెవేట్ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు గోవింద ధోలకియా, మేనేజింగ్ డైరెక్టర్ ప్రొ.రాహుల్ ధోలకియా ప్రొఫెసర్లు, ఆశిష్ నందా, రాకేష్ బసంత్ తదితరులు విచ్చేసారు. వీరితోపాటు ఐఐఎం బోధనా సిబ్బంది, విద్యార్థులు , 1987 పూర్వ విద్యార్థులు బ్యాచ్ , ఇతర పూర్వ విద్యార్ధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కాగా కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలతో పరిశ్రమ మరియు విద్యా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యం తో ఈ వార్షిక ఉపన్యాసాలను శ్రీ రామకృష్ణ నాలెడ్జ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేస్తోంది. ఈ సిరీస్ లో మొదటి ఉపన్యాసాన్ని రాఘురాజన్ ఇచ్చారు.