ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ప్రారంభం నుంచే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి చర్చించాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ పట్టుబట్టగా, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ప్రారంభం నుంచే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి చర్చించాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ పట్టుబట్టగా, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. దానిపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెల్లోకి వచ్చి నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ చర్చకు డిమాండ్ చేశారు. ఆ సమయంలో ప్రతిపక్షం నుంచి జి.శ్రీకాంత్రెడ్డికి మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..
''ప్రశ్నోత్తరాల సమయాన్ని పోగొట్టాలనేది మా ఉద్దేశం కాదు. 1.20 వరకు సభను జరగనివ్వకుండా చేసిందెవరు? రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రత్యేక హోదాతో ప్రజలకు ఏం లాభం కలుగుతుందో తెలియనివ్వండి. దానిమీద నిన్నటి సభలో స్పష్టత రాలేదు. ప్రత్యేక హోదాపై తీర్మానం చేస్తామని అన్నారు.. అది ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్లో లేదు. ఒకవైపు కేంద్రంలో మంత్రులను కొనసాగిస్తూ ఇక్కడ పోరాటం చేస్తామంటే ఎలా కుదురుతుంది''