'రాయల తెలంగాణ ప్రతిపాదన సీమాంధ్ర నేతలదే'
న్యూఢిల్లీ : సీడబ్ల్యూసీ తీర్మానం మేరకే 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం 'సాక్షి' ప్రతినిధితో మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదనను సీమాంధ్ర నేతలు జీవోఎంపై గట్టి ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన తెలిపారు.
హైదరాబాద్ శాంతిభద్రతలు గవర్నర్ వద్ద ఉండే అవకాశం ఉందని డీఎస్ అన్నారు. తాత్కాలిక సర్ధుబాటే కాబట్టి ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు. భద్రాచలం సమస్య సాంకేతికమైందని అన్నారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం ప్రతిపాదన అసలు లేదని డీఎస్ పేర్కొన్నారు. కాగా ఈరోజు ఉదయం ఆయన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. జీవోఎం నివేదిక, రాయల తెలంగాణ ...తదితర అంశాలపై వారిరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.