మంచిర్యాల ఐటీఐలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ లింగమూర్తి లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకి చిక్కాడు.
ఆదిలాబాద్(మంచిర్యాల): మంచిర్యాల ఐటీఐలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ లింగమూర్తి లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకి చిక్కాడు. ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సంతోష్ నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
తన జీతానికి సంబంధించిన బిల్లులు పంపించటానికి లింగమూర్తి లంచం డిమాండ్ చేయటంతో సంతోష్ ఏసీబీ అధికారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి నిందితుడ్ని పట్టించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.