దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 6 పాయింట్లు తగ్గి 26,299 వద్ద నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 8,112 వద్ద ముగిశాయి.
ముంబై: ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఆరంభంలో భారీ లాభాలను నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగి, వరుసగా మూడో సెషన్లో కూడా నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 6 పాయింట్లు తగ్గి 26,299 వద్ద నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 8,112 వద్ద ముగిశాయి. రెండు రోజుల భారీ నష్టాల తరువాత దేశీ స్టాక్ మార్కెట్లు భారీ హెచ్చుతగ్గుల మధ్య కదలాడాయి. మిడ్ సెషన్ తరువాత అమ్మకాలు ఊపందుకోవడంతో నష్టాలలోకి జారుకున్నాయి. ముఖ్యంగా ఫార్మా, బ్యాంకింగ్, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్స్ రంగాలు నష్టపోగా ఐటీ, ఆటో వంటి రంగాలు స్వల్ప లాభాల్లో ముగిసాయి. మీడియా, ఐటీ, ఆటో షేర్ల లాభాలు మార్కెట్లకు అండగా నిలిచాయి. మరోవైపు బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ షేర్లలో అమ్మకాలజోరు కొనసాగింది.
ఏషియన్ పెయింట్స్, జీ, ఐషర్, టెక్‌మహీంద్రా, టీసీఎస్, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ, యస్‌బ్యాంక్ లాభాలను ఆర్జించగా హిందాల్కో, ఐటీసీ, అరబిందో, సిప్లా, అంబుజా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, కొటక్ బ్యాంక్, గెయిల్ నష్టపోయాయి. అటు టుబాకో రంగంలో ఎఫ్‌డిఐలపై నిషేధించేందుకు కేంద్రం యోచిస్తోందన్న వార్తలతో ఐటీసీ భారీగా నష్టపోయింది. దాదాపు 3 శాతం పతనమైంది.
అటు డాలర్ మారకపు విలువలో రూపాయి 9 పైసలు నష్టపోయి 67.83 వద్ద ఉంది.ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి స్వల్ప లాభంతో పది గ్రా. 29.321 వద్ద ఉంది.