న్యూఢిల్లీ: ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్, స్నాప్‌డీల్‌కు అందే మొత్తం ఆర్డర్లలో 30 శాతం మొబైల్ ఫోన్ల ద్వారానే వస్తున్నాయి. గత ఏడాది కాలంతో పోల్చితే ఇది 10 రెట్లు ఎక్కువని స్నాప్‌డీల్ పేర్కొంది. తమ ప్లాట్‌ఫామ్‌పై ఎం-కామర్స్(మొబైల్ ఆధారిత లావాదేవీలు) పోకడలపై ఈ సంస్థ ఇటీవల ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ-కామర్స్ భవిష్యత్ లావాదేవీలు అధికంగా మొబైళ్ల ద్వారానే జరుగనున్నాయని ఈ అధ్యయనం వెల్లడిస్తోందని వివరించింది. వివరాలు..
- స్నాప్‌డీల్ విజిట్స్ నెలకు సగటున 3.5-4 కోట్లుగా ఉన్నాయి.
- మొబైల్ కామర్స్ సైట్ విజిట్స్ నెలకు సగటున 1.2 కోట్లు ఉన్నాయి.
- మొబైల్ ఆధారిత లావాదేవీల్లో 75 శాతం వరకూ క్యాష్ ఆన్ డెలివరీవి కావడం విశేషం. మిగిలిన 25 శాతం ప్రి పెయిడ్ లావాదేవీలవి.
- మొత్తం వినియోగదారుల్లో మెజారిటీ భాగం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత, బెంగళూరు నగరాలకు చెందిన వారే ఉన్నారు.