పశ్చిమ బెంగాల్ మాల్డాలోని బీఎస్ఎఫ్ సైనిక శిబిరంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది.
కొల్కతా: పశ్చిమ బెంగాల్ మాల్డాలోని బీఎస్ఎఫ్ సైనిక శిబిరంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. శిబిరంలోని ఓ సైనికుడు తన వద్దనున్న తుపాకీతో సహచరులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఒకరు రక్తపు మడుగులో కుప్పకూలి మరణించాడు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని... విచారిస్తున్నారు. క్షతగాత్రులను మాల్డాలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.