నేను రాక్షసుడు.. ఆయన దైవదూతనా!
న్యూఢిల్లీ: బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మళ్లీ జులు విదిల్చారు. ద్రవ్య పరపతి పాలసీ విషయమై ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌పై మరోసారి విమర్శల వర్షం కురిపించారు. రాజన్‌పై స్వామి చేసిన ఆరోపణల్ని ప్రధాని నరేంద్రమోదీ కొట్టిపారేయడంతో నెలరోజులుగా ఆయన మౌనంగా ఉన్న సంగతి తెలిసిందే.
మీడియా తనను రాక్షసుడిగా, రాజన్‌ను 'దేవ దూత'గా మీడియా చిత్రిస్తున్నదని స్వామి మండిపడ్డారు. 'రాజన్ విషయంలో ఆయనకు దేశం మద్దతు పలికేలా బయటి శక్తులు మీడియాను ప్రేరేపిస్తున్నాయి. రాజన్ వెళ్లిపోతే స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయని భయపెడుతున్నాయి. నిజానికి రాజన్ పోతే మార్కెట్లు కుప్పకూలవు. అవి పైకి లేస్తాయి' అని స్వామి పేర్కొన్నారు. 'వడ్డీరేట్లను పెంచడం ద్వారా రాజన్ భారత ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తున్నారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు బ్యాంకుల రుణాలు పొందడం అసాధ్యంగా మార్చారు' అని ఆయన మండిపడ్డారు.