లక్నో: యూపీలో మైనింగ్ మాఫియాపై కఠినంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ విషయంలో ప్రభుత్వం దిగివచ్చింది. ఆమెపై సస్పెన్షన్‌ను ఉపసంహరించుకొంది. గౌతమబుద్ధ నగర్ స్పెషల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా ఆమెను పునర్నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తన సస్పెన్షన్‌పై దుర్గాశక్తి శనివారం సీఎం అఖిలేష్ యాదవ్‌ను కలసి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. కడలాపూర్ గ్రామంలో నిర్మాణంలోనున్న ఓ మసీదు గోడ కూల్చివేతకు ఆదేశాలిచ్చి మతసామరస్యానికి విఘాతం కలిగించారనే సాకుతో ప్రభుత్వం ఆమెను గత జూలై 27న సస్పెండ్ చేయడం తెలిసిందే.