న్యూఢిల్లీ: చమురు దిగుమతి బిల్లుల మోత, రూపాయి పతనం నేపథ్యంలో కష్టాలను గట్టెక్కడానికి సర్కారు నానా తంటాలు పడుతోంది. ఇంధన డిమాండ్‌ను తగ్గించడానికి రాత్రిపూట పెట్రోల్ బంకులను మూసేసే అంశంతోపాటు పలు అంశాలను పరిశీలిస్తున్నామని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. ‘రకరకాల అవకాశాలు, ఆలోచనలు వస్తున్నాయి. రాత్రిపూట బంకుల బంద్ వాటిలో ఒకటి. ఇది ప్రతిపాదన మాత్రమే.
ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇది నా ఆలోచన కాదు’ అని ఆయన ఆది వారం బెంగళూరులో చెప్పారు. దీనిపై బీజేపీ భగ్గుమంది. మెయిలీ వింత ప్రతిపాదన చేశారని మండిపడింది. ‘రాత్రుళ్లు బంకులను మూసేస్తే జనం పొద్దున పెట్రోలు పట్టించుకోరా? ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించే ఆలోచనలు మన్మో హన్ సర్కారు వద్ద లేకపోతే మా పార్టీ నుంచి సలహాలు తీసుకోవచ్చుగా’ అని పార్టీ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. కాగా, రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు పెట్రోల్ బంకులను మూయాలన్న ప్రతిపాదనేదీ తమ ముందు లేద ని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రే చెప్పారు.
రాత్రిపూట పెట్రోల్ బంద్!
Published Mon, Sep 2 2013 3:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
Advertisement
Advertisement