హైదరాబాద్: ఇంజనీరింగ్ పూర్తి కాగానే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేయాలని చాలా మంది విద్యార్థులు ఆశిస్తుంటారు. అది కూడా గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలైతే ఎగిరి గంతేస్తారు. ఈ కంపెనీల్లోనే కాదు ఎక్కడ ఉద్యోగం చేయాలన్నా ఆయా రంగాల్లో స్కిల్స్ ఉండటం చాలా ముఖ్యం. స్కిల్స్ ఉన్నవారిని ఏరికోరి ఆయా సంస్థలు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటుంటాయి. ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, డిజైనర్లు, ప్రాడక్ట్ మేనేజర్లు... ఇలా అనేక రంగాల్లో ఉద్యోగాల కోసం వెతుకుతున్న అభ్యర్థులకు ఆయా రంగాల్లో ప్రధానంగా ఏడు స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలని చెబుతున్నారు.
ఐటీ దిగ్గజాలు గానీ మరే ఇతర కంపెనీలుగానీ ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తుంటాయి. కొన్ని సంస్థలు సరైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి రిక్రూటింగ్ సంస్థలతో టైఅప్ చేసుకుంటాయి. అందులో పైసా అనే సంస్థ కూడా ఒకటి.
ఉదాహరణకు పైసా (paysa.com) అనే సంస్థ ఆయా ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వారికి సంబంధించి లక్షలాది బయోడెటాలను విశ్లేషిస్తుంది. అలా విశ్లేషించిన తర్వాత భాగస్వామి సంస్థలకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తుంది. ప్రధానంగా గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో పనిచేస్తున్న బయోడెటాలను నిశితంగా విశ్లేషించి వారి నైపుణ్యతను అంచనా వేస్తుంది. కామన్ గా అందరిలో ఉన్న స్కిల్స్ ఏంటన్నది బేరీజు వేస్తుంది. ఎందుకంటే భాగస్వామ్య సంస్థల్లో ప్రధానంగా అనుసరించే విధానాలు, అవసరమైన స్కిల్స్ ఏంటో వాటికి తెలుస్తుంది కాబట్టి... వాటి ఆధారంగా అభ్యర్థులను అంచనా వేస్తుంది.
గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్... ఈ మూడు కంపెనీలు మంచి ప్రమాణాలు పాటిస్తాయని అమెరికాకు చెందిన "బిజినెస్ ఇన్ సైడర్" ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మైక్టోసాఫ్ట్ కంపెనీలో 1,20,849 మంది నిపుణులు, ఆపిల్ సంస్థలో 1,00,000 మంది నిష్ణాతులు, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ) లో 61,000 మంది నిపుణులు పనిచేస్తున్నారు. ఇలాంటి సంస్థల్లో చేరాలంటే ఆ సంస్థలకు కావలసిన డిమాండ్ స్కిల్స్ ఏంటి? టెక్ కంపెనీలు ఏం కోరుకుంటున్నాయి? అన్న విషయాలపై అంచనా ఉంటే మంచిదని నిపుణుల సలహా. అన్ని వివరాలను తెలుసుకుని ఉంటే దానికనుగుణంగా టెకీలు సిద్ధం కావడం సులభవమతుందని చెబుతుంటారు.
ఉదాహరణకు:
పెద్ద కంపెనీలు ఏం చూస్తాయి: అభ్యర్థులకు ప్రధానంగా ఏం తెలిసి ఉండాలి
ఇంజనీర్లు :
1. సీ ++/సి/సి#
2. జావా
3. సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్
4. పైథాన్
5. జావా స్క్రిప్ట్
6. ఎజైల్ మెథడాలజీస్
7. ఎస్ క్యూఎల్
ప్రాడక్ట్ మేనేజర్స్ :
1. ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్
2. లీడర్ షిప్
3. కస్టమర్ సర్వీస్
4. స్ట్రాటజీ
5. క్లౌడ్ కంప్యూటింగ్
6. ప్రొడక్ట్ మార్కెటింగ్
7. ఎంటర్ ప్రైస్ మార్కెటింగ్
డాటా సైంటిస్ట్ :
1. డాటా అనాలసిస్
2. ఎస్ క్యూఎల్
3. ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్
4. మెచీన్ లర్నింగ్
5. డాటా మైనింగ్
6. బిజినెస్ అనాలసిస్
7. పైథాన్
డిజైనర్లు :
1. యూజర్ ఇంటర్ ఫేస్ డిజైన్
2. గ్రాఫిక్ డిజైన్
3. వెబ్ డిజైన్
4. ఫోటోషాప్
5. ఇలస్ట్రేషన్
6. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్
7. ఆర్ట్ డైరెక్షన్