
'3పీ'లతో లడఖ్ అభివృద్ధి: మోడీ
లెహ్: సియాచిన్‌పై రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్ పర్యటనకు వచ్చిన ప్రధాని ఆర్మీ జవాన్లను ఉద్దేశించిన ప్రసంగించారు. కాశ్మీర్ అభివృద్ధికి తన వంతు కృషి కృషి చేస్తానని హామీయిచ్చారు. ప్రజల ప్రేమే తనకు ఇక్కడికి రప్పించిందన్నారు. ఈ ప్రాంత బలమేంటో తనకు తెలుసునని, ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తెలుసునని అన్నారు.
లడఖ్ అభివృద్ధికి కోసం ఆయన '3పీ' ఫార్ములా ప్రకటించారు. ప్రకాష్(వెలుగు-విద్యుత్), పర్యావరణ్(పర్యావరణం), పర్యాటన్(పర్యాటకం)తో లడఖ్ అభివృద్ధికి పాటుపడతామన్నారు. నిమో బాగ్జో హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు. లెహ్-కార్గిల్-శ్రీనగర్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.