అత్యాచారానికి అడ్డుకట్ట ఎలా?
- సందర్భం
శాసనాల ద్వారా, దండనల ద్వారా తెచ్చే మార్పు కన్నా సంస్కృతీపరంగా తెచ్చే మార్పు.. మన సమాజంలో అత్యాచారాల వంటి దురాచారాలకు సరైన విరుగుడు అవుతుంది. సమస్య మూలాల్లోకి వెళ్లకపోవడమే అసలు సమస్య.
ఇటీవల ఢిల్లీలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. ఇరవై మూడేళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచార వికృత దాడి జరిగి నట్లు వార్త. తరచూ ఇలాంటి వార్తలు రోజూ మనదేశంలో ఎక్కడో ఒకచోట యథేచ్ఛగా జరు గుతుండడం సభ్య సమాజాన్ని కలవరపరుస్తున్నది. నిర్భయ ఘటన తర్వాత పటిష్టమైన చట్టాన్ని రూపొందించి, అమలు పరుస్తున్నప్పటికీ అలాంటి సంఘటనలే మాటిమాటికీ పున రావృతం కావడం తీవ్రంగా ఆలోచించవలసిన విషయమే.
పూర్వకాలంలో తమ తమ ఆచార వ్యవహారాలకు సంబంధించిన ‘సంస్కృతి’లో భాగంగా పిల్లలకు చిన్నతనం లోనే పెద్దలు విలువలు నేర్పించేవారు. మనది కుటుంబ వ్యవస్థ బలంగా, పునాదిగా ఉన్న దేశం కాబట్టి ఇంట్లో మగపిల్లలెవరైనా ఆడపిల్లల్ని మాటవరసకు ఆట పట్టించ డానికైనా ప్రయత్నిస్తే పెద్దలు నివారించేవారు. అదే భావన వారు పెరిగి పెద్దయిన తర్వాత కూడా కనబడేది.
దురదృష్టవశాత్తు ‘మార్కెట్ వ్యవస్థ’ దేశ సామాజిక స్థితిగతుల్ని నిర్దేశిస్తున్న తరుణంలో - ఇలాంటి సంఘట నలు విరివిగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరిగాయి. తాజాగా ఈ విషయానికి సంబంధించి ‘మూవ్ అప్’ పేరుతో పుస్తకం కూడా వచ్చింది. ఇందులో పురుషుల భౌతిక శరీర నిర్మాణాన్ని గురించి, నాడీ వ్యవస్థకు సంబంధించి ఎన్నో విషయాలు రచయిత ప్రస్తావించాడు. ముఖ్యంగా పశుపక్ష్యాదుల తర్వాత మాన వులలో కామవాంఛ బలంగా ఉంటుందని, దాని నియంత్ర ణకు అవసరమైన శాస్త్రీయ విజ్ఞానాన్ని పొందకపోతే అది ‘పశుప్రవృత్తి’ని ప్రేరేపిస్తుందని, చివరకు ఆ స్థితిలోకి వచ్చిన వారు నా రక్తం చెప్పేదే చేస్తాననే భావనకు వస్తారని, అలాంటి సందర్భాలలోనే ‘రేప్’ లాంటి సంఘటనలు జరు గుతాయని విశ్లేషించాడు.
సాధారణంగా మనం ఏదైనా ఒక తీవ్ర సంఘటన జరిగినప్పుడే అప్పటికప్పుడు స్పందించి ఏదో మొక్కు బడిగా ఒక నిర్ణయాన్ని, చట్టాన్ని తీసుకొని వస్తున్నాం. కానీ సమస్య మూలాల్లోకి వెళ్లడం లేదు. శాస్త్రీయమైన అవగాహన లేదు. విశ్లేషణ లేదు. అందుకే సమస్యల్ని పరిష్కరించలేక పోతున్నాం. ఈ నేపథ్యంలో పాఠశాల స్థాయిలో ‘‘సెక్స్ ఎడ్యు కేషన్’’ ప్రవేశపెట్టాలని కేంద్ర మానవ వనరుల శాఖ భావిస్తున్నది. విద్యార్థి దశలోనే బాలబాలికలకు శరీర నిర్మాణం, ఎదుగుదల, అంతరాలకు సంబంధించిన ఆరో గ్యపరమైన అవగాహనను కల్పించేందుకు ఈ చర్య దోహద పడుతుంది.
ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచార ఘటనలు పెచ్చరిల్లిపోతున్న ప్రస్తుత పరిస్థితులలో సెక్స్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునే ముందు - బాలబాలికలలో, యువతలో సాంస్కృతిక మార్పును తీసుకొని రావాలి.
శాసనాల ద్వారా, దండనల ద్వారా తెచ్చే మార్పు కన్నా సంస్కృతీపరంగా తెచ్చే మార్పు.. అత్యాచారాల వంటి దురాచారాలకు సరైన విరుగుడు అవుతుంది. అందుకు ప్రగతిశీలమైన విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలే కాకుండా ప్రజాసంఘాలు కూడా ముందుకు రావాలి.
తీవ్ర సమస్యలకు తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం కావాలంటే సామాజిక, సాంస్కృతిక పరి ణామం అవసరం. దీనిని నియంత్రించడం కేవలం విద్యతో మాత్రమే జరుగుతుంది. విద్యతో ఎలా నిరోధించవచ్చు అనేదానికి ‘పాల్ మ్యాక్ లెన్’ ఒక మ్యాపింగ్ సిస్టమ్‌ను రూపొందించాడు. దానిలో మూడు భాగాలు మనం గమనించవచ్చు. మొదటిది కార్‌టెక్స్ బ్రెయిన్ (ఇౌట్ట్ఛ్ఠ), రెండవది లింబిక్ బ్రెయిన్ (ఔజీఝఛజీఛి), మూడవది రిప్టిలియిన్ బ్రెయిన్ (ఖ్ఛఞ్టజీజ్చీ).
మొదటగా కార్‌టెక్స్‌లో భాషా సముపార్జన, ఒక నమూనా, సంగ్రహణం మరియు గ్రాహ్యతతో ఒక మానసిక విధానం అనేది రూపొందుతుంది. దీనిని మనం మానవ మెదడులో కీలకమైన భాగంగా కూడా గుర్తించవచ్చు. రెండవదైన లింబిక్ అనేది మానవుని ప్రవర్తనకు, భావో ద్వేగానికి, జ్ఞాపకానికి, ప్రేరేపణకు సహకరిస్తుంది. ఇకపోతే, రిప్టిలియిన్ బ్రెయిన్ అనేది స్వభావసిద్ధమైన దూకుడును నియంత్రిస్తుంది. కాబట్టి మొదటి రెండింటిలో కనుక మనం మార్పును తీసుకువస్తే చివరకు మానవ వికృత బుద్ధిని తగ్గించవచ్చు. పై రెండింటిలో మార్పును తీసుకురావడం కేవలం విద్యతో మాత్రమే జరిగే పని. కేంద్ర ప్రభుత్వం సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చర్చిస్తున్న వేళ వీటిని గమనించి దానికి తగిన బుద్ధులను మానవుని వివిధ భాగాలలో కల్పిస్తే మనం అత్యాచార ఘటనలకు స్వస్తి చెప్పేందుకు వీలుంటుంది.
- చుక్కా రామయ్య
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త
శాసనమండలి మాజీ సభ్యులు