Herschelle Gibbs
-
టీమిండియాతో సిరీస్.. సౌతాఫ్రికాదే గెలుపు: సిక్సర్ల వీరుడి కామెంట్స్ వైరల్
టీ20 సిరీస్‌లో చెరో విజయంతో సమంగా ఉన్న టీమిండియా- సౌతాఫ్రికా మరో కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది. ఇందులో గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని ఇటు సూర్య సేన.. అటు ప్రొటిస్ జట్టు తహతహలాడుతున్నాయి.మొదటి రెండు టీ20లలో అలాఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదటి రెండు టీ20లలో పిచ్‌లు భారత జట్టుకే అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. టీ20 మ్యాచ్‌లలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని.. అయితే, టీమిండియాపై తమ జట్టు పైచేయి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.టీమిండియాతో సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంటుందని హర్షల్ గిబ్స్ విశ్వాసం కనబరిచాడు. ఇందుకు గల కారణాన్ని విశ్లేషిస్తూ.. ‘‘ఈ ఫార్మాట్లో ఏదైనా జరగవచ్చు. నాకు తెలిసి ఇప్పటి వరకు వికెట్ టీమిండియాకే అనుకూలించింది. అయితే, సెంచూరియన్, జొహన్నస్‌బర్గ్ మ్యాచ్‌లలో మాత్రం భారీస్కోర్లు నమోదవుతాయని భావిస్తున్నా.3-1తో ప్రొటిస్ జట్టుదే సిరీస్ఆ రెండు మ్యాచ్‌లలో ఏదైనా జరగొచ్చు. తొలి రెండు టీ20లలో ప్రొటిస్ పూర్తిస్థాయి, పటిష్ట జట్టుతోనే బరిలోకి దిగింది. అయితే, టీమిండియా మాత్రం అనుభవలేమి ఆటగాళ్లతో ఇక్కడికి వచ్చింది. నా అంచనా ప్రకారం ఈ సిరీస్‌ను 3-1తో ప్రొటిస్ జట్టు సొంతం చేసుకుంటుంది’’ అని హర్షల్ గిబ్స్ పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్బూమ్తో వ్యాఖ్యలు చేశాడు.మిగిలిన రెండు టీ20లలోకాగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డర్బన్ వేదికగా తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, గెబెహాలో జరిగిన రెండో టీ20లో భారత బౌలర్లు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తదుపరి సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో బుధవారం మూడో టీ20... అదే విధంగా.. శుక్రవారం జొహన్నస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియంలో ఆఖరి టీ20 జరుగునున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8.30 నిమిషాలకు మొదలయ్యేలా షెడ్యూల్ ఖరారైంది.ప్రపంచ రికార్డు ఖాతాలో వేసుకునిఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా హర్షల్ గిబ్స్ చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకున్నాడు. 2007లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో డాన్ వాన్ బంగ్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు.ఇక గిబ్స్ తర్వాత వన్డేల్లో జస్కరన్ మల్హోత్రా (అమెరికా) పాపువా న్యూగినియాతో 2021 నాటి మ్యాచ్‌లో మళ్లీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్; 2007లో) బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. తర్వాత వెస్టిండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ శ్రీలంక బౌలర్ అఖిల ధనంజయ(2021లో) బౌలింగ్‌లో ఈ ఘనత సాధించాడు.సౌతాఫ్రికాతో టీ20లకు భారత జట్టుసంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అవేశ్ ఖాన్, జితేశ్ శర్మ, విజయ్‌కుమార్ వైశాఖ్, రమణ్‌దీప్ సింగ్, యశ్ దయాళ్.సౌతాఫ్రికా జట్టురియాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఆండిలే సిమెలేన్, గెరాల్డ్ కొయెట్జీ, కేశవ్ మహారాజ్, నకబయోమ్జీ పీటర్, పాట్రిక్ క్రూగర్, మిహ్లాలీ ఎంపోంగ్వానా, డోనోవన్ ఫెరీరా, ఒట్నీల్ బార్ట్‌మన్, లుథో సిపామ్లా.చదవండి: BGT: బీసీసీఐ కీలక నిర్ణయం!.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్! -
దంచికొట్టిన పెరీరా.. హెర్షల్ గిబ్స్ జట్టు ఘన విజయం
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL 2024) ఎనిమిదో మ్యాచ్‌లో హెర్షల్ గిబ్స్ సారథ్యం వహిస్తున్న రెడ్ కార్పెట్ ఢిల్లీ జట్టు.. ముంబై ఛాంపియన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఛాంపియన్స్.. ఆష్లే నర్స్ (4-0-33-3), విక్రాంత్ శర్మ (4-0-21-3), ఒమర్ ఆలమ్ (2-0-7-1), ఆసేల గుణరత్నే (1-0-4-1) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్‌లో అభిషేక్ ఝున్‌ఝున్‌వాలా (38) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పీటర్ ట్రెగో (27), అమిత్ సనన్ (22), వి సోలంకి (14), వినయ్ యాదవ్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. తిసారా పెరీరా (27 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) విజృంభించడంతో 14.4 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి (26), కెప్టెన్ గిబ్స్ (14), గుణరత్నే (17) వేగంగా పరుగులు సాధించారు. ముంబై బౌలర్లలో సోలంకి 2, రాష్ట్రదీప్ యాదవ్, పీటర్ ట్రెగో, వినయ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ లీగ్‌లో రేపు జరుగుబోయే మ్యాచ్‌ల్లో రాజస్థాన్ లెజెండ్స్, చత్తీస్ఘడ్ వారియర్స్.. వీవీఐపీ ఉత్తర్‌ప్రదేశ్, ముంబై ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. -
'అతడు అన్‌ఫిట్.. కెప్టెన్‌గానే కాదు ఆటగాడిగా కూడా పనికిరాడు'
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా మరోసారి గాయం బారిన పడ్డాడు. సెంచూరియన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బావుమా గాయపడ్డాడు. మొదటి రోజు ఆట సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా బావుమా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లావిల్లాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికీ నొప్పి ఎక్కువగా ఉండడంతో అతడు మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత అతడిని స్కానింగ్ తరలించారు. ఎడమ తొడ కండరాల్లో నరం పట్టేసినట్లు తేలింది. దీంతో ఈ మ్యాచ్‌తో పాటు రెండో టెస్టుకు అతడు అందుబాటుపై సందేహం నెలకొంది. బావుమా ఫీల్డ్ నుంచి వైదొలగడంతో వెటరన్ ఓపెనర్ డీన్ ఎల్గర్ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో బావుమాపై ప్రోటీస్ మాజీ ఓపెనర్ హెర్షెల్ గిబ్స్ విమర్శల వర్షం కురిపించాడు. అతడికి పూర్తి ఫిట్నెస్ లేకపోయినప్పటికీ అవకాశాలు ఎలా ఇస్తున్నారని గిబ్స్ మండిపడ్డాడు. అన్‌ఫిట్ ప్లేయరని, అధిక బరువతో బాధపడుతున్నాడని తీవ్ర స్ధాయిలో విరుచుపడ్డాడు. '2009లో సౌతాఫ్రికా ట్రైనర్‌గా ప్రారంభించి టీమ్ హెడ్ కోచ్‌గా మారిన వ్యక్తి.. అన్‌ఫిట్, అధిక బరువున్న ఆటగాళ్లను మ్యాచ్ ఆడటానికి అనుమతించడం హాస్యాస్పదంగా ఉంది.'అని హెర్షల్ గిబ్స్ ట్వీట్ చేశాడు. కాగా ప్రస్తుతం ప్రోటీస్ హెడ్ కోచ్‌గా ఉన్న షుక్రి కాన్రాడ్ గతంలో దక్షిణాఫ్రికా ఫిట్నెస్ ట్రైనర్‌గా పని చేశారు. -
SA Vs Aus: వరుసగా రెండో సెంచరీ! ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన డికాక్
ICC WC 2023- Australia vs South Africa- Quinton De Kock: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా పలు అరుదైన ఘనతలు సాధించాడు. లక్నో వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్ జట్టుకు క్వింటన్ డికాక్ సెంచరీతో శుభారంభం అందించాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 29.5వ ఓవర్లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో సిక్సర్ బాది వంద పరుగులు చేసుకున్నాడు. వరుసగా రెండో సెంచరీ ప్రపంచకప్-2023లో వరుసగా రెండోసారి సెంచరీ సాధించి.. అంతర్జాతీయ వన్డేల్లో 19వ శతకం నమోదు చేశాడు. ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్(4) తర్వాత ఈ ఘనత సాధించిన హషీం ఆమ్లా(2), ఫాఫ్ డుప్లెసిస్(2), హర్షల్ గిబ్స్(2)లతో సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. రెండో ప్రొటిస్ బ్యాటర్‌గా అదే విధంగా సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఓపెనర్‌గా చరిత్రకెక్కాడు. ఈ ఎలైట్ లిస్టులో హషీం ఆమ్లా 27 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. 19 సెంచరీలతో డికాక్ అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలో హర్షల్ గిబ్స్(18)ను అధిగమించాడు. గిబ్స్ అరుదైన రికార్డు బ్రేక్ అంతేగాక వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా మీద అత్యధిక వ్యక్తిగత స్కోరు(109) సాధించిన తొలి సౌతాఫ్రికా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో హర్షల్ గిబ్స్(1999లో- 101 పరుగులు) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో 100 పరుగులతో ఫాఫ్ డుప్లెసిస్(2019) మూడో స్థానంలో ఉన్నాడు. కాగా ఆసీస్ మీద ఓవరాల్‌గా డికాక్‌కు ఇది మూడో శతకం. ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో 35వ ఓవర్ ఐదో బంతికి ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ డికాక్‌ను బౌల్డ్ చేయడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఈ మ్యాచ్‌లో ఎయిడెన్ మార్కరమ్ అర్ధ శతకంతో రాణించగా నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది. చదవండి: WC 2011లో నేనే కెప్టెన్ అయి ఉంటే అతడిని తప్పక తీసుకునేవాడిని.. కానీ! View this post on Instagram A post shared by ICC (@icc) -
రుతురాజ్ది ప్రపంచ రికార్డే! కానీ.. అతడు ఒకే ఓవర్లో ఏకంగా 8 సిక్స్‌లు కొట్టాడు!
Cricketers Who Hits 6 Sixes In An Over- Entire List: అంతర్జాతీయ వన్డేల్లో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టారు. అంతర్జాతీయ టి20ల్లో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఓవర్లో 6 సిక్సర్లతో చెలరేగారు. దేశవాళీ వన్డేల్లో ఒక ఆటగాడు ఓవర్లో 6 సిక్సర్లతో సత్తా చాటాడు. దేశవాళీ టి20ల్లో ముగ్గురు బ్యాటర్లు ఓవర్లో 6 సిక్సర్లతో దూకుడు ప్రదర్శించారు. వీరంతా ఓవర్లో ఆరేసి సిక్సర్లతో పండగ చేసుకున్నారు. ఇదంతా ఇప్పటి వరకు రికార్డు... కానీ ఇప్పుడు దీన్ని దాటి ఒకే ఓవర్లో 7 సిక్సర్లతో కొత్త ఘనత నమోదైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ నోబాల్ సహా 7 బంతుల్లో సిక్సర్లు బాది లిస్ట్–ఎ (దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు) క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే, స్ట్క్లాస్ క్రికెట్లో (టెస్టులు, మూడు, నాలుగు రోజుల మ్యాచ్‌లు) మాత్రం రికార్డు లీ జెర్మన్ (8 సిక్స్‌లు) పేరిట ఉంది. లీ జెర్మన్ కొట్టిన మ్యాచ్‌లో... న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ లీ జెర్మన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 8 సిక్సర్లు కొట్టడం అధికారికంగానే నమోదై ఉంది. అయితే ఆ మ్యాచ్ జరిగిన తీరు పూర్తిగా భిన్నమైంది. వెల్లింగ్టన్ కెప్టెన్ మెక్ స్వీనీ ‘ప్రత్యేక వ్యూహం’లో భాగంగా ఇదంతా జరిగింది. 59 ఓవర్లలో 291 పరుగులు ఛేదించే క్రమంలో కాంటర్బరీ 108/8 వద్ద నిలిచింది. అయితే ఆ జట్టును అంత సులువుగా ఓడించరాదని, సులభంగా పరుగులు ఇచ్చి కాస్త ఆడిద్దామని వెల్లింగ్టన్ భావించింది. ఒకదశలో స్కోరు 196/8కు చేరింది. మరో 2 ఓవర్లు మిగలగా.. అసలు బౌలింగ్ రాని వాన్స్ చేతికి బంతి ఇచ్చారు. అతను ఓవర్లో ఏకంగా 17 నోబాల్స్ సహా 22 బంతులు వేశాడు. అంటే 5 బంతులే! ఇందులోనే లీ జెర్మన్ 8 సిక్స్‌లు బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 77 పరుగులు (0,4,4,4,6,6,4,6,1,4,1,0,6,6,6,6,6,0,0,4,0,1) వచ్చాయి. ఇప్పటికీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే. చివరకు మ్యాచ్ ‘డ్రా’ అయింది. మరిన్ని రికార్డులు ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డు సమమైంది. 2018లో న్యూజిలాండ్‌లో ఫోర్డ్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ డిస్ట్రిక్స్తో జరిగిన మ్యాచ్‌లో నార్తర్న్ డిస్ట్రిక్స్ నమోదు చేసింది. అయితే ఇందులో బ్రెట్ హామ్టన్ 23 పరుగులు, జో కార్టర్ 18 పరుగులు రాబట్టారు. భారత్ తరఫున రోహిత్ శర్మ (3 సార్లు), సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, పృథ్వీ షా, శిఖర్ ధావన్, సమర్థ్ వ్యాస్, కరణ్ కౌశల్ తర్వాత లిస్ట్–ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన పదో భారత ఆటగాడిగా రుతురాజ్ నిలిచాడు. ఓవర్లో 6 సిక్సర్ల వీరులు అంతర్జాతీయ వన్డేలు ►హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా)- బౌలర్: డాన్ వాన్ బంగ్ (నెదర్లాండ్స్; 2007లో) ►జస్కరన్ మల్హోత్రా (అమెరికా)- బౌలర్: గౌడీ టోకా (పాపువా న్యూగినియా; 2021లో) అంతర్జాతీయ టి20లు ►యువరాజ్ (భారత్) బౌలర్- స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్; 2007లో) ►కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్) బౌలర్- అఖిల ధనంజయ (శ్రీలంక; 2021లో) ఫస్ట్ క్లాస్ క్రికెట్ ►సోబర్స్ (నాటింగమ్‌షైర్ కౌంటీ)- బౌలర్: నాష్ (గ్లామోర్గాన్; 1968లో) ►రవిశాస్త్రి (ముంబై)- బౌలర్: తిలక్ రాజ్ (బరోడా; 1984లో) ►లీ జెర్మన్ (కాంటర్ బరీ)- బౌలర్: వాన్స్ (వెల్లింగ్టన్; 1990లో) దేశవాళీ వన్డేలు ►తిసారా పెరీరా (శ్రీలంక; శ్రీలంక ఆర్మీ స్పోర్ట్స్ క్లబ్)- బౌలర్: దిల్హాన్ కూరే (బ్లూమ్‌ఫీల్డ్; 2021లో) ►రుతురాజ్ గైక్వాడ్ (భారత్; మహారాష్ట్ర)- బౌలర్: శివ సింగ్ (ఉత్తరప్రదేశ్; 2022లో) దేశవాళీ టి20లు ►రోజ్ వైట్లీ (వొర్స్‌టర్‌షైర్) - బౌలర్: కార్ల్ కార్వర్ (యార్క్‌షైర్; 2017లో) ►లియో కార్టర్ (కాంటర్బరీ) - బౌలర్: ఆంటన్ డెవ్‌సిచ్ (నార్తర్న్ డిస్ట్రిక్ట్స్; 2020లో) ►హజ్రతుల్లా జజాయ్ (కాబూల్ జ్వానన్)- బౌలర్: అబ్దుల్లా మజారి (బాల్క్ లెజెండ్స్; 2018లో) చదవండి: Christiano Ronaldo: రొనాల్డోకు బంపరాఫర్ .. ఏడాదికి రూ.612 కోట్లు! Indian Captain: హార్దిక్‌తో పాటు టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ యువ ప్లేయర్ కూడా! జట్టులో చోటుకే దిక్కులేదు! 6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣ Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥 Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES — BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022 -
కశ్మీర్ లీగ్ ఎఫెక్ట్: హర్షల్ గిబ్స్‌పై వేటు.. గంగూలీపై ప్రశంసలు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం) సంబురాల్లో భాగంగా బీసీసీఐ నిర్వహించతలపెట్టిన లెజెండ్స్ క్రికెట్ లీగ్ (రెండో సీజన్) సెప్టెంబర్ 16న ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో భారత లెజెండ్స్ ఎలెవెన్ జట్టు.. వరల్డ్ లెజెండ్స్ ఎలెవన్ టీమ్‌తో తలపడనుంది. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఈ లీగ్‌లో భారత లెజెండ్స్ ఎలెవన్ తరఫున ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు. భారత్ లెజెండ్స్ టీమ్‌కు గంగూలీ సహా పలువురు భారత దిగ్గజ క్రికెటర్లు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. వరల్డ్ లెజెండ్స్ జట్టు తరఫున వివిధ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. కాగా, వరల్డ్ లెజెండ్స్ టీమ్‌కు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్‌ను ఎంపిక చేయడం వివాదాస్పదంగా మారింది. గిబ్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహించిన కశ్మీర్ టీ20 లీగ్‌లో పాల్గొనడమే ఇందుకు కారణం. గిబ్స్ ఎంపికపై భారత క్రికెట్ అభిమానలు సోషల్‌మీడియా వేదికగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటూ పాక్ లీగ్‌లో పాల్గొన్న ఆటగాడిని భారత్‌లో ఎలా ఆడనిస్తారని మండిపడుతున్నారు. ఈ విషయంలో నెటిజన్లు బీసీసీఐ బాస్ గంగూలీని టార్గెట్ చేశారు. దీంతో అప్రమత్తమైన దాదా.. గిబ్స్‌ను లెజెండ్స్ లీగ్ నుంచి తప్పించి, షేన్ వాట్సన్‌ని అతని స్థానంలో భర్తీ చేశాడు. గంగూలీ నిర్ణయంతో సంతృప్తి చెందిన అభిమానులు విమర్శించిన నోళ్లతోనే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కశ్మీర్ లీగ్‌లో పాల్గొనకూడదని బీసీసీఐ గతంలో ప్రపంచదేశాల క్రికెటర్లను ఆదేశించింది. అయితే గిబ్స్ బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసి కశ్మీర్ లీగ్‌లో పాల్గొన్నాడు. చదవండి: పసికూనపై పాక్ బ్యాటర్ ప్రతాపం.. టీమిండియాతో ఆడి చూపించు! -
ఇండియా మహరాజాస్‌తో మ్యాచ్.. సనత్ జయసూర్య అవుట్! షేన్ వాట్సన్ ఇన్
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 ఓ ప్రత్యేకమైన మ్యాచ్‌తో ఆరంభం కానుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ఓ చారటీ మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఇప్పటికే ఇరు జట్లను ఆయా మేనేజ్మెంట్లు ప్రకటించాయి. ఇండియా మహరాజాస్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. వరల్డ్ జెయింట్స్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు. అయితే తాజాగా వరల్డ్ జెయింట్స్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హర్షల్ గిబ్స్, శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య దూరమయ్యారు. వీరిద్దరి స్థానంలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరి, ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ జట్టులో చేరారు. ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ తర్వాత సెప్టెంబరు 17 నుంచి అసలు పోటీ ఆరంభం కానుంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్-2లో టైటిల్ కోసం నాలుగు జట్లు తలపడబోతున్నాయి. ఈ సీజన్లో మొత్తం 15 మ్యాచ్‌లు ఉంటాయి. ఇండియా మహరాజాస్ జట్టు: సౌరవ్ గంగూలీ(కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్,యూసఫ్ పఠాన్, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్(వికెట్ కీపర్), స్టువర్ట్ బిన్నీ, ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా(వికెట్ కీపర్), అక్షశ్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ జడేజా, ఆర్పీ సింగ్, జోగీందర్ శర్మ, రితేందర్ సింగ్ సోధి. వరల్డ్ జెయింట్స్ జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), లెండిల్ సిమన్స్, డానియల్ వెటోరి, జాక్వస్ కలిస్, షేన్ వాట్సన్, మాట్ ప్రియర్(వికెట్ కీపర్), నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హోమిల్టన్ మసకజ్ద, మష్రాఫ్ మోర్తజా, అస్గర్ అఫ్గన్, మిచెల్ జాన్సన్, బ్రెట్ లీ, కెవిన్ ఒ బ్రెయిన్, దినేశ్ రామ్‌దిన్(వికెట్ కీపర్). చదవండి: Hundred Tourney: సిక్సర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించిన ప్రొటిస్ బ్యాటర్ -
బీసీసీఐ బెట్టు.. ఆ టోర్నీపై నీలి నీడలు?
కశ్మీర్ ప్రీమియర్ లీగ్ టోర్నీ నిర్వహణపై నెమ్మదిగా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ కేపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. భారత్-పాక్ ‘కశ్మీర్’ వివాదాల నడుమ తలదూర్చడం తనకు ఇష్టం లేదని పనేసర్ ఓ ట్వీట్ కూడా చేశాడు. దీంతో పనేసర్ దారిలో మరికొందరు ఆటగాళ్లు పయనించే అవకాశం ఉందని, టోర్నీ జరగడం అనుమానమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం ఓ భారత మీడియా హౌజ్‌తో మాట్లాడిన పనేసర్.. బీసీసీఐ తీరును పరోక్షంగా తప్పుబట్టాడు. రాజకీయాలు-ఆటలు ఒక్కటి కాదనే విషయం గుర్తుంచుకోవాలని సూచించాడు. ‘ఆడడం ఆడకపోవడం ఆటగాళ్ల ఇష్టం. నాకు ఈసీబీ(ఇంగ్లండ్ బోర్డు) నుంచి స్పష్టమైన సందేశాలు వచ్చాయి. అయితే ఆడితే తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కుంటారో ఆ ఆటగాళ్లకు తెలుసు’ అంటూ పనేసర్ వ్యాఖ్యలు చేశాడు. I have decided not to participate in the KPL because of the political tensions between India and Pakistan over kashmir issues. I don't want to be in the middle of this , it would make me feel uncomfortable. #KPL2021 #Kashmir #india #Cricket #Pakistan #ENGvIND #TheHundred — Monty Panesar (@MontyPanesar) August 1, 2021 ఇక దాయాది దేశాల మధ్య సరిహద్దులో ఉద్రిక్తలు కొనసాగుతున్న టైంలో.. పీవోకేలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఈ లీగ్‌ను నిర్వహించడం విమర్శలకు దారితీసింది. ఈ తరుణంలో బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహణకు గుర్తింపు ఇవ్వొద్దని, జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని ఐసీసీకు నిన్న ఒక లేఖ రాసింది కూడా. దీంతో పాక్ ప్లేయర్లు, రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో బీసీసీఐపై మండిపడ్డారు. అయితే ఎట్టిపరిస్థితుల్లో టోర్నీ నిర్వహణ ఆగదని స్పష్టం చేసింది. మరోవైపు పీవోకే లీగ్‌లో ఆడబోయే ఆటగాళ్లపై బీసీసీఐ బెదిరింపులకు పాల్పడుతోందనే, ఈ మేరకు భవిష్యత్తులో జరగబోయే టోర్నీల్లో నిషేధం విధిస్తామని ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ హర్షల్ గిబ్స్ బీసీసీఐని తప్పుబడుతూ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించాడు. కేపీఎల్ ఆడితే.. ఇక తనను ఏ టోర్నీలకు తీసుకోమని బీసీసీఐ బెదిరిస్తోందని ఆరోపించాడు. అయితే బీసీసీఐ మాత్రం ఆ ఆరోపణల్ని ఖండించింది. కాగా ఆగస్టు 6 నుంచి మొదలుకానున్న కేపీఎల్ టోర్నీలో ఓవర్సీస్ వారియర్స్, ముజఫర్బాద్ టైగర్స్, రావల్కోట్ హాక్స్, బాగ్ స్టాలియన్స్, మీర్పూర్ రాయల్స్, కోట్లీ లయన్స్ టీమ్‌లుగా ఉన్నాయి. ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాహిద్ అఫ్రిది, షాబాద్ ఖాన్, షోయబ్ మాలిక్, కమ్రాన్ అక్మల్‌లు ఈ ఆరు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఇక ఈ టోర్నీ నిర్వహణకు మరో నాలుగు రోజుల టైం ఉండగా.. బంతి ఇప్పుడు ఐసీసీ కోర్టులోనే ఉంది. -
బీసీసీఐ నన్ను బెదిరిస్తోందంటూ మాజీ క్రికెటర్ ఆరోపణలు
ఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ హర్షలే గిబ్స్ బీసీసీఐని తప్పుబడుతూ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించాడు. పాకిస్తాన్లో జరగబోయే కశ్మీర్ ప్రీమియర్ లీగ్(కేపీఎల్ 2021)లో పాల్గొనడానికి వీలేదని.. ఒకవేళ ఆడితే మాత్రం భవిష్యత్తులో భారత్‌లో జరిగే క్రికెట్ టోర్నీలు సహా క్రీడా కార్యక్రమాలకు అనుమతించమని బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసిందంటూ తెలిపాడు.అయితే గిబ్స్ ఆరోపణలపై బీసీసీఐ స్పందించలేదు. విషయంలోకి వెళితే... వచ్చే నెల ఆగస్టు 6 నుంచి కేపీఎల్ 2021 సీజన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో గిబ్స్ సహా లంక మాజీ ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ సహా మరికొందరు క్రికెటర్లు కూడా ఆడనున్నారు. అయితే గిబ్స్ ట్విటర్ వేదికగా బీసీసీఐపై ఆరోపణలు చేశాడు. ''కశ్మీర్ ప్రీమియర్ లీగ్(కేపీఎల్)ను బీసీసీఐ రాజకీయ అంశంతో ముడిపెడుతుంది. నన్ను కేపీఎల్‌లో ఆడకుండా బీసీసీఐ అడ్డుపడుతుందని.. అంతేగాక ఒకవేళ లీగ్‌లో పాల్గొంటే భవిష్యత్తులో భారత్‌లో జరిగే ఎలాంటి క్రీడా కార్యక్రమాలకు అనుమతి ఇవ్వమని హెచ్చరికలు జారీ చేసింది. బీసీసీఐ అభ్యంతరం చెప్పడం నాకు నచ్చలేదు.. ఈ అంశం నన్ను చాలా బాధించింది'' అంటూ ట్వీట్ చేశాడు. ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ కూడా బీసీసీఐని తప్పుబడుతూ ట్వీట్ చేశాడు. కాగా ఆగస్టు 6 నుంచి మొదలుకానున్న కేపీఎల్ టోర్నీలో ఓవర్సీస్ వారియర్స్, ముజఫర్బాద్ టైగర్స్, రావల్కోట్ హాక్స్, బాగ్ స్టాలియన్స్, మీర్పూర్ రాయల్స్, కోట్లీ లయన్స్ టీమ్‌లుగా ఉన్నాయి. ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాహిద్ అఫ్రిది, షాబాద్ ఖాన్, షోయబ్ మాలిక్, కమ్రాన్ అక్మల్‌లు ఈ ఆరు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. Completely unnecessary of the @BCCI to bring their political agenda with Pakistan into the equation and trying to prevent me playing in the @kpl_20 . Also threatening me saying they won’t allow me entry into India for any cricket related work. Ludicrous 🙄 — Herschelle Gibbs (@hershybru) July 31, 2021 -
వాండరర్స్‌లో వండర్ వన్డే
వన్డేల్లో పరుగుల విధ్వంసం అంటే ఏమిటో ఆ మ్యాచ్ చూపించింది. ఒకరితో మరొకరు పోటీ పడి పరుగుల వరద పారించడం అంటే ఎలా ఉంటుందో వాండరర్స్ మైదానంలో కనిపించింది. రెండు అగ్రశ్రేణి జట్లు కొదమ సింహాల్లా భీకరంగా తలపడుతుంటే అటు మైదానంలో, ఇటు టీవీల్లో ప్రేక్షకులు కన్నార్పకుండా చూశారు. అప్పటికి ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆస్ట్రేలియా 434 పరుగులు నమోదు చేసి సవాల్ విసిరితే మరో జట్టయితే మైదానంలో దిగక ముందే చేతులెత్తేసేదేమో. కానీ దక్షిణాఫ్రికా అలా చేయలేదు. విజయం కోసం తుదికంటా పోరాడింది. ఒక వికెట్ చేతిలో, ఒక బంతి మిగిలి ఉండగా లక్ష్యం చేరి గర్జించింది. మొత్తంగా వన్డే క్రికెట్ చరిత్రలో అత్యద్భుతమైన మ్యాచ్‌గా ఆ పోరు నిలిచిపోయింది. మార్చి 12, 2006, జొహన్నెస్‌బర్గ్... టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడమ్ గిల్‌క్రిస్ట్ (44 బంతుల్లో 55; 9 ఫోర్లు) తనదైన శైలిలో దూకుడగా ఆడగా, మరో ఓపెనర్ సైమన్ కటిచ్ (90 బంతుల్లో 79; 9 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. వీరిద్దరు 15.2 ఓవర్లలో 97 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్ రికీ పాంటింగ్ (105 బంతుల్లో 164; 13 ఫోర్లు, 9 సిక్సర్లు) బరిలోకి దిగి ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. 2003లో ఇదే మైదానంలో భారత్‌పై ప్రపంచకప్ ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తూ మెరుపు బ్యాటింగ్ ప్రదర్శించాడు. ఏ ఒక్క బౌలర్‌నూ వదిలిపెట్టకుండా మైదానం నలుమూలలా షాట్లు బాదాడు. 71 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. తర్వాత వచ్చిన మైక్ హస్సీ (51 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగిపోవడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. 39.5 ఓవర్లలో ఆసీస్ స్కోరు 300 పరుగులు దాటగా, 47 ఓవర్లలో ఆ జట్టు 400 పరుగుల మైలురాయిని అధిగమించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 4 వికెట్లకు 434 పరుగులు చేసింది. స్మిత్ దూకుడు... అసాధ్యంగా కనిపించిన ఛేదనలో దక్షిణాఫ్రికా రెండో ఓవర్లోనే డిపెనార్ (1) వికెట్ కోల్పోయింది. అయితే హెర్షల్ గిబ్స్ (111 బంతుల్లో 175; 21 ఫోర్లు, 7 సిక్సర్లు) వీర బాదుడుతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. మరోవైపు తన స్వభావానికి విరుద్ధంగా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (55 బంతుల్లో 90; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా చెలరేగిపోయాడు. 79 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న గిబ్స్ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. అతను అవుటయ్యే సమయానికి సఫారీలు 18.1 ఓవర్లలో మరో 136 పరుగులు చేయాల్సి ఉండటంతో కష్టంగా అనిపించింది. కలిస్ (20), డివిలియర్స్ (14) కూడా విఫలమయ్యారు. అయితే లోయర్ ఆర్డర్లో వాండర్వాత్ (18 బంతుల్లో 35; ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్... మరోవైపు వికెట్ కీపర్ మార్క్ బౌచర్ (43 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు) పట్టుదలగా నిలబడి జట్టును విజయంవైపు నడిపించాడు. దక్షిణాఫ్రికా విజయానికి చివరి 5 ఓవర్లలో 47 పరుగులు కావాల్సి ఉండగా... ఆ జట్టు 4 ఓవర్లలో 40 పరుగులు చేసింది. బ్రెట్‌లీ వేసిన చివరి ఓవర్లో 7 పరుగులు అవసరం కాగా... తొలి 3 బంతుల్లో 5 పరుగులు వచ్చాయికానీ 9వ వికెట్ కూడా పడింది. తీవ్ర ఒత్తిడిలో నాలుగో బంతికి ఎన్తిని సింగిల్ తీయగా, ఐదో బంతికి ఫోర్ కొట్టి బౌచర్ మ్యాచ్ ముగించాడు. దాంతో దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 9 వికెట్లకు 438 పరుగులు చేసి గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో సొంతం చేసుకుంది. బౌచర్ విక్టరీ షాట్ తర్వాత సఫారీ శిబిరంలో సంబరాలకు అంతు లేకుండా పోయింది. అయితే ఆసీస్ ఆటగాళ్లు కూడా పెద్దగా నిరాశ చెందలేదు. చరిత్రకెక్కిన ఒక మ్యాచ్‌లో భాగమైనందుకు ఆటగాళ్లందరూ గర్వించారు. ► వన్డేల్లో ఒక జట్టు 400కు పైగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి. ► వన్డేల్లో అత్యధిక పరుగుల ఛేదన రికార్డు... ఒకే వన్డేలో అత్యధిక పరుగులు (872) నమోదైన రికార్డు ఈ మ్యాచ్ పేరిటే ఉన్నాయి. ► గిబ్స్ 175 పరుగులు చేసి 31.5వ ఓవర్లో అవుటయ్యాడు. అప్పుడే డబుల్ సెంచరీకి అవకాశం కనిపించింది కానీ సాధ్యం కాలేదు. ► మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ మిక్ లూయిస్ 10 ఓవర్లలో 113 పరుగులు ఇవ్వడం ఇప్పటికీ వన్డేల్లో అతి చెత్త రికార్డుగా నమోదై ఉంది. ఈ మ్యాచ్ తర్వాత లూయిస్ మళ్లీ ఆసీస్‌కు ఆడలేకపోయాడు. ► దక్షిణాఫ్రికా బౌలర్ టెలిమాకస్ ఒక ఓవర్లో వరుసగా నాలుగు నోబాల్స్ వేశాడు. మ్యాచ్‌లో ఓవరాల్‌గా 87 పరుగులు ఇచ్చిన అతను ఇంత జోరులోనూ ఒక ఓవర్ మెయిడిన్‌గా వేయడం విశేషం. -
వేలానికి రికార్డు చేజింగ్ బ్యాట్..
కేప్‌టౌన్: వన్డే క్రికెట్లో రికార్డు చేజింగ్ దక్షిణాఫ్రికా పేరిటే ఉంది. దాదాపు 14 ఏళ్ల క్రితం ఆసీస్ నిర్దేశించిన 435 పరుగుల టార్గెట్‌ను దక్షిణాఫ్రికా ఇంకా బంతి మిగిలి ఉండగానే ఛేదించి కొత్త రికార్డును నమోదు చేసింది. అది చేజింగ్‌లో నేటికి టాప్ ప్లేస్‌లో ఉంది. అయితే సఫారీ లక్ష్య చేదనలో హెర్షలీ గిబ్స్ పాత్ర కీలకం. ఆ మ్యాచ్‌లో గిబ్స్ 175 పరుగులు చేసి దక్షిణాఫ్రికా రికార్డు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. 111 బంతుల్లో 21 ఫోర్లు, 7 సిక్స్‌లతో దుమ్మురేపి దక్షిణాఫ్రికాకు ఘనమైన విజయాన్ని అందించాడు. కాగా, ఇప్పుడు ఆనాటి మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్‌ను గిబ్స్ వేళానికి పెట్టాడు. ఎప్పుట్నుంచో తన జ్ఞాపకంగా దాచుకుంటూ వస్తున్న ఆ బ్యాట్‌ను వేలానికి ఉంచాడు. కరోనా వైరస్ కారణంగా తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చిన గిబ్స్ అందుకు ఆ రికార్డు చేజింగ్ బ్యాట్ సరైనదని భావించాడు. ఇప్పటికే ఆ దేశ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఒక చిరస్మరణీయమైన ఆడిన ఒక ఆర్సీబీ జెర్సీని వేళానికి పెట్టగా, ఇప్పుడు గిబ్స్ బ్యాట్‌ను వేళంలో పెట్టాడు. దీనిపై దక్షిణాఫ్రికా మాజీ కోచ్ మికీ ఆర్థర్ హర్షం వ్యక్తం చేశాడు. ‘ మంచి పని చేశావ్ గిబ్స్. వేలంలో ఆ బ్యాట్‌కు కచ్చితంగా మంచి ధరే వస్తుంది’ అని ట్వీట్ చేశాడు. (ఆ పాక్ దిగ్గజం అండగా నిలిచాడు: రషీద్) 2006లో దక్షిణాఫ్రికా పర్యటనకు ఆసీస్ రాగా, ఐదో వన్డేలో ఈ రికార్డు నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 434 పరుగులు చేసింది. గిల్‌క్రిస్ట్(55), సైమన్ కాటిచ్(79)లు మంచి ఆరంభాన్ని ఇవ్వగా, అప్పటి ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్(164; 105 బంతుల్లో 13 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచరీ చేశాడు. ఇక మైక్ హస్సీ(81) దూకుడుగా ఆడటంతో ఆసీస్ నాలుగు వందల మార్కును సునాయాసంగా చేరింది. దాంతో ఆసీస్‌దే విజయం అనుకున్నారంతా. కానీ మ్యాచ్ తల్లక్రిందులైంది. దక్షిణాఫ్రికా జోరుకు ఆసీస్ బౌలింగ్ దాసోహమైంది. సఫారీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(90) ధాటిగా బ్యాటింగ్ చేయగా, ఫస్ట్ డౌన్లో వచ్చిన గిబ్స్ రెచ్చిపోయి ఆడాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు. దక్షిణాఫ్రికా స్కోరు 31.5 ఓవర్లలో 299 పరుగులు వద్ద గిబ్స్ పెవిలియన్ చేరాడు. ఆ దశలో సఫారీలు వరుసగా కొన్ని కీలక వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడ్డట్టు కనిపించారు. కానీ మార్క్ బౌచర్(50 నాటౌట్) చివర వరకూ క్రీజ్‌లో ఉండి ఆసీస్ విజయాన్ని దూరం చేశాడు. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 438 పరుగులు చేసింది. (రెండింటిలోనూ కోహ్లినే గ్రేట్: చాపెల్) Supersport showing the #438 game . The bat i used that day will be up for auction to raise funds for covid. Kept it all these years. pic.twitter.com/VyGyAzKVSn — Herschelle Gibbs (@hershybru) May 1, 2020 -
'వాళ్లు జంతువుల్లాగా ప్రవర్తించారు'
2007లో తనపై ఐసీసీ రెండు టెస్టుల నిషేదం విధించడంపై దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్సమెన్ హర్షలే గిబ్స్ ట్విటర్ వేదికగా స్పందించాడు. అప్పట్లో మీపై రెండు టెస్టుల నిషేధం ఎందుకు విధించారని తన అభిమానులు అడిగిన ప్రశ్నకు గిబ్స్ సమాధానమిచ్చాడు.' పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ జట్టు మద్దతుదారుల్లో కొందరు రౌడీల్లాగా ప్రవర్తించారు. మ్యాచ్ చూడడానికి వచ్చిన నా భార్య, కొడుకును వారు కూర్చున్న స్థానాల నుంచి బలవంతంగా పంపించారు. ఆ సమయంలో గ్రౌండ్లో ఉన్న నేను నా సహచరులతో ' పాక్ అభిమానులు జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారు' అంటూ చెప్పానని' గిబ్స్ తెలిపాడు. ఈ సంఘటన తర్వాత తన మీద ఐసీసీ రెండు టెస్టుల నిషేధం విధించిదని, తర్వాత నిషేధం విషయమై ఐసీసీని కలిసినా నా విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించిందని పేర్కొన్నాడు. దానికి కారణం తాను వాడిన పదాలు మైదానంలోని స్టంప్ మైక్రోఫోన్లో రికార్డయ్యాయని గిబ్స్ పేర్కొన్నాడు. కాగా ఈ విషయాన్ని ఇంతకుముందే గిబ్స్ తన ఆటోబయోగ్రఫీ 'టు ది పాయింట్'లోనూ వివరించాడు. పాక్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాక్ అభిమానులు తమ ప్రవర్తనతో మా జట్టు ఆటగాళ్లకు చికాకు తెప్పించారని,తన కళ్ల ముందే తన కొడుకు రషార్డ్, భార్య లిసెల్‌ను వారు కూర్చున్న సీట్ల నుంచి బలవంతంగా పంపించే ప్రయత్నం చేశారని గిబ్స్ తన బుక్‌లో రాసుకొచ్చాడు.(ఆ ఒక్క కోరిక మిగిలిపోయింది: రవిశాస్త్రి) మా జట్టు ఆటగాళ్లంతా ఇదే విషయమై చర్చించుకుంటుంటే అవన్నీ స్టంప్ మైక్రోఫోన్లో రికార్డయ్యాయని బుక్‌లో పేర్కొన్నాడు. 'నేను ముస్లిం జాత్యహంకారినని, అందుకే ముస్లింలపై అలాంటి వ్యాఖ్యలు చేశానని ఆరోపించారు. కానీ అది నిజం కాదు. నలుగురు ముస్లిం అత్తలతో పాటు 10 మంది ముస్లిం స్నేహితులు ఉన్న నా జీవితంలో నేను జాత్యహంకారిగా ఎలా ఉండగలను చెప్పండి' అంటూ తన ఆత్మకథలో వివరించాడు. అంతర్జాతీయ కెరీర్లో దక్షిణాఫ్రికా తరపున 90 టెస్టుల్లో 6167 పరుగులు, 248 వన్డేల్లో 8094 పరుగులు, 23 టీ20ల్లో 400 పరుగులు సాధించాడు. జట్టు తరపున ఎక్కువ మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ స్థానంలో ఆడి ఎన్నో విజయాలు సాధించిపెట్టాడు. కాగా గిబ్స్ 2010లో చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. Called some rowdy Pakistan supporters animals. They forced my son and his mother out of their seats in front of the players viewing area https://t.co/JeXOUwUtlW — Herschelle Gibbs (@hershybru) January 21, 2020 -
క్యాచ్ మిస్.. మ్యాచ్ పోయింది.. కప్పు పోయింది..
-
క్యాచ్ మిస్.. వరల్డ్‌కప్ గోవిందా..!
క్రికెట్ వరల్డ్‌కప్ సాధించాలన్న దక్షిణాఫ్రికా కల నేటికి కలగానే మిగిలిపోయింది. నిర్ణయాక మ్యాచుల్లో చేతులెత్తేయడం ఆ జట్టుకు అలవాటు. అయితే, 1999 వరల్డ్‌కప్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో నిలిచిన ఆ జట్టును ఓ మిస్‌ఫీల్డ్ కొంపముంచింది. చెత్త ఫీల్డింగ్‌తో హర్షలే గిబ్స్ తన జట్టుకు తీరని వ్యథ మిగిల్చాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌వా ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను జారవిడిచి అటు మ్యాచ్‌ను, ఇటు ప్రపంచప్ గెలుచుకునే సువర్ణ అవకాశాన్ని దూరం చేశాడు. ఒకవేళ ‘అత్యంత చెత్త క్యాచ్ మిస్’ అవార్డు ఏదైనా ఉంటే అది.. గిబ్స్కే ఇవ్వాల్సి ఉంటుందని నాటి చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నారు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాళ్లు. మ్యాచ్ పోయింది.. కప్పు పోయింది.. 1999 ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అంచనాలకు తగినట్లే ఆడింది. సూపర్ సిక్స్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులు చేసింది. ఇక దక్షిణాఫ్రికా పేస్ దళం అలెన్ డోనాల్డ్, షాన్ పొలాక్, స్టీవ్ ఎల్వర్థి, లాన్స్ క్లుజెనర్ ఆసీస్‌కు చెమటలు పట్టించారు. 12 ఓవర్లలో 48 పరుగులు చేసిన ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. క్రీజులో పాంటింగ్, స్టీవ్ వా ఆచితూచి ఆడుతున్నారు. ఒక్కో పరుగు జోడిస్తూ తమ జట్టుని విజయం వైపు తీసుకెళ్తున్నారు. ధాటిగా ఆడుతున్న స్టీవ్‌వా ప్రమాదకరంగా మారాడు. ఆసీస్ స్కోరు 30 ఓవర్లలో మూడు వికెట్లకు 149. ఈ జోడీని విడగొడితే దక్షిణాఫ్రికా గెలుపునకు దగ్గరైనట్లే. అయితే, మరుసటి ఓవర్లోనే ఆ జట్టుకు భారీ షాక్. 31 ఓవర్ చివరి బంతికి స్టీవ్‌వా ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను హర్షలే గిబ్స్ జారవిడిచాడు. క్యాచ్ పట్టిన ఆనందంలో బంతిని పైకి ఎగరేద్దామనుకున్నాడు. పూర్తిగా ఒడిసిపట్టక మునుపే బంతిని గాల్లోకి ఎగరేసేందుకు యత్నించాడు. ఆ క్రమంలో బంతి చేజారింది. క్యాచ్ మిస్. మ్యాచ్ గోవిందా..! దొరికిన అవకాశాన్ని వినియోగించుకున్న స్టీవ్‌వా మిగతా బ్యాట్స్‌మెన్‌తో కలసి తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రెండు బంతులు మిగిలుండగానే 5వికెట్లు కోల్పోయి ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఇక సెమీఫైనల్స్‌లో ఆసీస్‌తో మరోసారి తలపడిన దక్షిణాఫ్రికా మళ్లీ పరాజయం పాలైంది. సూపర్‌సిక్స్‌లో ఎదురైన ఓటమి నుంచి తేరుకోకముందే ఆసీస్ మరోసారి దెబ్బకొట్టింది. టైగా ముగుస్తుందనుకున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చివరి బంతికి విజయం సాధించింది. ఫైనల్ చేరి పాకిస్తాన్‌ను సునాయాసంగా ఓడించి రెండోసారి ప్రపంచకప్పును ఎగరేసుకుపోయింది. సూపర్‌సిక్స్‌లో గెలవకపోయుంటే ఆసీస్ ఇంటిదారిపట్టేది. మిగతా జట్లతో పోల్చుకుంటే ఎంతో బలంగా ఉన్న సౌతాఫ్రికా కప్పును ముద్దాడేది. ఇక దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవకపోవడం గమనార్హం. -
మార్చి 16.. మర్చిపోలేని రోజు!
క్రికెట్ అభిమానులు ఈ రోజు(మార్చి 16)ను మర్చిపోలేరు. క్రికెట్ చరిత్రలో రెండు సరికొత్త రికార్డులు నమోదయిన రోజు. అందులో ఒకటి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంద శతకాలు సాధించింది కాగ, మరొకటి దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ హెర్షల్ గిబ్స్ తొలి సారి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి నయా రికార్డు సృష్టించాడు. హైదరాబాద్ : ఏడేళ్ల క్రితం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంద అంతర్జాతీయ శతకాలు సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది ఇదే రోజున. ఆసియా కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌పై చేసిన శతకం సచిన్‌కు వన్డేల్లో 49వ సెంచరీ కాగా, టెస్టులు(51), వన్డేల్లో కలుపుకుని వంద సెంచరీలను సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ఈ "లిటిల్ మాస్టర్" సరికొత్త రికార్డును సృష్టించాడు. సచిన్ సాధించిన ఈ అరుదైన ఘనతతో యావత్ క్రికెట్ అభిమానులు తెగ పండగ చేసుకున్నారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్(71) సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఇప్పటివరకు 66 అంతర్జాతీయ సెంచరీలు సాధించి సచిన్ ‘వంద శతకాల’పై కన్నేశాడు. సిక్సర్ల సునామీ ఇక పన్నెండేళ్ల క్రితం సిరిగ్గా ఇదే రోజున దక్షిణాఫ్రికా మాజీ విధ్వంసకర ఆటగాడు హెర్ష్లీ గిబ్స్ అద్భుతం చేశాడు. వన్డేల్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది సంచలనం రేపాడు. నెదర్లాండ్స్ స్పిన్నర్ డాన్ వాన్ బుంగీ బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన గిబ్స్ అతడికి చుక్కలు చూపించాడు. అప్పటివరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రవిశాస్త్రి, గార్ఫీల్డ్ సోబర్స్ సాధించిన రికార్డే(ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు) అత్యుత్తమం కావడం విశేషం. గిబ్స్ ఈ ఘనత అందుకున్న కొద్ది నెలల అనంతరం టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఈ రికార్డు సాధించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఈ ఫీట్ అందుకున్నాడు. -
"లిటిల్ మాస్టర్" వంద సెంచరీకి ఏడేళ్లు
-
వరుసగా 6 సిక్సర్లతో సంచలనం
-
వరుసగా 6 సిక్సర్లతో సంచలనం
హెర్షెలె గిబ్స్.. క్రికెట్ ప్రేమికులకు చిరపరితమైన పేరు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు. దూకుడుగా ఆడటంలో అతడు పేరుగాంచాడు. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం ఇదే రోజున(మార్చి 16) వన్డే మ్యాచ్‌లో గిబ్స్ అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది సంచలనం రేపాడు. వన్డేల్లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. నెదర్లాండ్స్ స్పిన్నర్ డాన్ వాన్ బుంగీ బౌలింగ్‌లో ఈ ఘనత నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన గిబ్స్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులు సాధించాడు. 2007 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా గ్రూప్ ఏలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 221 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా ఆట ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్ నిర్ణీత 40 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. జాక్వెస్ కల్లిస్(128) అజేయ శతకంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 40 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 132 పరుగులు మాత్రమే చేసింది. -
కోచ్ రేసులో గిబ్స్
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవీ కోసం ఇటీవల బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం అంతర్జాతీయ జట్లకు కోచ్‌గా పని చేసిన వాట్మోర్, టామ్ మూడీ, వెంకటేశ్ ప్రసాద్ తదితరులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. కాగా, తాజాగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్ష్లీ గిబ్స్ సైతం తన అదృష్టాన్నిపరీక్షించుకునేందుకు భారత మహిళ క్రికెట్ జట్టు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. గిబ్స్ దక్షిణాఫ్రికా తరఫున 90 టెస్టులు, 248 వన్టేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతడు ఇటీవల కువైట్ జట్టు కోచ్‌గా కొత్త అవతారం ఎత్తాడు. ఆస్ట్రేలియాలో 2020లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌కు కువైట్ జట్టు అర్హత సాధించడానికి అతడే కారణం. అంతేకాకుండా అఫ్గనిస్తాన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో బాల్క్ లెజెండ్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా చేసిన అనుభవం ఉంది. -
అప్పుడు చురకలు.. ఇప్పుడు విషెస్!
సాక్షి, స్పోర్ట్స్: ఇటీవల ఏదో జోక్ చేయబోయి టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేతికి చిక్కి, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్ నోరు కరుచుకున్న విషయం తెలిసిందే. కానీ వారం కూడా గడవకముందే వీరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడం, పరిస్థితుల్లో ఎంతో మార్పు రావడంతో క్రికెట్ అభిమానులు ఇది నమ్మలేకపోతున్నారు. నేడు గిబ్స్ జన్మదినం సందర్భంగా భారత బౌలర్ అశ్విన్ సఫారీ మాజీ ఆటగాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. 'మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి గిబ్స్. ఈ ఏడాది నీకు కలిసిరావాలంటూ' అశ్విన్ ట్వీట్ చేశాడు. అందుకు ధన్యవాదాలు తెలుపుతూ గిబ్స్ ట్వీట్ ద్వారా బదులిచ్చాడు. మ్యాచ్ ఫిక్సర్‌ను సైతం తమ క్రికెటర్ క్షమించి శుభాకాంక్షలు తెలిపాడని టీమిండియా క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. గిబ్స్ ఫిక్సర్ అని తెలియక కొందరు అశ్విన్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. అశ్విన్ వర్సెస్ గిబ్స్.. తన కొత్త షూ ప్రత్యేకతలు, పరుగెత్తడంలో ఉండే సౌకర్యం గురించి చెబుతూ అశ్విన్ ఒక షూ వీడియో ట్వీట్ చేశాడు. వికెట్ల మధ్య, అవుట్ ఫీల్డ్‌లో అశ్విన్ చురుగ్గా పరుగెత్తలేడనే అంశాన్ని గుర్తు చేసే విధంగా ‘ఇకనైనా నువ్వు మరింత వేగంగా పరుగెత్తగలవని ఆశిస్తున్నా’ అంటూ ఒకింత వ్యంగ్యంతో గిబ్స్ వ్యాఖ్య వదిలాడు. అయితే దీనిపై వెంటనే స్పందించిన అశ్విన్.. నాకు తిండి పెట్టే మ్యాచ్‌లను ఫిక్స్ చేయకూడదనే నైతిక విలువలు పాటించడంలో మాత్రం చాలా అదృష్టవంతుడిని’ అని ఘాటుగా జవాబిచ్చాడు. దాంతో షాక్‌కు గురైన గిబ్స్... జోక్ చేశానని, దీన్ని ఇంతటితో వదిలేయమన్నాడు. తాను కూడా జోక్ చేశానని, నీతో కలసి డిన్నర్ చేస్తానని ట్వీట్ చేశాడు. గిబ్స్ ఓ ఫిక్సర్ 2000 ఏడాది భారత పర్యటనలో భాగంగా మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో గిబ్స్ దోషిగా తేలి దాదాపు ఏడాదిపాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. తనకు 15000 డాలర్ల ఆఫర్ వచ్చిందని గిబ్స్ తన తప్పు ఒప్పుకున్న విషయం తెలిసిందే. Thanks bud 🤙 have a good day — Herschelle Gibbs (@hershybru) 23 February 2018 -
నీలా ఫిక్సింగ్ చేయడం రాదు!
చెన్నై: పదునైన వ్యాఖ్యలతో దూస్రాలు సంధించడంలో అశ్విన్ తనకు తానే సాటి. తాజాగా అశ్విన్ దెబ్బకు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హెర్షల్ గిబ్స్ విలవిల్లాడాడు! ఏదో జోక్ చేయబోయిన అతను అనవసరంగా ఇరుక్కున్నాడు. వివరాల్లోకెళితే... తన కొత్త షూ ప్రత్యేకతలు, పరుగెత్తడంలో ఉండే సౌకర్యం గురించి చెబుతూ అశ్విన్ ఒక వీడియో ట్వీట్ చేశాడు. వికెట్ల మధ్య, అవుట్ ఫీల్డ్‌లో అశ్విన్ చురుగ్గా పరుగెత్తలేడనే అంశాన్ని గుర్తు చేసే విధంగా ‘ఇకనైనా నువ్వు మరింత వేగంగా పరుగెత్తగలవని ఆశిస్తున్నా’ అంటూ ఒకింత వ్యంగ్యంతో గిబ్స్ వ్యాఖ్య వదిలాడు. అయితే దీనిపై వెంటనే స్పందించిన అశ్విన్ ‘ఈ విషయంలో నీ అంత అదృష్టవంతుడిని కాదు కాబట్టి నిజంగానే వేగంగా పరుగెత్తలేను మిత్రమా. అయితే నాకు తిండి పెట్టే మ్యాచ్‌లను ఫిక్స్ చేయకూడదనే నైతిక విలువలు పాటించడంలో మాత్రం చాలా అదృష్టవంతుడిని’ అని ఘాటుగా జవాబిచ్చాడు. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో గిబ్స్ దోషిగా తేలి ఆరు నెలల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. దాంతో షాక్‌కు గురైన గిబ్స్... తన జోక్‌ను అశ్విన్ తప్పుగా భావించాడని, విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నట్లు మరో ట్వీట్ చేశాడు. దీనిపై మళ్లీ స్పందించిన అశ్విన్... తన ప్రత్యుత్తరం కూడా జోక్ మాత్రమే అంటూ, మున్ముందు కలిసి డిన్నర్ చేద్దామంటూ పిలిచాడు. -
ఫుల్‌గా తాగి.. 175 బాదిన బ్యాట్స్‌మన్
వన్డే క్రికెట్ చరిత్రలో 12/3/2006 తేదీకి ఓ ప్రత్యేకమైన స్థానముంది. సరిగ్గా ఇదే తేదీన దక్షిణాఫ్రికా జట్టు 434 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. వన్డే చరిత్రలో 400కుపైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అదే తొలిసారి.. ఈ అరుదైన ఘనతను సఫారీలు సొంతం చేసుకోవడం వెనుక చిచ్చరపిడుగు హెర్షల్లీ గిబ్స్ పాత్ర ఉంది. జోహాన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాలో జగిరిన ఈ వన్డేలో గిబ్స్ చెలరేగిపోయాడు. ఆసిస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఏకంగా 175 పరుగులు చేయడంతో అసాధ్యమనుకున్న 400కుపైగా లక్ష్యాన్ని సఫారీలు సొంతం చేసుకున్నారు. అయితే, గిబ్స్ సాధించిన అరుదైన ఈ ఫీట్ వెనుక ఉన్న ఓ రహస్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వన్డే మ్యాచ్‌కు ముందురోజు అర్ధరాత్రి దాకా పీకలవరకు తాగి.. ఫుల్ హ్యాంగోవర్ స్థితిలో గిబ్స్ బ్యాటింగ్‌కు దిగాడు. ఆ హ్యాంగోవర్‌తోనే కంగారు బౌలర్లను కకావికలం చేశాడు. ఈ విషయాన్ని తన ఆత్మకథలో గిబ్స్ వెల్లడించాడు. మ్యాచ్‌కు ముందురోజు స్నేహితుడితో కలిసి రాత్రి ఒంటిగంటవరకు ఫుల్‌గా మద్యాన్ని సేవించానని, ఆ తెల్లారి హ్యాంగోవర్‌తోనే బ్యాటింగ్‌కు దిగానని గిబ్స్ పేర్కొన్నాడు. సహజంగానే చెలరేగి ఆడే గిబ్స్కు ఆ హ్యాంగోవర్ ఇంకాస్తా ఊపునిచ్చిందేమో. ఏకంగా 21 ఫోర్లు, ఏడు సిక్సర్లతో ఆ మ్యాచ్‌లో గిబ్స్ విధ్వంసం సృష్టించాడు. అతని ఘనతతో దక్షిణాఫ్రికా 434పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటికీ వన్డే చరిత్రలో అతి పెద్ద లక్ష్యఛేదన రికార్డుగా ఇది మిగిలిపోయింది. -
బ్యాడ్ బోయ్ హెర్ష్లీ గిబ్స్ అరెస్టు
దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ హెర్ష్లీ గిబ్స్కు ఎప్పటినుంచో బ్యాడ్బోయ్ అని పేరుంది. ఎప్పుడూ వివాదాలతోనే కాపురం చేసే గిబ్స్.. తాజాగా మరోసారి అరెస్టయ్యాడు. తాగి వాహనం నడిపిన కేసులో అతగాడికి పోలీసులు అరదండాలు తగిలించి అత్తారింటికి పంపారు. ఫుల్లుగా తాగేసి ఉన్న గిబ్స్.. విపరీతమైన వేగంతో కారు నడిపి మరో కారును ఢీకొన్నాడు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే తాగి వాహనం నడిపినందుకు గిబ్స్ మీద కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గిబ్స్ తాగి వాహనం నడపడం ఇది మొదటిసారేమీ కాదు. ఇంతకుముందు 2008 మార్చిలో కూడా కేప్‌టౌన్ నగరంలోనే బాగా పూటుగా తాగి నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 2009లో డ్రగ్స్, మద్యం అలవాట్ల నుంచి బయటపడేందుకు రీహాబిలిటేషన్ కోర్సులో చేరాడు.