james neesham
-
ఆండ్రీ రసెల్ ఊచకోత.. 12 బంతుల్లోనే.. 358.33 స్ట్రయిక్‌రేట్‌తో..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ శివాలెత్తిపోయాడు. రంగ్‌పూర్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రసెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 12 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 358.33 స్ట్రయిక్‌రేట్‌తో అజేయమైన 43 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. అంతకుముందు రసెల్ బౌలింగ్‌లో చెలరేగిపోయాడు. 2.5 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రైడర్స్.. రసెల్, ముస్ఫిక్ హసన్ (3/18), మథ్యూ ఫోర్డ్ (2/32), తన్వీర్ ఇస్లాం (1/12) ధాటికి 19.5 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. రైడర్స్ ఇన్నింగ్స్‌లో నీషమ్ ఒక్కడే అజేయమైన అర్దసెంచరీతో (69 నాటౌట్) రాణించాడు. నీషమ్‌తో పాటు రోనీ తాలుక్దార్ (14), షకీబ్ అల్ హసన్ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం ఛేదనకు దిగిన విక్టోరియన్స్.. రసెల్ శివాలెత్తడంతో 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది (4 వికెట్లు కోల్పోయి). విక్టోరియన్స్ ఇన్నింగ్స్‌లో రసెల్‌తో పాటు లిటన్ దాస్ (43), మహిదుల్ ఇస్లాం (39) కూడా రాణించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సునీల్ నరైన్ 15 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. మొయిన్ అలీ (6 నాటౌట్) రసెల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రైడర్స్ బౌలర్లలో షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. హైదర్ రోని ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
పరుగుల సునామీకి, శతకాల మోతకు పాక్షిక విరామం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 ఎడిషన్‌లో పరుగుల సునామీకి, శతకాల మోతకు కాస్త బ్రేక్ పడింది. ఈ సీజన్లో గత కొన్ని మ్యాచ్‌లుగా అతి భారీ స్కోర్లు, విధ్వంసకర శతకాలు నమోదవుతూ వస్తుండగా.. ఇవాళ (మార్చి 12) ఇస్లామాబాద్ యునైటెడ్-పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో పరుగుల ప్రవాహానికి, శతక్కొట్టుడుకు పాక్షిక విరామం దొరికింది. ఇస్లామాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో ఇస్లామాబాద్ 166 పరుగులకే చాపచుట్టేసి 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో గత కొన్ని మ్యాచ్‌ల తరహాలో ఎలాంటి మెరుపులు లేకపోగా.. బౌలర్లు ఆధిపత్యం చలాయించి అందరినీ ఆశర్యర్యపరిచారు. పెషావర్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (79) ఒక్కడే మెరుపు హాఫ్‌సెంచరీతో అలరించగా.. భానుక రాజపక్ష (41) పర్వాలేదనిపించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో హసన్ అలీ 3, షాదాబ్ ఖాన్ 2, ఫజల్ హక్ ఫారూఖీ, ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ వసీం జూనియర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. జల్మీ బౌలర్లు ఖుర్రమ్ (1.4-0-13-3), సూఫియాన్ (3/37), అమెర్ జమాల్ (2/28), జేమ్స్ నీషమ్ (2/23) ధాటికి 19.4 ఓవర్లలో 166 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఇస్లామాబాద్ ఇన్నింగ్స్‌లో ఫహీమ్ అష్రాఫ్ (38), రహ్మానుల్లా గుర్భాజ్ (33), షాదాబ్ ఖాన్ (25) ఓ మోస్తరుగా రాణించారు. పీఎస్ఎల్-2023లో గత కొన్ని మ్యాచ్‌ల్లో స్కోర్ల వివరాలు.. ముల్తాన్ సుల్తాన్స్: 262/3 (ఉస్మాన్ ఖాన్ 43 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 120) క్వెట్టా గ్లాడియేటర్స్: 253/8 పెషావర్ జల్మీ 242/6 ముల్తాన్ సుల్తాన్స్ 244/6 (రిలీ రొస్సొ 51 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 121) లాహోర్ ఖలందర్స్ 226/5 (ఫకర్ జమాన్ 57 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 115) ఇస్తామాబాద్ యునైటెడ్ 107 పెషావర్ జల్మీ 240/2 (బాబర్ ఆజమ్ 65 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 115) క్వెట్టా గ్లాడియేటర్స్ 243/2 (జేసన్ రాయ్ 63 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 145 నాటౌట్) -
చరిత్రలో నిలిచిపోయే క్యాచ్.. దిగ్గజాలను సైతం అబ్బురపరిచేలా
క్రికెట్లో స్టన్నింగ్ క్యాచ్‌లు ఎన్నో చూశాం. అయితే ఇటీవలి కాలంలో బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌లు పట్టుకోవడంలో ఫీల్డర్లు ప్రదర్శిస్తున్న నేర్పు హైలైట్ అవుతున్నాయి. బంతి బౌండరీలైన్ వద్ద ఉండగానే గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకొని మళ్లీ బౌండరీ లోపలికి విసిరి అందుకోవడం చూస్తున్నాం. ఇలాంటి క్యాచ్‌లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు చెప్పుకునే క్యాచ్ మాత్రం అంతకుమించి అని చెప్పొచ్చు. విషయంలోకి వెళితే.. జిల్లా క్రికెట్ క్లబ్లో భాగంగా ఒక టెన్నిస్ బాల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో బౌలర్ ఆఫ్‌స్టంప్ అవతల వేసిన బంతిని బ్యాటర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. బంతి చాలా ఎత్తులో వెళ్లడంతో అంతా సిక్స్ అని భావించారు. కానీ ఇక్కడే ఒక ఊహించని అద్బుతం జరిగింది. ఆ ఏముందిలే.. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ గాల్లోకి ఎగిరి క్యాచ్ తీసుకొని ఉంటాడులే అనుకుంటే పొరబడ్డట్లే. బౌండరీ అవతలకి వెళ్లి బంతిని అందుకున్న ఫీల్డర్.. ఇక్కడే తన ఫుట్‌బాల్ విన్యాసం చూపించాడు. క్యాచ్ అందుకునే క్రమంలో పట్టుతప్పి బౌండరీ లైన్ మీదకు జారిపడతానని భావించిన ఫీల్డర్.. బంతిని గాల్లోకి విసిరేసి ఫుట్‌బాల్‌లోని ఫేమస్ బ్యాక్‌వ్యాలీ కిక్‌ను కొట్టాడు. అంతే బంతి మరో ఫీల్డర్ దగ్గరకు వెళ్లడం.. అతను సేఫ్‌గా అందుకోవడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సదరు ఫీల్డర్ చేసిన విన్యాసం క్రికెట్ దిగ్గజాలను సైతం అబ్బురపరిచింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ.. ''ఫుట్‌బాల్ తెలిసిన ఆటగాడిని క్రికెట్లోకి తీసుకొస్తే ఇలాంటి అద్బుతాలే జరుగుతాయి'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్.. ''నిజంగా ఇది గ్రేటెస్ట్ క్యాచ్ ఆఫ్ ఆల్ టైమ్'' అంటూ అభివర్ణించాడు. ఇక కివీస్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్.. ''నిజంగా ఇది ఔట్‌స్టాండింగ్..'' అంటూ పొగడ్తలు కురిపించాడు. It doesn't matter what the rules say. You've got to give this out for the pure AUDACITY 🤯😂 Sent in by Kiran Tarlekar pic.twitter.com/pquwsLc5YC — Cricket District (@cricketdistrict) February 12, 2023 This is what happens when you bring a guy who also knows how to play football!! ⚽️ 🏏 😂 https://t.co/IaDb5EBUOg — Sachin Tendulkar (@sachin_rt) February 12, 2023 Surely the greatest catch of all time … 🙌🙌 pic.twitter.com/ZJFp1rbZ3B — Michael Vaughan (@MichaelVaughan) February 12, 2023 Absolutely outstanding 👌👌😂 https://t.co/Im77ogdGQB — Jimmy Neesham (@JimmyNeesh) February 12, 2023 చదవండి: Ranji Trophy: 306 పరుగుల తేడాతో భారీ విజయం.. ఫైనల్లో బెంగాల్ ఏక కాలంలో ఒకరిని మెచ్చుకొని.. మరొకరిని తిట్టుకొని -
ప్రైవేట్ లీగ్స్ మోజులో సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నాడు
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ కివీస్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నాడు. న్యూజిలాండ్ జట్టులోని టాప్ ఆటగాళ్లకు బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తుంది. విదేశీ లీగ్స్‌తో జరిగిన ముందస్తుగా ఒప్పందం జరగడంతోనే కివీస్ బోర్డు అందించే సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నట్లు నీషమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే నీషమ్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నప్పటికి బ్లాక్‌క్యాప్స్ సెలెక్షన్‌కు మాత్రం అందుబాటులో ఉంటాడని బోర్డు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని జేమ్స్ నీషమ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చాడు. ''సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకొని దేశం తరపున కాకుండా డబ్బు కోసం విదేశీ లీగ్స్ ఆడడంపై అందరూ నన్ను తప్పుబడతారని ఊహించగలను. కానీ జూలై వరకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటే కచ్చితంగా వదులుకునేవాడిని కాదు. అదే సమయంలో విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం నాకు శాపంగా మారింది. ముందుగా చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలన్న నిర్ణయంతో బోర్డు అందించే సెంట్రల్ కాంట్రాక్టు వదులుకోవాల్సి వచ్చింది. బ్లాక్‌క్యాప్స్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తా. అయితే భవిష్యత్తులో మాత్రం తోటి ఆటగాళ్లతో కలిసి దేశం తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నా'' అంటూ తెలిపాడు. ఇక జేమ్స్ నీషమ్ న్యూజిలాండ్ తరపున 12 టెస్టుల్లో 709 పరుగులు.. 14 వికెట్లు, 71 వన్డేల్లో 1409 పరుగులు.. 69 వికెట్లు, 48 టి20ల్లో 607 పరుగులు.. 25 వికెట్లు పడగొట్టాడు. నీషమ్ ఖాతాలో రెండు టెస్టు సెంచరీలు ఉండడం విశేషం. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ల పెద్ద మనసు -
ఆ బ్యాటర్ పని అయిపోందన్నారు.. సెంచరీతో నోరు మూయించాడు
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు క్రిస్ లిన్ టి20 బ్లాస్ట్‌లో సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో క్రిస్ లిన్ నార్తంప్టన్‌షైర్ తరపున క్రిస్ లిన్ ఈ సీజన్లో అరంగేట్రం చేశాడు. సీజన్లో నాలుగో మ్యాచ్ ఆడుతున్న లిన్.. లీస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో 66 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. క్రిస్ లిన్ టి20 కెరీర్లో ఇది మూడో సెంచరీ. అతని ధాటికి నార్తంప్టన్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ టోర్నీకి ముందు లిన్ పని అయిపోయిందని.. అతను రాణించే అవకాశం లేదని విమర్శలు వచ్చాయి. అయితే తనపై వచ్చిన విమర్శలన్నింటికి క్రిస్ లిన్ తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్‌షైర్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి వికెట్‌కు మరో ఓపెనర్ బెన్ కరన్(31)తో కలిసి 109 పరుగలు భాగస్వామ్యం నెలకొల్పిన లిన్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత లిన్‌కు జేమ్స్ నీషమ్ తోడయ్యాడు. ఐపీఎల్ నుంచి నేరుగా టి20 బ్లాస్ట్‌లో అడుగుపెట్టిన నీషమ్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెరిశాడు. 30 బంతుల్లోనే 75 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన లీస్టర్‌షైర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. స్కాట్ స్టీల్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Liam Livingstone: బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా! A special innings from a special player @lynny50 💯 #Blast22 | @NorthantsCCC pic.twitter.com/NImOepuOHU — Vitality Blast (@VitalityBlast) June 1, 2022 -
'సంజూ శాంసన్‌కు డ్రింక్స్ అందించడానికి రెడీగా ఉండు'
ఐపీఎల్ 2022 సీజన్లో మంగళవారం గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్న నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో క్రికెటర్ల నుంచి మీమ్స్ గోల చాలా ఎక్కువైపోయింది. ముఖ్యంగా వసీం జాఫర్, యజ్వేంద్ర చహల్‌లు తమ ఇన్స్టాగ్రామ్, ట్విటర్ వేదికగా ఆసక్తికర మీమ్స్ పోస్ట్ చేస్తూ ఆకట్టుకున్నారు. తాజాగా వీరి జాబితాలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ వచ్చి చేరాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టులో ఉన్న నీషమ్.. క్వాలిఫయర్-1 ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అదే జట్టుకు చెందిన వాండర్ డుసెన్ కూడా ప్లే ఆఫ్స్‌కు సన్నద్దమవుతున్న ఫోటోను షేర్ చేశాడు. ప్రాక్టీస్‌లో భాగంగా వేగంగా పరిగెత్తుతున్న ఫోటోను డుసెన్ పంచుకుంటూ.. ''కొత్త వారంలోకి పరిగెడుతున్నా.. నా దృష్టిలో అది చాలా పెద్దది( ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉద్దేశిస్తూ) #ఐపీఎల్ 2022'' అని క్యాప్షన్ జత చేశాడు. డుసెన్ పోస్టును చూసిన నీషమ్ సరదాగా ఆట పట్టించాడు. వేగంగా పరిగెత్తుత్ను డుసెన్‌ను చూపిస్తూ.. ''సరే సంజూకు డ్రింక్స్ అందించడానికి రెడీగా ఉండు.. విరామ సమయంలో ఎంత వేగంతో డ్రింక్స్ అందిస్తే అంత మంచిది'' అంటూ ట్రోల్ చేశాడు. నీషమ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2022: వర్షం పడితే కథేంటి.. ఫైనల్ చేరే దారులు ఎలా ఉన్నాయంటే! View this post on Instagram A post shared by Rassie van der Dussen (@rassie72) -
ఆ ఆటగాడికి బౌలింగ్ చేస్తే రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే!
టి20 క్రికెట్ అంటేనే వేగానికి పెట్టింది పేరు. మూడు గంటల్లో ముగిసే మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ ఫోర్లు, సిక్సర్లు బాదడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పవర్ హిట్టింగ్ చేసే నేపథ్యంలో బౌలర్లకు, ఫీల్డర్లకు దెబ్బలు తగిలే అవకాశాలుంటాయి. తాజాగా ఐపీఎల్ 2022 సందర్భంగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రాజస్తాన్ రాయల్స్‌కు చెందిన రియాన్ పరాగ్.. జిమ్మీ నీషమ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అనూహ్యంగా బంతి నీషమ్ వైపు దూసుకొచ్చింది. సరైన సమయంలో నీషమ్ కిందకు వంగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే రాజస్తాన్ రాయల్స్‌కు పెద్ద దెబ్బ పడేదే. అయితే ఇదంతా మ్యాచ్‌లో కాకుండా ప్రాక్టీస్ సమయంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ నీషమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ''రియాన్ పరాగ్‌కు బౌలింగ్ చేస్తే నేను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినట్లే.. ఎందుకంటే కొద్దిలో నాకు ప్రమాదం తప్పింది. అతను కసితో ఉన్నాడు.. తలలు పగలడం ఖాయం'' అంటూ పేర్కొన్నాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి.. ఒకదాంట్లో ఓడింది. ఆదివారం(ఏప్రిల్ 10) లక్నో సూపర్ జెయింట్స్‌తో రాజస్తాన్ తలపడనుంది. చదవండి: IPL 2022: బౌండరీ కొట్టి నిమిషం కాలేదు.. ఇంత మతిమరుపా! IPL 2022: తెవాటియా సిక్సర్ కొట్టగానే ఎగిరి గంతేసిన అమ్మాయి.. ఇంతకీ ఎవరామె?! pic.twitter.com/CWo2e5oTA9 — Prabhat Sharma (@PrabS619) April 9, 2022 -
'అన్నిసార్లు టీమిండియానే గెలుస్తుంది.. నాకేదో అనుమానంగా ఉంది'
James Neesham Comments After Nz Loss Toss 1st Test.. టీమిండియా పర్యటనలో న్యూజిలాండ్ వరుసగా టాస్ ఓడిపోవడంపై ఆ జట్టు ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు. ''అన్నిసార్లు టీమిండియానే టాస్ గెలుస్తుంది.. నాకెందుకో ఏదో జరుగుతుందని అనుమానం ఉంది.. ఎవరైనా వెళ్లి టాస్ కాయిన్‌ను క్లోజ్‌గా పరిశీలించండి'' అంటూ ట్విటర్ వేదికగా ఫన్నీ కామెంట్ చేశాడు. ప్రస్తుతం నీషమ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. చదవండి: Trolls On Ajinkya Rahane: కెప్టెన్ అయ్యి బతికిపోయావు.. లేదంటే ఇక భారత్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్‌కు టాస్ కలిసిరాలేదు. ఇప్పటికే ముగిసిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు. ఈ మూడు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన టీమిండియా అన్నింటా విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తాజాగా కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులోనూ న్యూజిలాండ్ మరోసారి టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలిరోజు ఆట ముగిసేసరికి 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులతో పటిష్టస్థితిలో నిలిచింది. గిల్ అర్థ సెంచరీ సాధించి ఔట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన అయ్యర్, జడేజాలు కూడా హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. కివీస్ బౌలర్లలో కైల్ జేమిసన్ మాత్రమే 3 వికెట్లతో కాస్త ప్రభావం చూపెట్టాడు. చదవండి: అసలే కోపంలో ఉన్నాడు.. క్రీజులో హెల్మెట్ అడ్డుగా Can somebody take a closer look at those coins please? 🙄 #INDvNZ — Jimmy Neesham (@JimmyNeesh) November 25, 2021 -
Eng Vs NZ: అందరూ లేచి గంతులేశారు.. కానీ జిమ్మీ నీషమ్ మాత్రం.. ఫొటో వైరల్
James Neesham didn’t celebrate after NZ cruised through T20 WC final Pic Goes Viral: న్యూజిలాండ్ ఏళ్లనాటి కలను నిజం చేయడంలో కీలకంగా వ్యవహరించాడు జేమ్స్ నీషమ్. 2007 టీ20 వరల్డ్‌కప్ నుంచి ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేదన్న అపఖ్యాతిని చెరిపివేయడంలో ఈ స్టార్ ఆల్‌రౌండర్ తన వంతు పాత్ర పోషించాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2021లో భాగంగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ అద్భుత విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. నిజానికి కివీస్ లక్ష్యఛేదనలో 16 ఓవర్ల దాకా ఇంగ్లండ్ ఆధిపత్యమే కొనసాగింది. అయితే ఆ తర్వాత నీషమ్ ఎంట్రీ మోర్గాన్ బృందాన్ని కోలుకోలేని దెబ్బకొట్టింది. 11 బంతుల్లో 27 పరుగులతో నీషమ్ చెలరేగడంతో.. ఓవర్ మిగిలుండగానే న్యూజిలాండ్ టార్గెట్‌ను ఛేదించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఐసీసీ ప్రపంచకప్ పోరులో తమను గెలుపునకు దూరం చేస్తున్న ఇంగ్లండ్‌ను దెబ్బకు దెబ్బ కొట్టి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో విలియమ్సన్ బృందం సంబరాలు అంబరాన్నంటాయి. డగౌట్లో కూర్చున్న ఆటగాళ్లు, సిబ్బంది ఒక్కసారిగా గెంతులు వేశారు. అయితే, ‘హీరోచిత’ ఇన్నింగ్స్ ఆడిన జేమ్స్ నీషమ్ మాత్రం గంభీరంగా చూస్తూ.. తన సీట్లోనే కూర్చుండిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఈఎస్క్రిక్ఇన్ఫో ఈ ఫొటోను షేర్ చేసి.. జిమ్మీ నీషమ్ మాత్రం కదల్లేదు అని క్యాప్షన్ జతచేయగా.. అతడు స్పందించాడు. ‘‘పని పూర్తైందా? ఇంకా కాలేదనే అనుకుంటున్నాను’’ అంటూ ట్వీట్ చేశాడు. ఫైనల్ వరకు చేరడం ఓకే.. ఇక ట్రోఫీ గెలవడంలో ఏమాత్రం అలసట వద్దు అన్న ఉద్దేశంలో జిమ్మీ ఇలా వ్యాఖ్యానించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Pak Vs Aus: ఆసీస్‌తో సెమీస్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాకులు.. వాళ్లు లేకుండా ఫైనల్ చేరడం కష్టమే?! Job finished? I don’t think so. https://t.co/uBCLLUuf6B — Jimmy Neesham (@JimmyNeesh) November 10, 2021 -
వారెవ్వా న్యూజిలాండ్.. దెబ్బకు దెబ్బ తీసింది
New Zeland Enters 1st Time Final In T20 World Cup History.. టి20 ప్రపంచకప్ 2021లో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించిన న్యూజిలాండ్ తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. తద్వారా 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఎదుర్కొన్న న్యూజిలాండ్ తాజా విజయంతో ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఇక మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇంగ్లండ్‌కు పెద్దగా అవకాశాలివ్వకుండా జాగ్రత్తపడింది. అయితే ఒకటి రెండుచోట్ల ఇంగ్లండ్ ఆటగాళ్లు క్యాచ్‌లు పట్టుకోవడంలోనూ.. ఫీల్డింగ్ మిస్ చేయడంలో విఫలమైంది. ఇక కివీస్ ఓపెనర్ డారెల్ మిచెల్ (72 పరుగులు, 47 బంతులు; 4 ఫోర్లు, 4 సిక్సర్లు)తో విధ్వంసం సృష్టించగా.. ఆఖర్లో నీషమ్(11 బంతుల్లో 27 పరుగులు) 3 సిక్సర్లతో హోరెత్తించి న్యూజిలాండ్ విజయానికి బాటలు పరిచాడు. -
పిచ్చి ప్రశ్న.. జట్టులోనే లేను.. నేనెలా తీస్తాను
లండన్: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ భలే సరదాగా ఉంటాడు. అది ఆన్‌ఫీల్డ్.. ఆఫ్‌ఫీల్డ్ ఏదైనా కావొచ్చు.. తన చర్యలతో అభిమానుల మనుసులు గెలుచుకుంటాడు. ఇక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండే నీషమ్ ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు గమ్మత్తైన సమాధానాలు ఇస్తూ ఆకట్టుకుంటాడు. తాజాగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ప్రపంచటెస్టు చాంపిన్‌షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్న కివీస్ ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను కూడా ఆరంభించారు. ఈ సందర్భంగా జేమ్స్ నీషమ్‌ను ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు వినూత్న రీతిలో సమాధానం ఇచ్చాడు. టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లిలలో ఎవరి వికెట్ తీస్తాననుకుంటున్నావు అంటూ ఒక అభిమాని ప్రశ్న వేశాడు. దీనికి నీషమ్ ఒక నిమిషం కూడా ఆలోచించికుండా అదేం ప్రశ్న.. అసలు నేను జట్టులోనే లేను.. ఇక వికెట్ ఎలా తీస్తాను.. ఒకవేళ అవకాశం వచ్చినా వికెట్ తీసే అవకాశాలు చాలా తక్కువ అంటూ ఫన్నీ సమాధానమిచ్చాడు. ఇక నీషమ్ ఇచ్చిన సమధానం వైరల్‌గా మారింది. వాస్తవానికి నీషమ్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడడం లేదు. అతను కివీస్ తరపున టెస్టు మ్యాచ్ ఆడి నాలుగు సంవత్సరాలైంది. 2014లో భారత్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన నీషమ్ 12 టెస్టులు మాత్రమే ఆడాడు. ఈ 12 టెస్టుల్లో 709 పరుగులు చేసిన నీషమ్ బౌలింగ్‌లో 14 వికెట్లు తీశాడు. నీషమ్ చివరిసారిగా 2017లో కివీస్ తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. అలాగే 66 వన్డేలాడి 1320 పరుగులతో పాటు 68 వికెట్లు, 29 టీ20లు ఆడి 324 పరుగులు సాధించాడు. కాగా భారత్, న్యూజిలాండ్ మధ్య జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చదవండి: క్రికెటర్ భువనేశ్వర్ ఇంట్లో విషాదం.. ఒక్క విజయం.. అంతే హోటల్ రూంకు వేగంగా పరిగెత్తా I would say that’s very unlikely https://t.co/S2YO22loW5 — Jimmy Neesham (@JimmyNeesh) May 20, 2021 -
ఒక్క విజయం.. అంతే హోటల్ రూంకు వేగంగా పరిగెత్తా
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో కేకేఆర్‌పై విజయం సాధించడం ద్వారా ముంబై ఇండియన్స్ లీగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబై స్పిన్నర్ రాహుల్ చహర్ 4 వికెట్లతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముంబై ఇచ్చిన 152 పరుగుల సాధారణ విజయలక్ష్యాన్ని కేకేఆర్ చేధించలేక 7 వికెట్లు కోల్పోయి 142 పరుగుల వద్దే ఆగిపోయి 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఆటగాడు జేమ్స్ నీషమ్ తన ట్విటర్ ద్వారా ఒక ఫన్నీ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో ఫారెస్ట్ గంప్ సినిమాలో హీరో టామ్ హాంక్స్ సంతోషం వస్తే ఎవరి మాట వినకుండా ఎలా పరిగెడతాడో.. మేము కూడా ఈరోజు కేకేఆర్‌పై విజయం సాధించిన తర్వాత హోటల్ రూంకు అంతే వేగంగా పరిగెత్తాము. అంటూ ట్వీట్ చేశాడు. కాగా గతేడాది సీజన్లో నీషమ్ కింగ్స్ పంజాబ్‌కు ఆడగా.. ఈసారి వేలంలో ముంబై ఇండియన్స్ అతన్ని కనీస మద్దతు ధరకే(రూ. 50లక్షలు) కొనుగోలు చేసింది. ఇక మ్యాచ్ విజయం అనంతరం.. కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఇది కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అని అన్నాడు. ప్రత్యేకంగా ఈ ఘనత బౌలర్లదేనని, ఇక బ్యాటర్స్‌గా తాము మంచి ప్రదర్శన చేయాల్సి ఉందన్నాడు. చెన్నైలో తొలి బంతి నుంచి హిట్ చేసే పరిస్థితులు ఉండటం లేదని, ఇది చెన్నైలోని చెపాక్‌లో ఒక ట్రెండ్‌లా కొనసాగుతోందన్నాడు. ఇక్కడ బ్యాటింగ్‌కు క్రీజ్‌లోకి వచ్చే ముందే ఎలా ఆడాలనేది ప్లాన్ చేసుకుని రావాలన్నాడు. మా బౌలర్ రాహుల్ చహర్ అద్భుత బౌలింగ్ కనబరిచాడు. 4 వికెట్లతో సత్తా చాటిన అతను కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో మా పని సులువైందని పేర్కొన్నాడు. తామింకా 15-20 పరుగులు చేయాల్సిందని, ఆఖరి ఓవర్లలో అనుకున్న పరుగులు రాలేదన్నాడు. డెత్ ఓవర్లలో బ్యాటింగ్ ఎలా చేయాలనే దానిపై కూడా ఫోకస్ చేస్తామన్నాడు. కాగా ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 17న సన్‌రైజర్స్‌తో ఆడనుంది. చదవండి: ఏడేళ్ల తర్వాత రోహిత్.. ఇది వ్యూహం కాదంటారా? Running back to the hotel with that win like pic.twitter.com/CH5XopMIj1 — Jimmy Neesham (@JimmyNeesh) April 13, 2021 -
'మ్యాక్స్‌వెల్.. 4,6,4,4,4,6.. నీకే తీసుకో'
వెల్లింగ్టన్: ఒక బ్యాట్స్‌మెన్ తన ప్రత్యర్థి బౌలర్‌ను ఉతికి ఆరేస్తే.. తరువాతి మ్యాచ్‌లో అతని వికెట్ తీసేందుకు కసిమీద ఉంటాడు సదరు బౌలర్. కానీ న్యూజిలాండ్‌కు చెందిన జేమ్స్ నీషమ్ మాత్రం ఈ విషయంలో తన ప్రత్యేకతను చూపించాడు. తనను ఉతికారేసిన బ్యాట్స్‌మన్‌కు తన జెర్సీనే కానుకగా ఇచ్చి అతన్ని సంతోషపరిచాడు. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరో కాదు.. ఆసీస్ విధ్వంసక ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. తాజాగా ఆసీస్ 5 టీ20ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ నీషమ్ బౌలింగ్‌ను ఉతికి ఆరేశాడు. ఆసీస్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మ్యాక్సీ నీషమ్ వేసిన ఆరు బంతులను వరుసగా 4,6,4,4,4,6 బాది మొత్తం ఆ ఓవర్లో 28 పరుగులు పిండుకున్నాడు. దీంతో నీషమ్ తన 4 ఓవర్ల కోటాలో ఒక వికెట్ కూడా తీయకుండా 60 పరుగులు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఏ బౌలర్ అయినా తన బౌలింగ్‌ను చీల్చి చెండాడిన బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. కానీ అందుకు భిన్నంగా నీషమ్ తన జెర్సీపై''టు.. మ్యాక్సీ.. 4,6,4,4,4,6.. బై నీషమ్'' అంటూ రాసి మ్యాక్సీకి అందజేశాడు. నీషమ్ ఎంతో ప్రేమగా తన జెర్సీని ఇవ్వడంతో నవ్వుతూ తీసుకున్న మ్యాక్సీ తన జెర్సీని నీషమ్‌కు ఇచ్చాడు. ఇలా ఒకరి జెర్సీలు ఒకరు మార్చుకున్న సమయంలో దిగిన ఫోటోను వారు పంచుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య 5 టీ20ల సిరీస్‌ను కివీస్ 3-2 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన చివరి టీ20లో కివీస్ 7 వికెట్ల తేడాతో ఆసీస్‌పై గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. చదవండి: మ్యాక్సీ సిక్సర్ దెబ్బకు విరిగిన కుర్చీ వేళానికి.. ఆ స్లో ఓవర్‌రేట్ మా కొంపముంచింది: లాంగర్ -
గెలిచారు కదా.. మొహం అలా పెట్టావేంటి?
షార్జా: ప్రస్తుత ఐపీఎల్లో పదే పదే ట్రోలింగ్ బారిన పడుతున్న క్రికెటర్లలో కింగ్స్ పంజాబ్ ఆల్ రౌండర్, న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్ ఒకడు. కొన్ని రోజుల క్రితం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఓడిపోయిన తరుణంలో నీషమ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో నీషమ్‌ను టార్గెట్ చేస్తూ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. అదే సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా నీషమ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అసలు నీషమ్ పూర్తిస్థాయి ఆల్ రౌండర్ కానప్పుడు జట్టులో ఎందుకు అంటూ తన యూట్యూబ్ చానల్లో ప్రశ్నించాడు. అటు బ్యాటింగ్ ఆల్‌రౌండర్, ఇటు బౌలింగ్ ఆల్‌రౌండర్ కాని ఆల్‌రౌండర్ అంటూ నీషమ్‌కు చురకలంటించాడు. (4 ఏళ్ల నాటి సల్మాన్ ట్వీట్ వైరల్..) దీనికి నీషమ్ సైతం ఘాటుగానే సమాధానం చెప్పడం, ఆపై ఆకాశ్ చోప్రా కూడా మళ్లీ రిప్లై ఇవ్వడం కూడా జరిగాయి. అది కింగ్స్ పంజాబ్ ఓడిపోయిన మ్యాచ్. ఇప్పడు కింగ్స్ పంజాబ్ గెలిచిన మ్యాచ్ కూడా నీషమ్‌పై విమర్శలు తప్పడం లేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ చివరి బంతికి గెలిచింది. ఆ తరుణంలో కింగ్స్ పంజాబ్ శిబిరం అంతా సంబరాలు చేసుకుంటుంటే నీషమ్ మాత్రం అలానే కూర్చొని ఉన్నాడు. మొహం అదోలా పెట్టి తదేకంగా ఆలోచనలో మునిగిపోయాడు. మ్యాచ్ ఎవరు గెలిస్తే మనకెందుకెలా అన్నట్లు డగౌట్ కూర్చొని ఏదో లోకంలో విహరిస్తున్నట్లు కనిపించాడు. నీషమ్ ఉన్నచోట నుంచి లేవకుండా జట్టును ఉత్సాహపరచకపోవడంతో దాన్ని ఫోటోలు తీసిన భిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.. మ్యాచ్ గెలిచారు కదా మొహం అలా పెట్టావేంటి అంటూ విమర్శించారు. ఒకవైపు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్‌లు చప్పట్లతో జట్టును అభినందిస్తూ ఉంటే నీషమ్ ఏమి పట్టన్నట్లు ఉండిపోయాడు. ఈ ఐపీఎల్ సీజన్లో సుదీర్ఘ విరామం తర్వాత కింగ్స్ పంజాబ్ మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. , చహల్ వేసిన ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ ఓవర్లో కింగ్స్ పంజాబ్‌కు రెండు పరుగులు అవసరం కాగా, చహల్ తొలి నాలుగు బంతులకు పరుగు మాత్రమే ఇచ్చాడు. ఇక ఐదో బంతికి గేల్ రనౌట్ అయ్యాడు. దాంతో ఉత్కంఠ ఏర్పడింది. కానీ పూరన్ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ఫినిష్ చేయడంతో కింగ్స్ పంజాబ్‌కు విజయం దక్కింది. (కెప్టెన్సీకి దినేశ్ కార్తీక్ గుడ్ బై) -
కరోనా దెబ్బ: కుక్కతో క్రికెటర్ ఆట
అక్లాండ్: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రపంచదేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. ఈ ప్రభావం క్రీడా రంగంపై భారీగానే పడింది. ఇప్పటికే పలు టోర్నీలు రద్దు కాగా మరికొన్ని టోర్నీలు వాయిదా పడ్డాయి. దీంతో క్షణం తీరికలేకుండా ఉండే ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. ఈ అనూహ్యంగా దొరికిన సమయాన్ని పలువురు క్రికెటర్లు తమ కుటుంబసభ్యులు, సన్నిహితులతో సరదాగా గడుపుతున్నారు. అంతేకాకుండా వీలు చిక్కినప్పుడల్లా అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ లాక్డౌన్ సమయంలో తన పెంపుడు కుక్కతో సరదాగా ఆడుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు నీషమ్. ఎంతో ఫన్నీగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక గతంలో కూడా తన పెంపుడు కుక్కకు స్లిప్‌లో క్యాచ్‌లు ఎలా పట్టాలో నీషమ్ ట్రైనింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తరుపున 12 టెస్టులు, 63వన్డేలు, 18 టీ20లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ అనతికాలంలోనే జట్టులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. చదవండి: ధోని.. ఈరోజు నీది కాదు! 'ఆరోజు హర్భజన్‌ను కొట్టడానికి రూమ్‌కు వెళ్లా' -
కోహ్లిపై జోక్.. నెటిజన్లు ఫైర్
వెల్లింగ్టన్: ఇటీవల కాలంలో ట్వీటర్లో ఆసక్తికర పోస్టులు చేస్తున్న న్యూజిలాండ్ క్రికెటర్ జేమ్స్ నీషమ్.. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై జోక్ వేసి విమర్శల పాలయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ రెండో రోజు ఆటలో 125 పరుగులు చేయడాన్ని ప్రస్తావిస్తూ..ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో కోహ్లి కంటే బర్న్స్ ఎక్కువ పరుగులు చేశాడంటూ తన ట్వీటర్ అకౌంట్లో నీషమ్ జోక్ చేశాడు. తొలి యాషెస్ ఇన్నింగ్స్‌లో కోహ్లి కంటే బర్న్స్ ఎక్కువ పరుగులు చేశాడని చమత్కరించాడు. ఇది కోహ్లి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో నీషమ్‌ను ఏకిపారేస్తున్నారు. ‘ వరల్డ్‌కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరకపోవడంతో ఆ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఇవ్వమంటూ ట్వీట్ చేశావ్.. ఇప్పుడేమో కోహ్లికి బర్న్స్‌కు పోలిక తెస్తున్నావు. ఇది మంచిది కాదు నీషమ్’ అని ఒకరు బదలివ్వగా, మరొక అభిమాని మాత్రం టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ యాషెస్ సిరీస్‌లో వికెట్లు ఏమీ తీయలేకపోయాడే’ అంటూ సెటైర్ వేశాడు. ‘ మొత్తం న్యూజిలాండ్ టాపార్డర్ ఆటగాళ్లు పరుగులు కంటే కోహ్లి ఒక్కడే ఎక్కువ పరుగులు చేశాడనే విషయం తెలుసుకో నీషమ్’ అంటూ మరొకరు వార్నిగ్ ఇచ్చారు. ‘ ఆసియా కప్‌లో ఆసీస్-ఇంగ్లండ్ ఆటగాళ్ల కంటే కోహ్లనే ఎక్కువ పరుగులు చేశాడు’ అని మరొక అభిమాని ఎద్దేవా చేశాడు. అసలు యాషెస్ సిరీస్ అనేది ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగేది కాబట్టి.. నీషమ్ వేసిన జోక్‌కు అదే తరహాలో బదులిస్తున్నారు నెటిజన్లు. -
బిర్యానీ కోసం పాక్ వరకూ ఎందుకులే!
ఒంటారియో: ఇటీవల కాలంలో ట్వీటర్లో ఆసక్తికర పోస్టులు చేస్తున్న క్రికెటర్లలో న్యూజిలాండ్ ఆటగాడు జేమ్స్ నీషమ్ ఒకడు. వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరినా, అదృష్టం కలిసి రాకపోడంతో విశ్వ విజేతగా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఆ క్రమంలోనే ఎవరూ క్రీడలను ఎంచుకోవద్దని తనలోని ఆవేదనను వ్యక్తం చేశాడు. క్రీడల్ని తప్ప మిగతా ఏ రంగాన్నైనా ఎన్నుకోండి అంటూ పిల్లలకు సూచించాడు. ఇలా ఏ సందర్భలోనైనా తనదైన రీతిలో సమాధానాలిస్తూ సోషల్ మీడియాలో నీషమ్ తరచు వార్తలో ఉంటున్నాడు. తాజాగా తమ దేశం వస్తే ఒక మంచి బిర్యానీ పెట్టిస్తామన్న పాక్ అభిమానులకు కొంటెగా సమాధానమిచ్చాడు నీషమ్. డిన్నర్, బీర్స్ కోసం టోరంటోలోనే ఏమైనా ప్రతిపాదనలు ఉంటే చెప్పండి. అది కూడా ఓపెన్ టాప్ బార్లో అయితే బాగుంటుంది* అని నీషమ్ ముందుగా ట్వీట్ చేశాడు. దీనికి పాక్ అభిమానులు స్పందిస్తూ.. ‘నీషమ్.. మీరు మా దేశం వచ్చి బిర్యానీని ఆరగించండి. పాకిస్తాన్ బిర్యానీ అంటే వరల్డ్‌లోనే అత్యుత్తమ వంటకం. మా దేశ బిర్యానీని మీకు వడ్డించే అవకాశం ఇవ్వండి’ అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు నీషమ్ ట్విటర్లోనే స్పందిస్తూ..‘ బిర్యానీ కోసం పాక్ వరకూ ఎందుకులే. పాక్ చాలా దూరం కదా’ అని అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్న నీషమ్.. టోరంటోలో ఉన్నాడు. -
సూపర్ ఓవర్ టెన్షన్.. ప్రాణాలు వదిలిన కోచ్
ఆక్లాండ్: వన్డే ప్రపంచకప్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడుతుండగా విషాదం చోటుచేసుకుంది. అతడి చిన్ననాటి కోచ్, ఆక్లాండ్ గ్రామర్ స్కూల్ మాజీ టీచర్ డేవిడ్ జేమ్స్ గొర్డాన్ మరణించాడు. మ్యాచ్ ఫలితాన్ని తేల్చే సూపర్ ఓవర్లో రెండో బంతిని నీషమ్ సిక్సర్ కొట్టిన సమయంలోనే జేమ్స్ గొర్డాన్ కన్నుమూసినట్టు ఆయన కుమార్తె లియోనీ వెల్లడించారని స్థానిక మీడియా తెలిపింది. ‘గొర్డాన్ తుదిశ్వాస విడిచారని సూపర్ ఓవర్ జరుగుతుండగా నర్స్ వచ్చి మాతో చెప్పారు. నీషమ్ సిక్సర్ బాదిన క్షణంలోనే ఆయన చనిపోయివుండొచ్చని అన్నారు. మా నాన్న హాస్యప్రియుడు. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అందరితో ప్రేమగా ఉండేవార’ని లియోనీ గుర్తు చేసుకున్నారు. గొర్డాన్ మృతికి నీషమ్ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపాడు. ‘డేవిడ్ జేమ్స్ గొర్డాన్.. నా హైస్కూల్ టీచర్, కోచ్, స్నేహితుడు. క్రికెట్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన దగ్గర మేమంతా ఆట నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఉత్కంఠభరితంగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో మా ఆటతీరును ఆయన గర్వించే ఉంటారు. మాకు ప్రతిదీ నేర్పినందుకు ధన్యవాదాలు. సంతాపం’ అంటూ నీషమ్ ట్వీట్ చేశాడు. నీషమ్‌ను తన తండ్రి ఎంతగానో అభిమానించేవారని లియోనీ పేర్కొన్నారు. ఆక్లాండ్ గ్రామర్ స్కూల్లో 25 ఏళ్లుపైగా టీచర్‌గా పనిచేసిన డేవిడ్ జేమ్స్ గొర్డాన్ ఎంతో మంది విద్యార్థులకు క్రికెట్, హాకీ నేర్పించారు. నీషమ్, ఫెర్గూసన్‌లతో పాటు చాలా మంది హైస్కూల్ విద్యార్థులకు కోచింగ్ ఇచ్చారు. (చదవండి: విశ్వవిజేతగా ఇంగ్లండ్) -
మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్ ఆవేదన
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. .ఆదివారం అర్థరాత్రి వరకు కొనసాగిన ఉత్కంఠ పోరులో మ్యాచ్ టై కాగా, ఆపై నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా టైగానే ముగిసింది. దీంతో బౌండరీలను( సూపర్ ఓవర్‌తో సహా ఫోర్లు, సిక్సర్లు) లెక్కలోకి తీసుకున్న ఇంగ్లండ్‌నే వరల్డ్ చాంపియన్‌గా ప్రకటించారు. ఇది ఆతిథ్య ఇంగ్లండ్‌కు అనుకూలంగా మారగా, గెలుపు తలుపు వరకు వెళ్లి వచ్చిన న్యూజిలాండ్ జట్టు ఆవేదన మాత్రం వర్ణనాతీతం. కప్పు ఇంగ్లండ్ గెలుచుకున్నా... న్యూజిలాండ్ మాత్రం అందరి మనసు గెలుచుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పుట్టెడు దుఖంలో న్యూజిలాండ్ క్రికెటర్ జేమ్స్ నీషమ్( జిమ్మీ నీషమ్‌గా కూడా పిలుస్తారు) ట్వీటర్లో పోస్ట్ చేసిన ఓ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పిల్లలూ మీరెవరూ క్రీడల్లోకి రావొద్దు. మరి ఎదైనా ప్రొఫెషన్ తీసుకోండి. 60 ఏళ్లకే హ్యాపీగా ఆరోగ్యంగా చనిపోండి’ అంటూ జిమ్మీ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌కు అభినందనలు తెలియజేశాడు నీషమ్. జిమ్మీ నీషమ్ పెట్టిన ఈ పోస్టులకు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. న్యూజిలాండ్ అభిమానులే కాదు.. భారత క్రికెట్ అభిమానులు సైతం నీషమ్‌ను ఓదార్చుతున్నారు. మీరు ఆడిన తీరు... ఎవరూ మరిచిపోలేరని అండగా నిలుస్తున్నారు. Kids, don’t take up sport. Take up baking or something. Die at 60 really fat and happy. — Jimmy Neesham (@JimmyNeesh) 15 July 2019 -
పాక్ ఛేదిస్తుందా.. చతికిలపడుతుందా?
బర్మింగ్‌హామ్ : ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ 238 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాక్ బౌలర్ల ధాటికి ఓ దశలో 83 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన కివీస్ ఆ మాత్రం స్కోర్‌నైనా సాధించిందంటే ఆ క్రెడిట్ గ్రాండ్‌హోమ్, నీషమ్లకే దక్కుతుంది. ఆరంభంలోనే షాహిన్ ఆఫ్రిది(3/28) నిప్పులు చెరగడంతో కివీస్ టాపార్డర్ కుప్పకూలింది. అయితే ఆల్‌రౌండర్లు నీషమ్(97 నాటౌట్; 112 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్రాండ్‌హోమ్(64; 71 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోర్‌ను సాధించగలిగింది. పాక్ బౌలర్లలో ఆఫ్రిది మూడు వికెట్లతో చెలరేగగా.. అమిర్, షాదాబ్‌లు తలో వికెట్ దక్కించుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు పాక్ బౌలర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు. అమిర్ బౌలింగ్‌లో మార్టిన్ గప్టిల్(5) ఔట్ కావడంతో కివీస్ వికెట్ల పతనం ప్రారంభమైంది. మున్రో(12), టేలర్(3), లాథమ్(1)లను షాహిన్ ఆఫ్రిది పెవిలియన్‌కు పంపించి కివీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ తరుణంలో జేమ్స్ నీషమ్‌తో కలిసి సారథి విలియమ్సన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే విలియమ్సన్(41) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. నీషమ్, గ్రాండ్‌హోమ్ అదరహో.. క్లిష్ట సమయంలో ఉన్న కివీస్‌ను ఆల్‌రౌండర్లు నీషమ్, గ్రాండ్‌హోమ్‌లు ఆదుకున్నారు. తొలుత వికెట్ల పతనాన్ని అడ్డుకొని అనంతరం పరుగుల బోర్డును పరిగెత్తించారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే ఇన్నింగ్స్ చివర్లో గ్రాండ్‌హోమ్ అనవసరంగా రనౌటైనా.. నీషమ్ మాత్రం చివరి వరకు ఉండి జట్టును నడిపించాడు. చివర్లో నీషమ్ మరింత ధాటిగా ఆడటంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. -
నీషమ్ దెబ్బకి.. అఫ్గాన్ ఢమాల్
టాంటన్ : న్యూజిలాండ్ బౌలర్లు జేమ్స్ నీషమ్(5/31), ఫెర్గుసన్(4/37) ధాటికి పసికూన అఫ్గానిస్తాన్ విలవిల్లాడింది. ప్రపంచకప్‌లో భాగంగా కివీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గాన్ 173 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అఫ్గాన్ ఆటగాళ్లలో షాహిది(59), హజ్రతుల్లా(34), నూర్ అలీ జద్రాన్(31) మినహా ఎవరూ రాణించలేకపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన అఫ్గాన్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. తొలి పది ఓవర్ల పాటు సాఫీగా సాగిన అఫ్గాన్ ఇన్నింగ్స్ ఆ తర్వాత కుదేలైంది. తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడినని విడదీసేందుకు విలియమ్సన్ నీషమ్‌కు బంతిని అప్పగించాడు. నీషమ్ బౌలింగ్‌కు దిగాక మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. నాలుగు పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి అఫ్గాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఈ తరుణంలో షాహిది ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అతడికి సహకారం అందించే వారు కరువయ్యారు. కివీస్ బౌలర్ల ధాటికి ఏడుగురు అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో 41.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. -
'ధోని కోసం అస్త్రాలు సిద్ధం చేయాలి'
మొహాలి: తమతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లిలు కీలక ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ తెలిపాడు. ప్రధానంగా ధోని క్రీజ్‌లోకి వచ్చిన మరుక్షణమే తమపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించడంతోనే మ్యాచ్‌పై మెల్లగా పట్టుకోల్పోయమన్నాడు. అతనికి జతగా విరాట్ కోహ్లి కూడా అద్భుతమైన ఆట తీరుతో రాణించడంతో తమ వద్ద సరైన సమాధానం లేకుండా పోయిందన్నాడు. తాము ఎంత గొప్పగా బౌలింగ్ వేసినప్పటికీ, వరల్డ్ అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్లైన కోహ్లి, ధోనిల ముందు తమ వ్యూహాలు పని చేయలేదన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము బౌలింగ్ సరిగా వేయకపోవడంతోనే ఓటమి చెందామనడం ఎంతమాత్రం సరైనది కాదని నీషమ్ పేర్కొన్నాడు. 'మేము ఈ మ్యాచ్ లో చాలా బాగా బౌలింగ్ వేశాం. అయినప్పటికీ ధోని-కోహ్లిల జోడి అసాధారణమైన ఆట తీరును కనబరించింది. ప్రత్యేకంగా ధోని ఆరంభం నుంచి షాట్లతో చెలరేగాడు. తదుపరి మ్యాచ్ ల్లో ధోని కోసం తగిన అస్త్రాలు సిద్ధం చేసుకోవాలి' అని నీషమ్ తెలిపాడు. తాము వరుస విరామాల్లో కీలక వికెట్లను చేజార్చుకోవడంతో స్కోరు బోర్డుపై సాధ్యమైనన్ని పరుగుల్ని ఉంచలేకపోయామన్నాడు. తమ బ్యాటింగ్ లో 50వ ఓవర్ వరకూ క్రీజ్ లో ఉండి ఉంటే మరిన్ని పరుగుల వచ్చేవని, కాకపోతే చివరి బంతి వరకూ ఆడకుండా ఆలౌట్ కావడంతో అనుకున్న పరుగుల్ని సాధించలేకపోయామని నీషమ్ అన్నాడు.