
టాంటన్ : న్యూజిలాండ్ బౌలర్లు జేమ్స్ నీషమ్(5/31), ఫెర్గుసన్(4/37) ధాటికి పసికూన అఫ్గానిస్తాన్ విలవిల్లాడింది. ప్రపంచకప్‌లో భాగంగా కివీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గాన్ 173 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అఫ్గాన్ ఆటగాళ్లలో షాహిది(59), హజ్రతుల్లా(34), నూర్ అలీ జద్రాన్(31) మినహా ఎవరూ రాణించలేకపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన అఫ్గాన్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. తొలి పది ఓవర్ల పాటు సాఫీగా సాగిన అఫ్గాన్ ఇన్నింగ్స్ ఆ తర్వాత కుదేలైంది.
తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడినని విడదీసేందుకు విలియమ్సన్ నీషమ్‌కు బంతిని అప్పగించాడు. నీషమ్ బౌలింగ్‌కు దిగాక మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. నాలుగు పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి అఫ్గాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఈ తరుణంలో షాహిది ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అతడికి సహకారం అందించే వారు కరువయ్యారు. కివీస్ బౌలర్ల ధాటికి ఏడుగురు అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో 41.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment