రహమత్ షా ఔటైన ఆనందంలో కివీస్ ఆటగాళ్లు
సాక్షి స్పోర్ట్స్: ప్రపంచ్ కప్-2019లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, కివీస్‌ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో కివీస్ సునాయాస విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ విసిరిన స్వల్ప లక్ష్యాన్ని 32.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి కివీస్ చేధించింది. కివీస్ బ్యాట్స్మన్లలో కేన్ విలియమ్సన్(79 నాటౌట్), రాస్ టేలర్(48) రాణించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఆలమ్‌కు 3 వికెట్లు దక్కాయి. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆఫ్ఘనిస్తాన్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చినప్పటికీ మిడిలార్డర్ విఫలం కావడంతో 41.1 ఓవర్లలో 172 పరుగుల స్కోరుకే ఆలౌటయింది.
ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మన్లలో హష్మతుల్లా షాహిదీ(59) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. జజై(34), జర్దాన్(31) చెప్పకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కివీస్ బౌలర్లు నీషమ్‌కు 5 వికెట్లు, ఫెర్గూసన్‌కు 4 వికెట్లు దక్కాయి. బౌలింగ్‌లో రాణించిన నీషమ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment