Srividya
-
అందుకే కమల్‌తో శ్రీవిద్య పెళ్లి జరగలేదు: హీరోయిన్ వదిన
బాల్యంలోనే సినిమాల్లో అడుగుపెట్టింది శీవిద్య. బాలనటిగా కెరీర్ ఆరంభించిన ఆమె అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలతో సహా 500కు పైగా చిత్రాల్లో నటించింది. సినిమాల్లో నటిస్తున్న సమయంలో కమల్ హాసన్‌తో ప్రేమలో పడింది. అప్పటికే అతడు వాణితో ప్రేమలో ఉన్నాడు. తర్వాత కమల్- శ్రీవిద్య కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ చివరకు కమల్.. వాణినే పెళ్లి చేసుకోవడంతో శ్రీవిద్యది విఫల ప్రేమగానే మిగిలిపోయింది. శ్రీవిద్య, నేను క్లోజ్‌గా ఉండేవాళ్లం తాజాగా వీరి ప్రేమ గురించి శ్రీవిద్య సోదరుడి భార్య విజయలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'శ్రీవిద్య, నేను చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. కమల్ హాసన్‌ను తను ఎంతగా ప్రేమించిందో నాకు బాగా తెలుసు. నా భర్త శంకర్, కమల్ చాలా మంచి మిత్రులు. ఓసారి కమల్.. శంకర్‌తో శ్రీవిద్యను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పాడు. అయితే ఇంట్లో మాట్లాడాక ఏ విషయం అనేది చెప్తానన్నాడు శంకర్. శ్రీవిద్య తల్లి ఒప్పుకోలేదు తను ఇంట్లో చెప్పగానే మా అత్తయ్య (శ్రీవిద్య తల్లి) అస్సలు ఒప్పుకోలేదు. ఇద్దరూ ఒకే ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఈ పెళ్లి జరగదు అని చెప్పేశారు. శ్రీవిద్యకు అప్పుడప్పుడే హీరోయిన్గా మంచి అవకాశాలు వస్తున్నాయని, ఇప్పట్లో పెళ్లి చేసే ఉద్దేశ్యమే లేదని తెగేసి చెప్పింది. కమల్ కొన్నాళ్లు ఆగుతామన్నాడు. అయినా కుదరదని చెప్పేసింది. శ్రీవిద్య కంటే కమల్ ఏడాది చిన్నవాడు కావడం కూడా ఓ సమస్యగా మారింది. కానీ శ్రీవిద్య అతడిని ప్రాణంగా ప్రేమించింది. అమ్మ మాట కాదనలేకపోయారు ఎలాగైనా అమ్మను ఒప్పించంటూ తన అన్నయ్యను వేడుకుంది. ఈ విషయంలో అతడికి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా తల్లి ఒప్పుకోకపోవడంతో ఏం చేయలేకపోయాడు. కానీ మా అత్తయ్య వైవాహిక జీవితం కూడా సజావుగా సాగలేదు. బహుశా అందుకేనేమో.. పెళ్లనగానే తను అలా స్పందించి ఉండవచ్చు' అని పేర్కొంది శ్రీవిద్య వదిన. క్యాన్సర్‌తో కన్నుమూత కాగా కమల్ హాసన్‌తో విఫల ప్రేమ తర్వాత శ్రీవిద్య అసిస్టెంట్ డైరెక్టర్ జార్జ్ థామస్‌ను 1978లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వైవాహిక జీవితంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె రెండేళ్లకే అతడికి విడాకులిచ్చేసింది. 2003లో రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ ఈ హీరోయిన్ 2006లో కన్నుమూసింది. చనిపోయేముందు ఓ ట్రస్టు స్థాపించిన ఆమె.. తన ఆస్తినంతా పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా వీలునామా రాసింది. అలాగే తన సోదరుడి పిల్లలకు చెరి రూ.5 లక్షలు ఇవ్వాలని వీలునామాలో ప్రస్తావించింది. చదవండి: హనుమాన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ ఎంతంటే? -
సినిమాల్లో స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!
అలనాటి హీరోయిన్ శ్రీవిద్య పేరు 1970లో వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1953న 24 జూలై జన్మించిన శ్రీవిద్య 14 ఏళ్లకే తమిళ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతో నటించింది. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత మలయాళంలో తొలి అవకాశం వచ్చింది. 1971లో 'నోట్రుకు నురు' సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఏడాదిలోనే ‘ఢిల్లీ టు మద్రాస్’ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో దాసరి నారాయణరావు తెరకెక్కించిన తాతమనవడు చిత్రంతో అరంగేట్రం చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషలతో సహా 500కు పైగా సినిమాల్లో నటించింది. అప్పటి హీరోయిన్లలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్గా నిలిచింది. కుటుంబ నేపథ్యం శ్రీ విద్య తండ్రి కృష్ణమూర్తి తమిళ చిత్ర పరిశ్రమలో హాస్యనటుడు.. తల్లి వసంతకుమారి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. జీవితం సవ్యంగా సాగుతున్న సమయంలోనే శ్రీవిద్య తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత కుటుంబ పోషణకై ఆమె తల్లి కూలి పనికి వెళ్లేది. అప్పట్లో అమ్మకు కనీసం పాలివ్వడానికి కూడా సమయం సరిపోలేదని గతంలో శ్రీవిద్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. వైవాహిక జీవితం శ్రీవిద్య సినిమాల్లో నటిస్తుండాగనే.. తమిళస్టార్ హీరో కమల్ హాసన్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అయితే అప్పటికే కమల్ హాసన్ మరో హీరోయిన్ వాణి గణపతితో ప్రేమలో ఉన్నాడు. ఆ తర్వాత దర్శకుడు భరతన్‌తో శ్రీవిద్య ప్రేమాయణం కొనసాగించినా.. ఆ బంధంఎక్కువ కాలం నిలవలేదు. చివరికీ మాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న జార్జ్ థామస్‌ని ప్రేమించి 1978లో పెళ్లి చేసుకుంది. అయితే ఇది కులాంతర వివాహం కావడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భర్త వేధింపులు పెళ్లయిన తర్వాత క్రైస్తవ మతాన్ని అనుసరించాలని భర్త జార్జ్ షరతు పెట్టాడట. దీంతో శ్రీవిద్య పెళ్లికి ముందే బాప్టిజం పూర్తి చేసింది. పెళ్లి తర్వాత కూడా భర్త బలవంతం వల్లే మళ్లీ నటనలో అడుగుపెట్టింది. అయినప్పటికీ జార్జ్ శ్రీవిద్యను వేధింపులకు గురి చేయడంతో.. ఆ బాధలు భరించలేక 1980లో విడాకులు తీసుకుని జార్జ్‌తో బంధానికి ముగింపు పలికింది. విడాకులిచ్చినా భర్త వదల్లేదు విడాకుల తర్వాత శ్రీవిద్య నటనలో కొనసాగింది. అయితే విడాకుల తర్వాత కూడా శ్రీవిద్యను జార్జ్ వదల్లేదు. ఆమె ఆస్తులన్నీ తనకు తిరిగి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. చివరకు సుప్రీంకోర్టులో శ్రీ విద్య విజయం సాధించింది. ఆ తర్వాత శ్రీవిద్య చెన్నై వదిలి కేరళలోని తిరువనంతపురంలో స్థిరపడింది. క్యాన్సర్‌తో మరణం 2003లో శ్రీవిద్యకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ తర్వాత ఆమె చికిత్స కూడా తీసుకున్నారు. తాను చనిపోవడానికి 2 నెలల ముందు శ్రీవిద్య తన బంధువు సహాయంతో ఓ ట్రస్టు స్థాపించి.. ఆస్తినంతా పేద విద్యార్థులకు చదువు, సంగీతం, నాట్యం కోసం కేటాయించేలా వీలునామా రాసింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సినీ కళాకారులను ఆదుకోవాలని వీలుమానాలో వెల్లడించింది. అంతేకాదు తన సోదరుడి ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, కార్మికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వాలని వీలునామాలో ప్రస్తావించింది. క్యాన్సర్‌తో చివరికి శ్రీవిద్య 19 అక్టోబర్ 2006న మరణించగా.. తిరువనంతపురంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం విజయం సాధించలేకపోయింది. రెండుసార్లు లవ్ ఫెయిల్యూర్, భర్త వేధింపులు, చివరికీ క్యాన్సర్‌తో మరణం ఆమె జీవితాన్ని విషాదంగా ముగిసేలా చేశాయి. -
Kutty Padmini: కమల్, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య నమ్మలేదు.. పాపం!
కుట్టి పద్మిని దక్షిణాది ఇండస్ట్రీలో సీనియర్ నటీమణుల్లో ఒకరు. ఆమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటించింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషా చిత్రాలలో కూడా కనిపించింది. తన మూడవ ఏటనే 1959లో తొలిసారిగా తమిళంలో బాల నటిగా నటన జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జైశంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్స్‌తో నటించింది. అయితే ప్రస్తుతం ఆమె యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ బిజినెస్‌లో బిజీ ఆయిపోయారు. ఇటీవల ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. (ఇది చదవండి: రూమ్‌లో అడ్జస్ట్ అవుతారా అని అడిగారు: సీనియర్ నటి) పద్మిని మాట్లాడుతూ.. 'కమల్ హాసన్.. శ్రీవిద్య, రేఖ, జయసుధ, వాణీ గణపతితో సహా మరో ఇద్దరు నటీమణులతో కలిపి ఒకేసారి ఆరుగురితో ప్రేమ వ్యవహారం నడిపించారు. కానీ చివరికి వాణీ గణపతిని కమల్ హాసన్ పెళ్లాడారు. వీరి పెళ్లి వార్త శ్రీదేవి, శ్రీవిద్యలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే శ్రీవిద్య కమల్‌హాసన్‌ను ఎంతో ఇష్టపడింది. ఆయనకు పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అతనికి పెళ్లి కావడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. నేను కమల్‌తో తెలుగు సినిమాలో నటిస్తున్నప్పుడు ఆయన వాణితో ప్రేమలో పడ్డారు. ఎయిర్‌పోర్టులో ఆమెకు బహుమతి కూడా కొన్నాడు. ఆ తర్వాత మద్రాస్‌కు చెందిన నటి రేఖతో ప్రేమాయణం కొనసాగించారు. ఈ విషయాన్ని నేను నేరుగా వెళ్లి శ్రీవిద్యకు చెప్పా. కానీ ఆమె నమ్మలేదు. కమల్‌కు 'సకలకళా వల్లభుడు' అన్న బిరుదు రావడానికి ఇదే కారణం.' ఆమె పేర్కొంది. (ఇది చదవండి: విడాకుల ఫోటోషూట్.. ఇదేం ట్రెండ్ రా బాబు!) అయితే కమల్ వాణిని పెళ్లి చేసుకున్న తర్వాత.. శ్రీవిద్య చాలా రోజులు ఈ వాస్తవాన్ని భరించలేక తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు పద్మిని తెలిపింది. కానీ కొన్నేళ్ల తర్వాత జార్జ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే కొద్ది రోజులకే విడాకాలు తీసుకుంది. సినిమాల నుంచి తప్పుకున్న శ్రీవిద్య తిరువనంతపురంలో స్థిరపడింది. తన ఆస్తి మొత్తాన్ని ఓ ట్రస్ట్‌కు రాసిచ్చింది. ఆ తర్వాత ఆమెకు క్యాన్సర్ రావడంతో 2006లో మరణించింది. తెలుగులో చివరగా విజయ్ ఐపీఎస్ అనే సినిమాలో శ్రీవిద్య నటించారు.ఈ సినిమాలో హీరోగా సుమంత్ నటించారు. -
వందల సినిమాల్లో నటించిన ఈ ‘ఎమోషనల్ యాక్ట్రెస్’ గుర్తుందా?
సినిమా అంటే జనాలకు మాత్రమే రంగుల ప్రపంచమే కాదు.. అవతల నటించే వాళ్లకు కూడా. ‘ఎంత బలవంతులనైనా ఏదో ఒక టైంలో మానసికంగా కుంగుబాటుకు కచ్ఛితంగా గురిచేసేదే సినిమా’ అంటూ స్పీల్‌బర్గ్‌లాంటి దిగ్గజాలు చెప్పడం చూస్తుంటాం. అలా ఎన్నో కలలతో సినిమాల్లోకి అడుగుపెట్టిన సీనియర్ నటి శ్రీవిద్య జీవితం..విషాదంగా ముగియడం మీలో ఎంత మందికి గుర్తుంది?. ఇవాళ ఆమె జయంతి.. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ.. ఇలా సుమారు 800కు పైగా సినిమాల్లో నటించారు శ్రీవిద్య. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా.. అటుపై సపోర్టింగ్ రోల్స్, అక్కా-చెల్లి, అమ్మ, అత్త క్యారెక్టర్లతో అలరించారు. ముఖ్యంగా ఆమె పండించే భావోద్వేగాలు ఇప్పటికీ జనాలకు గురుతు. అందుకే ఎమోషనల్ యాక్ట్రెస్‌గా ఆమెకు ఓ పేరు ముద్రపడింది. కేవలం నటనతోనే కాదు.. తన మధుర గాత్రంతో ఎన్నో పాటలు, డబ్బింగ్‌తోనూ దక్షిణాది ప్రేక్షకుల్ని రంజింపచేశారామె. ‘నటన’ కుటుంబంలో జననం 1953, జులై 24న మద్రాస్‌లో పుట్టారామె. తండ్రి కృష్ణమూర్తి సినిమాల్లో కమెడియన్‌గా స్థిరపడగా, తల్లి వసంతకుమారి కర్ణాటక క్లాసిక్ సింగర్(ఎంఎస్ సుబ్బలక్క్క్ష్మి, డీకే పట్టమ్మస్ సమకాలికురాలు). అయితే శ్రీవిద్య పుట్టిన కొన్నాళ్లకే తండ్రి పక్షవాతం బారినపడడంతో కుటుంబానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీంతో వసంతకుమారి నానాకష్టాలు పడి సంపాదించింది. ఒకానొక టైంలో తనకు పాలు ఇచ్చే సమయం ఉండేది కాదన్న తల్లి మాటల్ని శ్రీవిద్య పలు ఇంటర్వ్యూలో సైతం గుర్తు చేసుకునేవాళ్లు. ‘బొటాబొటీ’ చదువు కొనసాగించిన శ్రీవిద్య అందగత్తె కావడంతో అమెరికా నుంచి ఓ సైంటిస్ట్ సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అయితే డబ్బు లేదన్న కారణంతో ఆ సంబంధం అంతే స్పీడ్‌గా వెనక్కి వెళ్లిపోయింది. దీంతో కుటుంబానికి భారం కాకూడదన్న ఉద్దేశంతో తండ్రి పరిచయాలతో ఆమె నటనలోకి అడుగుపెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలై.. 1967 తమిళ సినిమా శివాజీ గణేషన్ హీరోగా ‘తిరువరుల్చెల్వర్’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారామె. ఆ తర్వాత మలయాళ సినిమా ‘కుమార సంభవం’తో, తెలుగులో దాసరి ‘తాతా మనవడు’తో అరంగ్రేటం చేసింది శ్రీవిద్య. దర్శకదిగ్గజం కే బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన ‘నూట్రుక్కు నూరు’(1971) నటిగా ఆమెకంటూ ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. హీరోయిన్గా ‘ఢిల్లీ టు మద్రాస్’(1972) ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన సినిమాల ద్వారా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ వచ్చారామె. మల్టీటాలెంటెడ్ అల్లరి క్యారెక్టర్లతో అలరించినా.. మెచ్యూర్డ్రోల్స్ చేసినా.. ఆ క్యారెక్టర్‌తో ఎమోషనల్‌గా ట్రావెల్ కావడం ఆమెకు ఉన్న నైజం. అందుకే హీరోయిన్గా ఫేడ్అవుట్ అయ్యాక ఆమెకు హుందా పాత్రలెన్నో వచ్చాయి. నటిగానే కాదు.. ప్లేబ్యాక్ సింగర్‌గానూ ఆమె అలరించారు. స్వతహాగా క్లాసికల్ సింగర్ కావడంతో ఆమె గాత్రం పాటలకు మరింత అందాన్ని తెచ్చిపెట్టేవి. అంతేకాదు పదుల సంఖ్యలో సినిమాలకు ఆమె డబ్బింగ్ కూడా చెప్పారు. ‘ప్రేమ’ మోసం కెరీర్ తొలినాళ్లలో కమల్ హాసన్‌తో ఆమె నటించింది. ఆ టైంలో ఇద్దరి మధ్య ఎటాచ్మెంట్ ఎక్కువగా ఉండేది. ఒకానొక టైంలో కమల్‌తో పీకలలోతు ప్రేమలో కూరుకుపోయిందామె. అయితే అప్పటికే కమల్ వాణీ గణపతితో ప్రేమలో ఉండడంతో ఆమె పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి మలయాళంలో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన జార్జ్ థామస్‌తో ప్రేమలో పడి.. తల్లిదండ్రుల మాట వినకుండా వివాహం చేసుకుంది. మతం మార్చుకుని నటనకు దూరమైంది. డబ్బు కోసం తిరిగి నటించాలన్న భర్త ఒత్తిడితో తిరిగి మేకప్ వేసుకుంది. ఆపై భర్త తీరును అర్థం చేసుకుని.. విడాకులిచ్చేసింది. నటన కొనసాగిస్తున్న టైంలో మలయాళ దర్శకుడు భరతన్‌తో కొన్నాళ్లపాటు ప్రేమాయణం కొనసాగించింది. అయితే భరతన్ మరొకరిని వివాహం చేసుకున్నాడు. దీంతో భరతన్ తన ఆస్తులు లాగేసుకుని తనను మోసం చేశాడంటూ శ్రీవిద్య కోర్టుకెక్కింది. చివరికి సుప్రీం కోర్టు తీర్పుతో విజయం సాధించి తన ఆస్తుల్ని దక్కించుకున్న ఆమె.. చెన్నై నుంచి తిరువంతపురానికి మకాం మార్చేసింది. అపూర్వ రాగంగల్-అపూర్వ సగోదరర్గల్ చనిపోయే ముందు దాకా.. 2003లో అనారోగ్యం పాలైన ఆమెకు.. క్యాన్సర్ అని తేలింది. ఆటైంలో మూడేళ్లపాటు ఆమె చికిత్స తీసుకుంది. ఆ టైంలోనూ ఆమెను వదల్లేదు. అంతేకాదు ఫోర్త్ స్టేజ్‌లో ఉన్న తాను బతకడం కష్టమనే విషయం అర్థమైయ్యింది ఆమెకు. అందుకే తన పేరు మీద ఒక్క పైసా కూడా ఉండొద్దన్నది నిర్ణయించుకుంది. మొత్తం ఆస్తిని సేవాకార్యక్రమాలకు ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. అప్పటికే కేరళ ప్రభుత్వం స్కాలర్షిప్ ఆపేయడంతో పేద సంగీత, నృత్య కళాకారులైన విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. అందుకని మలయాళ నటుడుని రిజిస్టర్‌గా నియమిస్తూ.. తన ఆస్తులను అప్పజెప్పింది. తద్వారా ఓ ఛారిటబుల్ సొసైటీ ఏర్పాటు చేయించి అర్హులైనవాళ్లకు స్కాలర్షిప్ అందించే ఏర్పాటు చేయించింది. మిగిలిన ఆస్తిని బంధువుల పేరిట రాసేసింది. తన అన్నల పిల్లలకు ఒక్కొక్కరి ఐదు లక్షలు, చివరికి తన ఇంట్లో పని వాళ్లు.. వాళ్ల ఇంటి సభ్యులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున జమ చేయించింది. మరికొంత ఆస్తిని సొంత వూరికి, ఇంకొంత సొమ్మును రెండో ఇల్లు తిరువనంతపురానికి దానం చేసింది. ఆ తర్వాత కీమో థెరపీకి వెళ్లిన ఆమె.. ఆ ట్రీట్మెంట్ టైంలోనే 2006, ఆగస్టు 17న యాభై మూడేళ్ల వయసులో ఆమె కన్నుమూసింది. ఆమె సేవానీరతికి గుర్తుగా తిరువనంతపురం ప్రజలు లాంఛనంగా ఆమె అంత్యక్రియల్ని ఘనంగా జరిపించారు. తల్లిగా ప్రత్యేకం నలభై ఏళ్లపాటు మలయాళం, తమిళంలో వందలకొద్దీ, తెలుగులో నలభై దాకా, కన్నడలో డజను, హిందీలో రెండు.. మొత్తం 800 దాకా సినిమాల్లో నటించారామె. ఇక సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ తొలి హీరోయిన్ శ్రీవిద్యే. ఆయన మొదటి సినిమా అపూర్వ రాగంగల్(1975) రజినీ జోడిగా. అయితే రజినీతో హీరోయిన్‌గానే కాదు.. అక్కగా, చెల్లిగా, తల్లిగా, అత్తగా.. ఇలా దాదాపు అన్ని క్యారెక్టర్లలో ఆమె నటించడం విశేషం. తల్లి క్యారెక్టర్లో శ్రీవిద్య అద్భుతమైన నటన కనబరిచేవారామె. ముగ్గురు మొనగాళ్లు, గాండీవం, చిన్నబ్బాయ్, వెంకటేష్‌కు తల్లిగా ‘బ్రహ్మపుత్రుడు’, ‘ధర్మచక్రం’ ఆమె మరిచిపోలేని నటనను అందించారు. సుమంత్ హీరోగా వచ్చిన ‘విజయ్ ఐపీఎస్’ తెలుగులో శ్రీవిద్య నటించిన చిట్టచివరి చిత్రం. -సాక్షి వెబ్‌డెస్క్ -
పరీక్షల్లో ఫెయిల్..నలుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
-
నలుగురు విద్యార్థుల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ముగ్గురు, మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు వెరసి నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఇంటర్ ఫలితాలు వచ్చిన కొద్దిసేపటికే సిటీలో ఈ విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ♦ వనస్థలిపురం సుభద్రానగర్‌కు చెందిన ఎ.ఉదయ మాణిక్య వరప్రకాశ్ కుమార్తె వందన దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఫలితాల్లో 440కి 325 మార్కులే వచ్చాయని మనస్తాపానికి గురైన వందన బెడ్రూమ్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ♦ కూకట్పల్లి పరిధి ఖైత్లాపూర్‌లో ఉండే కాట్రాజ్ శేఖర్ కుమారుడు సాయికుమార్ (17) ఎంఎన్ఆర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. మొదటి సంవత్సరం ఫలితాల్లో ఇతడు ఫెయిలయ్యాడు. మనోవేదనకు గురైన సాయికుమార్‌ను తల్లిదండ్రులు ఓదార్చి మళ్లీ రాసి పాస్ కావచ్చని చెప్పి విధులకు వెళ్లారు. మధ్యాహ్నం సాయికుమార్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ♦ పిర్జాదిగూడ మల్లికార్జున్ నగర్లో నివసించే దూలం మధు కుమార్తె వర్ష (16) ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రాసి, అన్ని సబ్జెక్ట్లూ తప్పింది. దీంతో మనస్తాపం చెందిన వర్ష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ♦ గాజులరామారం ఉషోదయ కాలనీకి చెందిన మువ్వ రామకృష్ణ కుమార్తె శ్రీవిద్య (18) చింతల్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. ఫలితాల్లో ఆమె నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిలైన విషయం తెలిసి, వారు నివాసముండే అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకేసింది. అక్కడికక్కడే మృతి చెందింది. -
వేలానికి నటి ఇల్లు..
సాక్షి, చెన్నై : దివంగత నటి శ్రీవిద్య ఇంటిని ఆదాయ పన్ను శాఖ వేలం వేయనుంది. సీనియర్ నటి శ్రీవిద్య. గత 1966 నుంచి 2000 సంవత్సరం వరకూ ప్రముఖ నటిగా రాణించిన శ్రీవిద్య తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో పలు భాషల్లో నటించారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో కథానాయకిగానూ కొన్ని చిత్రాల్లో నటించిన శ్రీవిద్య కేన్సర్ వ్యాధితో 2006లో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో మరణించారు. అయితే ఆమెను చివరి దశలో మలయాళ నటుడు, ఆ రాష్ట్ర శాసన సభ్యుడు గణేశ్‌కుమార్ బాగోగులు చూసుకున్నారు. శ్రీవిద్యకు చెన్నై, అభిరామపురంలోని సుబ్రమణియంపురం వీధిలో రెండు అంతస్తుల ఫ్లాట్ ఉంది. అందులో ప్రస్తుతం డాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నారు. అయితే ఆ ఇంటికి చాలా కాలంగా పన్ను చెల్లించకపోవడంతో డాన్స్ స్కూల్ ద్వారా వస్తున్న అద్దెను ఆదాయ పన్ను శాఖ జమ చేసుకుంటోంది. ఇంటి పన్ను, వడ్డీ, వేలం ఖర్చుల కోసం ఆ ఇంటినిప్పుడు వేలం వేయడానికి ఆ శాఖ సిద్ధమైంది. 1,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆ ఫ్లాట్‌ను ఆదాయ పన్ను శాఖ రూ.1,17,20,000గా ధర నిర్ణయించింది. ఈ నెల 27వ తేదీన ఇంటిని వేలం వేయనున్నట్టు ప్రకటించింది. -
భర్తను చంపిన శ్రీవిద్య అరెస్టు
-
శ్రీవిద్య అరెస్టు.. నవ్వు ముఖంతో పోలీసుల మధ్య..
సాక్షి, గుంటూరు : ప్రేమగా మద్యం పోసి అందులో ప్రియుడి సాయంతో సైనెడ్ కలిపి భర్తను చంపిన శ్రీవిద్య అరెస్టయింది. భర్తను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పరారీ అయిన ఆమెను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీవిద్య అనే మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాదెండ్ల మండలం పునుగుపాడు గ్రామానికి చెందిన నల్లబోతు నరేంద్ర(27), శ్రీవిద్య అనే ఇద్దరు భార్యభర్తలు. శ్రీవిద్య గత కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించి తన ప్రియుడితో కలిసి కుట్ర చేసింది. ఎవరికి అనుమానం రాకుండా మద్యంలో సైనెడ్ కలిపి తాగించింది. అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రించింది. అందుకుగాను చనిపోయిన భర్త మృతదేహాన్ని తీసుకెళ్లి పునుగుపాడువద్ద ఉన్న కాలువలో పడేసింది. ఈ సంఘటన గత నెల డిసెంబర్ (2017) 19న చోటుచేసుకుంది. అయితే, తల్లిదండ్రుల అనుమానం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీవిద్య అతడి ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు గుర్తించారు. శుక్రవారం గొట్టిపాటి వీరయ్య చౌదరి, గుంజి బాలరాజు, పూజల చౌడయ్య అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టగా శ్రీవిద్య మాత్రం పరారీలో ఉంది. అయితే, ఎట్టకేలకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ సమయంలో తన భర్తను హత్య చేసినందుకు ఆమె మొఖంలో ఎలాంటి పశ్చాత్తాప ఛాయలు కనిపించలేదు. పైగా నవ్వుతూ మీడియా ఎదుటకు వచ్చి అందరినీ షాకయ్యేలా చేసింది. కాగా, ప్రియులతో సంబంధాలు పెట్టుకొని తమ భర్తలను స్వాతి, జ్యోతి అనే గృహిణులు హత్య చేసిన సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసింది. -
మద్యంలో సైనెడ్ కలిపి భార్య ఘాతుకం
-
ప్రేమగా మందిచ్చి భార్య ఘాతుకం
సాక్షి, గుంటూరు : వివాహేతర సంబంధాలు పెట్టుకొని ప్రియులతో కలిసి భర్తలను హతమారుస్తున్న సంఘటనలు నానాటికి పెరుగుతున్నాయి. మొన్న స్వాతి, నిన్న జ్యోతి సంఘటనలు సంచలనంగా మారగా తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన శ్రీవిద్య అనే మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాదెండ్ల మండలం పునుగుపాడు గ్రామానికి చెందిన నల్లబోతు నరేంద్ర(27), శ్రీవిద్య అనే ఇద్దరు భార్యభర్తలు. శ్రీవిద్య గత కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించి తన ప్రియుడితో కలిసి కుట్ర చేసింది. ఎవరికి అనుమానం రాకుండా మద్యంలో సైనెడ్ కలిపి తాగించింది. అనుమానం రాకుండా ఆత్మహత్య చిత్రించింది. అందుకుగాను అతడి డెడ్‌బాడీని తీసుకెళ్లి పునుగుపాడువద్ద ఉన్న కాలువలో పడేసింది. ఈ సంఘటన గత నెల డిసెంబర్ (2017) 19న చోటుచేసుకుంది. అయితే, తల్లిదండ్రుల అనుమానం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీవిద్య అతడి ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం గొట్టిపాటి వీరయ్య చౌదరి, గుంజి బాలరాజు, పూజల చౌడయ్య అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టగా శ్రీవిద్య మాత్రం పరారీలో ఉంది. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం
ఇంటికి వచ్చిన స్నేహితునితో కలిసి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండాపోయాడు. ఈ సంఘటన మంగళవారం అంబర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవి కథనం ప్రకారం.. బాగ్ అంబర్‌పేట సాయిబాబా నగర్లో నివసించే కె. రమేష్‌నాయుడు(23) అతని భార్య శ్రీవిద్యతో ఉంటున్నాడు. ఇతను ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. కాగా ఈ నెల 24 వీరి ఇంటికి రమేష్ స్నేహితుడైన లక్ష్మణ్ వచ్చాడు. కాసేపు మాట్లాడుకొని ఇద్దరూ ఇంట్లో నుంచి పని ఉందంటూ బయటకు వెళ్లారు. అప్పటి నుంచి రమేష్‌నాయుడు తిరిగి రాకపోవడంతో అతని కోసం అన్నిచోట్లా వెదికారు. ప్రయోజనం లేకపోవటంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కట్టంగూరులో యువతి దారుణహత్య
కట్టంగూర్ : నువ్వే నా ప్రాణం అంటూ నమ్మబలికాడు.. నువ్వు లేకుంటే జీవించలేనని ప్రేమ ఊబిలోకి దించాడు..మూడేళ్లుగా చిలకా గోరింకలా తిరిగారు..పెళ్లి చేసుకోమని కోరగానే కాదు పొమ్మన్నాడు.. ఒత్తిడిచేస్తే చివరకు ప్రియురాలి ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాడు. ఇదీ కట్టంగూరు మండల కేంద్రంలో గురువారం దారుణహత్యకు గురైన యువతి విషాదగాథ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన కందాల యాదగిరిరెడ్డి మూడో కూతురు శ్రీవిద్య (19) సూర్యాపేటలో పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. కట్టంగూర్కు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు డ్రైవర్ యాదగిరి రెగ్యులర్‌గా నల్లగొండ నుంచి సూర్యాపేటకు వెళుతుంటాడు . అయితే అదే బస్సులో రోజూ ప్రయాణించే శ్రీవిద్యతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇద్దరూ మూడేళ్లగా ప్రేమించుకుంటున్నారు. కాగా,ఇటీవల ఫైనల్ ఇయర్ పూర్తికావడంతో శ్రీ విద్య నల్లగొండలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ప్రాజెక్ట్‌వర్క్ చేస్తోంది. తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్న శ్రీ విద్యను యాదగిరి గురువారం ఇందిరమ్మ కాలనీలోని తన తండ్రి ఎనమల చంద్రయ్య ఇంటికి తీసుకువచ్చి గొడ్డలితో నరికాడు. మెడ, ఛాతిపై నరకడంతో శ్రీ విద్య అక్కడికక్కడే కుప్పకులి మృతిచెందింది. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.నల్లగొండ డీఎస్పీ రాంమోహన్‌రావు, నకిరేకర్ రూరల్ సీఐ రాఘవరావు, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి ఎస్ఐలు పర్వతాలు, ప్రసాదరావు, శ్రీనివాస్‌తో పాటు క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
ఎయిమ్స్ టాపర్‌గా విశాఖ విద్యార్థిని శ్రీవిద్య
* కూకట్పల్లి వాసి వశిష్టకు రెండో ర్యాంకు సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏఐఐఎంఎస్-ఎయిమ్స్) ప్రవేశపరీక్ష-2014 ఫలితాల్లో విశాఖపట్నం విద్యార్థిని పి.శ్రీవిద్య జాతీయస్థాయి ఓపెన్ కేటగిరీలో మొదటి ర్యాంక్ సాధించింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన పోలిశెట్టి వశిష్టకు రెండో ర్యాంకు లభించింది. జాతీయ స్థాయిలో వైద్య విద్య కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. శ్రీచైతన్యనారాయణ మెడికల్ అకాడ మీ విద్యార్థిని అయిన శ్రీవిద్య ఇటీవల విడుదలైన ఎంసెట్ మెడిసిన్ ఫలితాల్లో 7వ ర్యాంక్ సాధించింది. వశిష్ట ఈ ఏడాది జరిగిన జిప్మర్, ఏఐపీఎండీలలో రెండో ర్యాంకు, మణిపాల్ మెడికల్ టెస్ట్‌లో 9వ ర్యాంకు, ఎంసెట్‌లో 67వ ర్యాంకు సాధించాడు. తాను ఎయిమ్స్‌లోనే ఎంబీబీఎస్ చేస్తానని వశిష్ట తెలిపాడు. బయాలజీ విభాగంలో జూలై 5న ఇండోనేసియాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఒలింపియాడ్‌కు భారత్ తరఫున వశిష్ట ప్రాతినిధ్యం వహించనున్నాడు. -
ఎంసెట్ మెరుపులు
ఇంజినీరింగ్‌లో 5వ ర్యాంకు సాధించిన విష్ణువర్థన్ మెడిసిన్‌లో శ్రీవిద్యకు 7వ ర్యాంక్ 500లోపు 29మందికి ఇంజినీరింగ్ ర్యాంకులు మెడిసిన్‌లో 28మందికి ఉత్తమ ర్యాంకులు విశాఖపట్నం : పోటీ పరీక్షల్లో నగర విద్యార్థులు దూసుకుపోతున్నారు. పరీక్షలేవైనా తమకు సాటి లేదని రుజువు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో తమ హవా కొనసాగించిన విద్యార్ధులు సోమవారం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో ముందంజలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి నగర కీర్తి ప్రతిష్టలు చాటి చెప్పారు. ఇంజినీరింగ్ విభాగంలో రాష్ట్ర 5వ ర్యాంకు, మెడిసిన్ విభాగంలో 7వ ర్యాంక్ నగరానికే వరించాయి. ఇంజినీరింగ్ విభాగంలో వందలోపు 4 ర్యాంకులు, 500 లోపు 29 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. మెడిసిన్ విభాగంలో వంద లోపు ఏడుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. 500 లోపు ర్యాంకులను 28 మంది విద్యార్ధులు సాధించారు. శ్రీైచె తన్య నారాయణ ఐఐటీ అకాడమీ విద్యార్థి వి.విష్ణువర్థన్ ఇంజినీరింగ్ విభాగంలో రాష్ట్ర 5వ ర్యాంక్, మెడిసిన్ విభాగంలో నారాయణ శ్రీచైతన్య మెడికల్ అకాడమి విద్యార్థిని పి. శ్రీవిద్య రాష్ట్ర 7వ ర్యాంక్ సాధించింది. మే 22న నగరంలోని 36 కేంద్రాల్లో నిర్వహించిన ఎంసెట్ పరీక్షలకు ఇంజినీరింగ్ విభాగంలో 17,809 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. వీరిలో 16వేల మంది కి సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. 13 కేంద్రాల్లో నిర్వహించిన మెడిసిన్ విభాగంలో 5956 మంది పరీక్షలు రాశారు. వీరిలో 800 మంది మెడిసిన్ సీట్లు సాధించే అవకాశం ఉంది. అభిషేక్‌కు మెడిసిన్‌లో 15వ ర్యాంకు నర్సీపట్నం : నర్సీపట్నం విద్యార్థి మంత్రి వెంకటరత్న అభిషేక్ మెడిసిన్‌లో రాష్ట్రస్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. స్థానిక తురకబడి హైస్కూలులో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం.ఎస్.ప్రసాద్ కుమారుడైన అభిషేక్ ఇంటర్ విజయవాడ, చైతన్య గోశాలలో చదివాడు. తల్లి రాధాకుమారి మాకవరపాలెం పీహెచ్సీలో పార్మసిస్టుగా పనిచేస్తున్నారు. స్థానిక ఏబీఎం జూనియర్ కాలేజీలో చదివిన లోకవరపు సతీష్ మెడిసిన్‌లో 2989 ర్యాంకు సాధించాడు. నిద్ర హనూక్ అభిషేక్‌కు 151 ర్యాంకు నర్సీపట్నం : కొత్త బైపురెడ్డిపాలెంనకు చెందిన నిద్ర హనూక్ అభిషేక్ మెడిసిన్‌లో 151 ర్యాంకు సాధించాడు. అభిషేక్ తండ్రి సత్తిబాబు గొలుగొండ మండలం కొత్త యల్లవరం జడ్పీ స్కూలులో స్కూ లు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. జ్యోతిర్మయికి మెడిసిన్‌లో 136వ ర్యాంక్ మునగపాక : మునగపాక గ్రామానికి చెందిన విద్యార్థిని జ్యోతిర్మయి మెడిసిన్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 136వ ర్యాంక్ సాధించింది. గ్రామానికి చెందిన మళ్ల రామజోగి అప్పారావు, విజయ దంపతులు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. జ్యోతిర్మయి పదో తరగతి వరకు హైదరాబాద్‌లో చదువుకుంది. విజయవాడలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకుంది. ఐఐటీ ధ్యేయం కష్టపడి చదివినందుకు మంచి ఫలితం వచ్చిం ది. 5వ ర్యాంక్ సాధిం చడం వెనుక అధ్యాపకుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. ఐఐటీలో సీటు సాధించాలనే ధ్యేయంతో సాధన చేస్తున్నాను. - వి.ఆదిత్యవర్థన్, శ్రీచైతన్య నారాయణ అకాడమీ డాక్టరుగా సేవలందిస్తా.. డాక్టర్‌గా సేవలందిం చాలని కష్టపడి ఎంసెట్ మెడిసిన్‌కు సాధన చేశాను. రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సహం వల్లే ర్యాంక్ తెచ్చుకోగలిగాను. -పి.శ్రీవిద్య, నారాయణశ్రీచైతన్య అకాడమీ -
ఆత్మహత్యకు దారితీసిన ప్రేమ వ్యవహారం
హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : మూడు రోజుల క్రితం కా ల్వలో శవమై తేలిన కిట్స్ విద్యార్థి శ్రీవిద్య మృతి మి స్టరీ వీడింది. అదే కాల్వలో ఆమె ఇష్టపడిన తోటివి ద్యార్థి మృతదేహం ఆదివా రం లభ్యమైంది. ప్రేమ వ్యవహారమే ఇద్దరి ఆత్మహత్యకు కారణమై ఉంటుందని పోలీసు లు వెల్లడించారు. ప్రియుడితో ఏర్పడిన తగాదాల కారణంగా ఎస్సారెస్పీలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్పీ దక్షిణామూర్తి వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. హన్మకొండలోని సుబేదారి ప్రాంతానికి చెందిన గాదె శ్రీవి ద్య, మహ్మద్ అతిఖ్ అహ్మద్(20) ఎర్రగట్టు కిట్స్ కళాశాలలో బీటెక్(మెకానిక ల్) ఫస్టియర్ చదువుతున్నారు. ఇద్దరి సెక్షన్లు వేరయినప్పటికీ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని శ్రీవిద్య వారం రోజులుగా మహ్మద్అతిఖ్ అడుగుతోంది. అయితే అందుకు అతడు నిరాకరించాడు. ఈ క్రమంలోనే శుక్రవారం కళాశాలకు వచ్చిన ఇద్దరు మధ్యా హ్నం నుంచి కనిపించలేదు. అదేరోజు సాయంత్రం ఎస్పారెస్పీ కాల్వలో మృతదేహాన్ని చూసిన స్థానికులు 100కు ఫోన్ చేయగా పోలీసులు వెళ్లి శ్రీవిద్య మృతదేహాన్ని కనుగొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తుండగానే పలివేల్పుల సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో మహ్మద్ అతిఖ్‌అహ్మద్ మృతదేహం లభ్యమైందని డీఎస్పీ తెలిపారు. వీరిద్దరి విషయమై స్థానికంగా విచారణ చేపట్టగా వారు ప్రేమికులని తెలిసిందని ఆయన వెల్లడించారు. ఎస్సారెస్పీ కాల్వ వద్ద ఇద్దరి మధ్య ఏమైనా ఘర్షణ జరిగిందా? ఇద్దరు ఒకేసారి చావాలని నిర్ణయించుకున్నారా? ముందు శ్రీవిద్య కాల్వలో దూకడంతో భయపడి అతిఖ్ అహ్మద్ కూడా దూకాడా? ఇద్దరు పురుగుల మందు తాగి కాల్వలో దూకారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ దేవేందర్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లిఫ్ట్ అడిగి వెళ్లి.. భీమారంలో దిగి.. శ్రీవిద్య ఆ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు కాలేజీ ప్రధాన ద్వారం వద్ద అదే కళాశాలకు చెందిన విద్యార్థిని లిఫ్ట్ అడిగినట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. తర్వాత ఆమె భీమారం పెట్రోల్‌పంప్ వద్ద దిగినట్లు లిఫ్ట్ ఇచ్చిన విద్యార్థిని వి చారణలో వెల్లడించినట్లు సమాచారం. భీమారం పెట్రోల్‌పంప్ వద్ద దిగిన శ్రీ విద్య తన ఫోన్ నుంచి అతిఖ్ అహ్మద్‌కు మిస్డ్‌కాల్ ఇచ్చింది. క్లాస్‌లో ఉన్న అతి ఖ్ తన ఫోన్లో బ్యాలెన్స్ లేకపోవడంతో స్నేహితుడైన భరత్ తేజానాయక్ మొబైల్తీసుకుని ఆమెకు ఫోన్ చేస్తూ అలాగే వెళ్లిపోయాడు. అదేరోజు సా యంత్రం భరత్తేజా తండ్రి తన కుమారుడి ఫోన్‌ను అతిఖ్ తీసుకెళ్లినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ప్రిన్సిపాల్ అతిఖ్ తండ్రి ర ఫీక్‌కు ఫోన్ చేసి అతడి గురించిన వివరాలు అడిగినట్లు సమాచారం. పోలీసులకు కూడా అతిఖ్ మీద అనుమానం రావడంతో అతడి తండ్రికి, ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారమిచ్చారు. తన కుమారుడు కనిపించ డం లేదని తండ్రి ఫోన్లో పోలీసులకు చెప్పాడు. ఫిర్యాదు ఇవ్వాలని సూచించినా వారు రాలేదు. దీంతో శనివారం రాత్రి పోలీసులు అతిఖ్ఇంటికి వెళ్లి.. వారి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు. మూడేళ్ల క్రితమే పరిచయం.. శ్రీవిద్య, అతిఖ్ మధ్య మూడేళ్ల క్రితం నుంచి ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లు తెలిసింది. పదో తరగతి చదువుతున్న సమయంలోనే వీరిద్దరికి నగరంలోని నిర్వహించిన సైన్స్‌ఫేర్‌లో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఆ పరిచయమే ప్రేమగా మారింది. ఇంటర్లో కూడా ఇద్దరు ఒకే కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం ఇంజనీరింగ్ విద్య కోసం ఇద్దరు కిట్స్‌లో చేరారు. చివరికి వారి ప్రేమ ఆత్మహత్యకు దారితీసింది. -
శ్రీవిద్యది.. హత్యే
చంపి కాల్వలో పడేశారు యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఘటన మృతురాలి బంధువుల ఆరోపణ హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : హన్మకొండ భీమారం సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో శుక్రవారం మృతదేహమై తేలిన బీటెక్ విద్యార్థిని శ్రీవిద్యది ముమ్మాటికీ హత్యేనని కుటుంబ సభ్యు లు, బంధువులు ఆరోపించారు. ర్యాగింగ్ భూతమే ఆమెను పొట్టనపెట్టుకుందని వారు వాపోయూరు. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు శనివారం కేయూ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. కళాశాల యా జమాన్యాన్ని ఇక్కడికి పిలిపించాలని డిమాండ్ చేశారు. వారి ని ప్రశ్నిస్తేనే శ్రీవిద్య ఎలా మృతిచెందిందో తెలుస్తుందన్నా రు. ఆ సమయంలో ఎస్పీ కార్యాలయంలో ఉన్న సీఐ దేవేం దర్‌రెడ్డి హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఐ,ఆందోళనకారుల మధ్య మళ్లీ వాగ్వా దం జరిగింది. ఫిర్యాదు ఇస్తే విచారణ చేపడతామని సీఐ వారికి నచ్చజెప్పినా ఆందోళనకారులు శాంతించలేదు. శవం ఎందుకు తీశారు ? కాల్వలో ఉన్న మృతదేహాన్ని కుటుంబ సభ్యులు వచ్చేంత వరకు ఎందుకు ఉంచలేదని ఆందోళనకారులు పోలీసులను ప్రశ్నించారు. గుర్తుతెలియని మృతదేహంగా భావిం చి శవాన్ని ఎంజీఎంకు తరలిస్తున్న క్రమంలో మృతురాలి వివరాలు తెలిశాయని సీఐ వివరణ ఇచ్చిన వారు శాంతించలేదు. ఆత్మహత్య చేసుకుంటే 24 గంటల తర్వాత శవం నీటిలో తేలుతుందని.. కానీ కాల్వలో పడిన శ్రీవిద్య మృతదేహం నీటిలో మునగకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె బ్యాగ్, చెప్పులు ఏమయ్యాయన్నా రు. కళాశాలలో మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉన్న శ్రీవిద్య ఐదు గంటలకు కాల్వలో ఎలా పడుతుందని ప్రశ్నించారు. ర్యాగింగే బలిగొంది ర్యాగింగ్ విషయూన్ని ఇంట్లోగానీ, ప్రిన్సిపాల్కుగానీ చెప్పితే చంపేస్తామని సీనియర్లు బెదిరించినట్లు తనకు శ్రీవిద్య చెప్పిందని ఆమె తండ్రి గాదె పాణి తెలిపారు. ఫోన్లోనైనా ప్రిన్సిపాల్ దృష్టికి ర్యాగింగ్ విషయాన్ని తీసుకెళ్తానని కూతురితో చెప్పగా ఆమె వద్దని అభ్యంత రం చెప్పినట్లు గుర్తు చేశారు. ఇటీవల కల్చరల్ ఫెస్ట్‌లో కూడా కొందరు సహ విద్యార్థులు ర్యాంగింగ్ చేశారని, ఈ విషయాన్ని తన కూతురు తల్లి వద్ద ప్రస్తావించి కన్నీళ్లు పెట్టుకుందని పాణి వాపోయారు. తన కూతురి మరణానికి కారకులైన వారిని గుర్తించి శిక్షించాలని ఆయన సీఐకి ఫిర్యాదు చేశారు. శ్రీవిద్య మృతిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని సీఐ హామీ ఇచ్చారు.