లక్ష్మిదేవిపల్లిలో మహిళ దారుణ హత్య
వివాహేతర సంబంధమే కారణం : ఎస్పీ
సారంగాపూర్ : జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం లక్ష్మిదేవిపల్లి శివారు గ్రామం ధర్మనాయక్ తండాలో అజ్మీరా పూర్ణ (38) సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దారుణ హత్యకు గురైంది. జగిత్యాల ఎస్పీ అనంతశర్మ వివరాల ప్రకారం... అజ్మీరా పూర్ణ భర్త శంకర్‌నాయక్ పదేళ్లక్రితం మృతిచెందాడు. పూర్ణ తన తల్లి అమృతతో ఉంటోంది. జగిత్యాలలోని ఓ టైలరింగ్ దుకాణంలో బట్టలు కుట్టించడానికి తరచూ వెళ్తుండేది. యజమాని చింతకింది శంకర్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీనిపై శంకర్ భార్య తర చూ గొడవపడుతోంది. శంకర్‌లో మార్పు రాలేదు. గమనించిన కుమారుడు శైలేజ్ అలియాస్ కిరణ్ (21) జగిత్యాలలో తనతో కరాటే నేర్చుకుంటున్న మిత్రులు వంటిపులి అజయ్(19), మరో మిత్రుడు ప్రేం (19)ల తో కలిసి సోమవారం రాత్రి బైక్‌పై ధర్మనాయక్ తండా కు వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న పూర్ణ, ఆ మె తల్లి అమృతను లేపారు. అమృత ముఖాన్ని గుడ్డ తో కట్టి, పక్కనే ఉన్న రోకలిబండతో పూర్ణ తలపై మోదారు. బలంగా తగలడంతో రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతిచెందింది. వృద్ధురాలు అమృతను కొట్టడంతో చేరుు విరిగిపోరుుంది. కాగా శైలేష్ తండ్రి రెండురోజుల క్రితం దుబాయ్ వెళ్లాడు. మృతురాలి కూతురు సమత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. శైలేష్, మిగతా ఇద్దరు జగిత్యాలలో డిగ్రీ చదువుతున్నారు.
పోలీసుల అదుపులో నిందితులు
అమృత బిగ్గరగా అరవడంతో సమీపంలోని వా రి బంధువులు చేరుకొని సారంగాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రణధీర్‌కుమార్ చేరుకున్నారు. నిందితులు పరుగెడుతుండగా అజయ్ వ్యవసాయ బావిలో పడిపోయాడు. శైలేశ్, ప్రేంలు బైక్ తీసుకొని పరారయ్యారు. అజయ్‌ను బయటకు తీసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శైలేష్, అజయ్, ప్రేంలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కాగా నిందితుల్లో మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమచారం. ఎస్పీ వెంట డిఎస్పీ రాజేంద్రప్రసాద్, సీఐ శ్రీనివాస్ చౌదరి, ఎస్సైలు రణధీర్‌కుమార్, ఆరోగ్యం ఉన్నారు.