Allocation of seats
-
బిహార్ ఎన్నికల బరిలో వారసులు
242 మందితో ‘మహాకూటమి’ జాబితా విడుదల చేసిన నితీశ్‌కుమార్ * బరిలో లాలూ ఇద్దరు కుమారులు * వెనుకబడిన వర్గాల ఓట్లే లక్ష్యంగా సీట్ల కేటాయింపు పట్నా/న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరి రసకందాయకంగా మారనుంది. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీల ‘మహాకూటమి’ అభ్యర్థుల జాబితాను బిహార్ సీఎం, మహాకూటమి సీఎం అభ్యర్థి నితీశ్‌కుమార్ బుధవారం విడుదల చేశారు. ఇందులో ప్రధాన నేతల వారసులు పోటీలో ఉండనున్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వియాదవ్ మహువా స్థానం నుంచి, తేజ్‌ప్రతాప్ యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అక్టోబర్ 12వ తేదీ నుంచి నవంబర్ 5 వరకు ఐదు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి 242 మంది అభ్యర్థులతో మహాకూటమి జాబితాను నితీశ్‌కుమార్ విడుదల చేశారు. జేడీయూ, ఆర్జేడీ 101 సీట్ల చొప్పున, కాంగ్రెస్ 41 స్థానాల్లో బరిలో ఉండనున్నాయి. రిజర్వేషన్ల అంశంపై తీవ్ర దుమారం కొనసాగుతున్న నేపథ్యంలో... వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పించారు. వెనుకబడిన వర్గాలవారికి 55శాతం, ఎస్సీ/ఎస్టీలకు 15శాతం, ముస్లింలకు 14శాతం, ఓసీ అభ్యర్థులకు 16శాతం టికెట్లు ఇచ్చినట్లు నితీశ్ పేర్కొన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 10శాతం (25 మంది) మహిళలకు ఇచ్చినట్లు తెలిపారు. మొత్తంగా నితీశ్‌కుమార్‌కు మద్దతుదారులుగా ఉన్న కుర్మి, కుశ్వహ కులాలవారికి జేడీయూ తరఫున, లాలూకు గట్టి ఓటు బ్యాంకు అయిన యాదవ్‌లు, ముస్లింలకు ఆర్జేడీ తరఫున టికెట్లు కేటాయించారు. ఇక కాంగ్రెస్ తరఫున ఓసీలకు అవకాశమిచ్చారు. బీజేపీకి ఎక్కువగా పట్టున్న పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఇక ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న కిషన్‌గంజ్ జిల్లాలోని నాలుగు స్థానాల్లో ఎంఐఎం తరఫున అభ్యర్థులను బరిలోకి దించారు. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ... ప్రధాని మోదీ, అద్వానీ, ఎంఎం జోషీ, రాజ్‌నాథ్, జైట్లీ సహా 40 మందికి పైగా హేమాహేమీలను ప్రచార రంగంలోకి దించనుంది. ఇటీవలి కాలంలో అధిష్ఠానంతో విభేదిస్తూ వస్తున్న ఎంపీ శత్రుఘ్నసిన్హాను కూడా ఈ ప్రచారకర్తల జాబితాలో చోటు కల్పించటం విశేషం. మరోపక్క అసెంబ్లీ టికెట్టు నిరాకరించడంతో మంత్రి రామ్‌ధానీ సింగ్ బుధవారం పదవికి రాజీనామా చేశారు. జేడీ (యూ)కు గుడ్‌బై చెప్పారు. తన నియోజకవర్గమైన కార్గహర్ నుంచి సమాజ్‌వాది టికెట్టుపై బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ సుప్రీంకోర్టు లాంటిది * భాగవత్ చెప్పిందే బీజేపీకి ఫైనల్: నితీశ్‌కుమార్ పట్నా/ముంబై: దేశంలో రిజర్వేషన్ల విధానంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌పై విమర్శల పరంపర కొనసాగుతోంది. భాగవత్ వ్యవహారంలోబీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీకి ఆరెస్సెస్ సుప్రీంకోర్టు లాంటిదని వ్యాఖ్యానించిన నితీశ్.. ఆర్ఎస్ఎస్-బీజేపీ కలసి రిజర్వేషన్లను తొలగించాలని చూస్తున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లపై సమీక్ష కోసం మరో రాజ్యాంగ సంస్థను ఏర్పాటుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం చెప్పిందే తుది తీర్పు అని అదే మాదిరిగా.. బీజీపీ నేతలకు భాగవత్ చెప్పిందే తుది నిర్ణయమని అన్నారు. కాగా, నితీశ్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. నితీష్‌కుమార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్‌నుంచి ఆదేశాలు, అనుమతులు పొందుతారని, ఎందుకంటే ఆయనకు వారిద్దరూ సుప్రీంకోర్టు లాంటి వారని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ జమ్మూలో విమర్శించారు. మరోవైపు బీజేపీ మిత్ర పక్షం శివసేన భాగవత్ వ్యాఖ్యలను స్వాగతించింది. రాహుల్‌ను పంపించారు బిహార్ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనపై కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శల యుద్ధం జరుగుతోంది. ‘వీకెండ్ విత్ చార్లీరోస్’ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు రాహుల్ అమెరికాలోని ఆస్పెన్‌కు వెళ్లారు. బిహార్ ఎన్నికలకు దూరంగా ఉండాలని మిత్రపక్షాలే రాహుల్‌పై ఒత్తిడి తెచ్చినందువల్లే ఆయన అమెరికా పర్యటకు వెళ్తున్నారని బీజేపీ నేత సంబీత్ పాత్రా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుజ్రేవాలా మండిపడ్డారు. ప్రపంచ స్థాయిలో వివిధ అంశాలపై చర్చించే సదస్సుకు రాహుల్ వెళుతున్నారని...కానీ ‘రిజర్వేషన్ల’ వివాదం నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ పని గట్టుకునిఅవాస్తవాలనుప్రచారం చేస్తోందన్నారు. -
సీట్ల సర్దుబాటుపై ఎల్జేపీ అసంతృప్తి
అమిత్ షాతో చిరాగ్ భేటీ.. 43 మందితో బీజేపీ తొలిజాబితా న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఎన్డీయే మిత్రపక్షాల్లో అసంతృప్తి ప్రారంభమైంది. సీట్ల కేటాయింపుపై ఎన్డీయే మిత్రపక్షం లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. మొదట్లో హామీ ఇచ్చిన ప్రకారం తమకు సీట్లు కేటాయించకపోవడం నిరుత్సాహపరిచిందని పేర్కొంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న స్థానాల సంఖ్యపై ఎన్డీయే మిత్రపక్షాల్లో సోమవారం ఒక అవగాహన కుదిరిన విషయం తెలిసిందే. దాని ప్రకారం బీజేపీ 160, ఎల్జేపీ 40, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ పార్టీ హెచ్ఏఎం-ఎస్ 20, కేంద్రమంత్రి ఉపేంద్ర కుష్వాహకు చెంది న ఆర్ఎల్ఎస్పీ 23 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డ్ చైర్మన్ చిరాగ్ పాశ్వాన్ సోమవారం అర్ధరాత్రి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయి, తమ వాదనను ఆయనకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘మాకు గతంలో చెప్పిన సీట్ల కేటాయింపు ఫార్మూలాకు, నిన్నటి ప్రకటనకు తేడా ఉంది. అది మమ్మల్ని నిరుత్సాహపరిచింది. కోపమేం లేదు కానీ పార్టీలో అసంతృప్తి నెలకొంది. నిన్నటి ప్రకటనతో మేం షాక్‌కు గురయ్యాం’ అన్నారు. అయితే, ఎన్డీయేకు దూరం కాబోమని, బీజేపీతో తమ మైత్రి కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమిత్ షా తమ పార్టీ ఆందోళనను అర్థం చేసుకున్నారని, త్వరలో దీనికో పరిష్కారం లభించనుందని పేర్కొన్నారు. ఎల్జేపీకి కేటాయించిన స్థానాల సంఖ్యను పెంచేందుకు షా అంగీకరించారా? అన్న ప్రశ్నకు ఆయన బదులివ్వలేదు. మాంఝీకి కేటాయించిన సీట్లపై తమకు అసంతృప్తి లేదని, ఏ ఫార్మూలా ప్రకారమైతే ఆర్ఎల్ఎస్పీకి 23 సీట్లు కేటాయించారో, అదే ఫార్మూ లా ప్రకారం తమకూ కేటాయింపు జరగాలన్నది తమ డిమాండ్ అన్నారు. సీట్ల సర్దుబాటులో మాంఝీ, కుష్వాహాల పార్టీలు ఎక్కువ లాభపడ్డాయని ఎల్జేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీతో మొదట కుదిరిన అవగాహన గురించి ఎల్జేపీ సీనియర్ నేత ఒకరు వివరించారు. ఆ వివరాల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ ఎంపీ స్థానంలోని 6 అసెంబ్లీ స్థానాలను ఎల్జేపీ, ఆర్‌ఎల్‌ఎస్‌పీలకు కేటాయిస్తామని బీజేపీ ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదన ప్రకారం ఎల్జ్జేపీకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 42, ఆర్ఎల్ఎస్పీకి 18 స్థానాలు దక్కాల్సి ఉంది. అలాగే, మాంఝీ పార్టీ హెచ్ఏఎం-ఎస్‌కు 12 సీట్లు కేటాయించాలనుకున్నారు. ఆ 12లో.. 9 బీజేపీ, 2 ఎల్జేపీ, 1 ఆర్ఎస్ఎల్పీ త్యాగం చే యాలనుకున్నారు. అలా చేస్తే, ఎల్జేపీ 40, ఆర్ఎల్ఎస్పీ 17, హెచ్ఏఎం-ఎస్ 12 స్థానా ల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ వాస్తవ ప్రకటనలో ఆర్ఎల్ ఎస్పీ, హెచ్ఏఎంలకు ఎక్కువ రావడంతో పాశ్వాన్ అసంతృప్తి చెందారు. కాగా బీజేపీ 43మందితో మంగళవారం రాత్రి తొలి జాబితా విడుదల చేసింది. మరిన్ని సీట్లిస్తే పొత్తుకు రెడీ: పవార్ సీట్ల కేటాయింపులో మెరుగైన ప్రాతినిధ్యం కల్పిస్తే బిహార్ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహా లౌకిక కూటమితో పొత్తుకు సిద్ధమేననిమంగళవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్‌కి 40 స్థానాలు కేటాయించినప్పుడు, ఒక ఎంపీ ఉన్న తమకు కూడా అదే రీతిన సీట్లివ్వాలన్నారు. జేడీయూ, ఆర్జేడీలు చెరో 100 స్థానాల్లో, కాంగ్రెస్ 40 స్థానాల్లో పోటీ చేస్తూ.. ఎన్సీపీకి 3 సీట్లు కేటాయించిన విషయం, దాంతో కూటమి నుంచి ఎన్సీపీ వైదొలగిన విషయం తెలిసిందే. -
భారీగా పెరిగిన కటాఫ్
ఇంజనీరింగ్, ఫార్మసీ తొలిదశ సీట్ల కేటాయింపు పూర్తి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాల్లో ఈసారి కటాఫ్ బాగా పెరిగింది. ఉత్తమ ర్యాంకులు వచ్చిన విద్యార్థులకే మంచి కాలేజీల్లో సీట్లు లభించాయి. టాప్ కాలేజీల్లోని అన్ని బ్రాంచీల్లో కలిపి పరిశీలిస్తే... గతేడాదికంటే ఈ ఏడాది సీట్లు పొందిన విద్యార్థుల సగటు ర్యాంకు సగానికిపైగా పెరిగింది. ఉదాహరణకు సీబీఐటీ వంటి కాలేజీలోని అన్ని బ్రాంచీల్లో గతేడాది 6వేల ర్యాంకు వరకు ఓసీ అభ్యర్థులకు సీట్లు వస్తే... ఈసారి 3వేల ర్యాంకులోపే సీట్లన్నీ నిండిపోయాయి. ఈసారి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు తగ్గిపోవడం, కోర్టు ఆదేశాల వల్ల వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టిన కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడంతో కటాఫ్ భారీగా పెరిగిపోయింది. సీఎస్ఈ, ఈసీఈ వంటి బాగా డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల సంఖ్య తగ్గిపోవడం కూడా దీనికి కారణమైంది. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం విద్యార్థులకు సీట్లు కేటాయించారు. విద్యార్థులు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్లి తమ ర్యాంకు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. గత నెల 18 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టగా.. ఈనెల 17నుంచి 24వ రకు వెబ్ ఆప్షన్లు నిర్వహించారు. 34 కాలేజీలు మూతే! ఈసారి 5 కాలేజీల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. మరో 29 కాలేజీల్లో 9 మందిలోపే విద్యార్థులు చేరారు. ఈ 34 కాలేజీలు ఈసారి మూతపడే అవకాశముంది. ఇక 50 మందిలోపు విద్యార్థులు చేరిన కాలేజీల సంఖ్య కూడా మరో 60 నుంచి 70 వరకు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ లెక్కన ఈసారి వంద కాలే జీల్లో పెద్దగా విద్యార్థులు చేరలేదన్నది అర్థం అవుతోంది. ఇక 100 శాతం ప్రవేశాలు జరిగిన కాలేజీలు 79 ఉన్నాయి. 9 వేల మందికి లభించని సీట్లు.. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 86,313 సీట్లు ఉండగా.. 53,347 సీట్లు (61.81 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. 32,966 సీట్లు మిగిలిపోయాయి. అయితే ఆప్షన్లు ఇచ్చుకున్న వారిలో 9,321 మంది విద్యార్థులకు సీట్లు రాలేదు. వారి ర్యాంకును బట్టి కాలేజీని ఎంచుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఫార్మసీకి దెబ్బ: రాష్ట్రంలో 133 ఫార్మసీ కాలేజీల్లో 3,778 ఎంపీసీ స్ట్రీమ్ సీట్లు ఉండగా.. అందులో 125 సీట్లే భర్తీ అయ్యాయి. కాలేజీల సంఖ్య మేర కూడా విద్యార్థులు చేరలేదు. ఇదీ చివరి దశ ప్రవేశాల షెడ్యూల్ * 29న మొదటి దశలో పాల్గొనని వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ * 29 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు, ఆప్షన్లలో మార్పులు * 31న సీట్ల కేటాయింపు * ఆగస్టు 1న కాలేజీల్లో చేరేందుకు అవకాశం, అదే రోజునుంచి తరగతులు -
రిపోర్ట్ చేయకుంటే సీటు రద్దు
ఒక్కో ఐఐటీలో ఒక్కో రోజు తరగతుల ప్రారంభం వెబ్సైట్లో రిపోర్టింగ్ తేదీలు హైదరాబాద్: ఐఐటీలో సీట్ల కేటాయింపు, విద్యార్థులు ఆమోదం తెలిపే ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. దీంతో ఐఐటీ వారీగా విద్యార్థులు రిపోర్టు చేయాల్సిన తేదీలు, రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన తేదీల వివరాలను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ(జేఓఎస్ఏఏ) ప్రకటించింది. అలాగే విద్యార్థులకు ఓరియెంటేషన్తోపాటు తరగతులు ప్రారంభించే తేదీల వివరాలను ఐఐటీల వారీగా వెల్లడించింది. అయితే ఒక్కో ఐఐటీకి ఒక్కో విధంగా ఫీజులు ఉన్నాయి. దీంతో ఐఐటీ వారీగా ఫీజుల వివరాలను జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. తనకు సీటు వచ్చిన ఐఐటీలో చేరేందుకు విద్యార్థి అంగీకారం తెలియజేసినా రిపోర్టింగ్ సమయానికి కాలేజీకి వెళ్లకపోతే ఆ సీటు రద్దవుతుందని పేర్కొంది. నిర్ణీత సమయంలో కాలేజీలో చేరాలని స్పష్టం చేసింది. ఒక్కో ఐఐటీలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించే ఓరియెంటేషన్ తరగతులకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాలని తెలిపింది. -
అంతే సంగతులు!
* పార్టీ పరిస్థితిపై ‘మేడమ్’కు కాంగ్రెస్ సీనియర్ నాయకుల లేఖ * వలస పక్షులకు ప్రాధాన్యత ఇవ్వడమే ప్రధాన కారణం * ఏఐసీసీ బృందాన్ని వెంటనే రాష్ట్రానికి పంపండి సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తిరోగమన దిశలో పయనిస్తోందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. పదవుల కేటాయింపుల్లో మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన వారికి కాక ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఈ లేఖలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి కాలేదు. ఈ విషయంలో సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరమేశ్వర్ మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలే కారణమని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. వీరిరువురూ వేర్వేరుగా జాబితాలను తయారు చేసి తమ జాబితాకే హైకమాండ్ నుంచి ఆమోద ముద్ర వేయించుకునేందుకు పట్టుదలతో ఉన్నారు. దీంతో దాదాపు ఏడాదిగా నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదా పడుతూ వస్తోంది. ఇతర పార్టీల నుంచి కొద్ది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధరామయ్య ప్రయత్నిస్తుండటం వల్ల పార్టీనే నమ్ముకున్న వారిలో అసంతృప్తి పెరిగిపోతోంది. ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్యతోపాటు ఎమ్మెల్సీ ఉగ్రప్ప, మంత్రి మహదేవ ప్రసాద్, హోంశాఖ మంత్రి కే.జే జార్జ్‌కు సలహాదారుగా ఉన్న మాజీ ఐపీఎస్, సీఎం సిద్ధు ఆప్తుడు కెంపయ్య పార్టీ, ప్రభుత్వంలో అన్నీ తామై వ్యవహరిస్తుండటమే కాకుండా తాజాగా నామినేటెడ్ పోస్టుల జాబితా తయారీలో వీరు సూచించిన వారికే ప్రాధాన్యత కల్పించారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సీనియర్ నాయకులు ‘మేడమ్’కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈనెల చివర్లో జరగనున్న మంత్రి వర్గ విస్తరణ, పునర్వవస్థీకరణ విషయంలో కూడా సిద్ధరామయ్య వలస పక్షులకే ప్రాధాన్యత ఇవ్వడానికి పావులు కదుపుతున్నట్లు సీనియర్ నాయకులు తెలిపారు. ఈ విషయమై వెంటనే ఏఐసీసీ నుంచి పరిశీలకులను కర్ణాటకకు పంపి పరిస్థితులను చక్కదిద్దక పోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమని వారు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆ పార్టీ పట్ల వ్యతిరేక ధోరణితో హైకమాండ్‌కు లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.