Amaravati
-
ఇంత మోసమా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు : అమరావతి రైల్వే ప్రాజెక్టు( Amaravati railway line) భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని రాజధాని గ్రామాల ప్రజలు తీవ్ర అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించ రైల్వే లైన్‌కు భూమి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. భూ సేకరణ కాకుండా సమీకరణ చేయాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. బలవంతంగా భూసేకరణకు సిద్ధమైతే కోర్టును ఆశ్రయించక తప్పదని స్పష్టం చేస్తున్నారు.అమరావతి రైల్వే లైన్ కోసం గుంటూరు జిల్లాలో 1,753 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.అమరావతి మండలం కర్లపూడి గ్రామంలోనే 232 ఎకరాలు సేకరించనున్నారు. ఇదే గ్రామంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం 153 ఎకరాలు, ఈ7, ఈ8, ఈ9 రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్డు కోసం 900 ఎకరాలు కోల్పోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రైల్వే లైన్‌కు భూమి ఇవ్వాలని, దీనికి కేంద్రం ఇచ్చే ప్యాకేజి సరిపోదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం కోసం ఎక్కడో ఉన్న గన్నవరంలో భూములిచ్చిన వారికి రాజ«దానిలో 1,450 గజాలు ల్యాండ్‌పూలింగ్ ప్యాకేజి కింద ఇచ్చారని, తమకు మాత్రం ఇవ్వకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.పెగ్ మార్కింగ్ ఎలా చేస్తారు?ప్రభుత్వం రైతులతో సమావేశాలు పెట్టినా, వారి అభ్యంతరాలు స్వీకరించకుండానే రైల్వే లైన్ భూసేకరణకు పెగ్మార్కింగ్కు సిద్ధపడుతోంది. ఇలా ఇష్టానుసారం పెగ్ మార్కింగ్‌కు షెడ్యూల్ ప్రకటించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అమరావతి తహసీల్దార్‌తో జరిగిన సమావేశంలో కర్లపూడి రైతులు ఇదే విషయాన్ని చెప్పారు. పోలీసు బందోబస్తుతో పెగ్మార్కింగ్కు రావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారని, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.రాజధాని పరిసర ప్రాంతాల్లోని కంతేరు, కొప్పురావూరు, తాడికొండ, మోతడక గ్రామాల రైతులు రైల్వే లైన్ భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామసభల్లో తీర్మానాలు కూడా చేశారు. రైల్వేలైన్ వల్ల పక్కన ఉన్న భూముల ధరలు కూడా పడిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల పక్కనే 500 మీటర్ల వరకూ భూమిని సేకరించి, రైల్వే లైన్‌కు రెండువైపులా సర్వీస్‌రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇంత అన్యాయమా?ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా భూముల ప్రభుత్వ విలువ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని, పరిసర ప్రాంతాల్లో మాత్రం పెంచలేదు. ఇదేమి అన్యాయమని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల రైల్వే లైన్ భూ సేకరణలో తాము తీవ్రంగా నష్టపోతామని చెబుతునానరు. తమ గ్రామంలో భూమి ప్రభుత్వ విలువ రూ. 16 లక్షలు ఉంటే దాన్ని కేవలం రూ. 4 లక్షలు పెంచి రూ. 20 లక్షలు చేశారని, మిగిలిన చోట్ల అసలు పెంచలేదని కర్లపూడి రైతులు చెబుతున్నారు.బహిరంగ మార్కెట్లో తమ భూముల ఎకరా దాదాపు రూ. 4 కోట్లు ఉండగా, ఇప్పుడు రైల్వే నుంచి రూ. 50 లక్షలు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రైల్వే ప్యాకేజికి అదనంగా ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చే ప్యాకేజిలో 33 శాతం అంటే 410 గజాల స్థలం ఇప్పిస్తామని మంత్రి నారాయణ ఇటీవల రైతులకు సర్దిచెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 650 గజాల వరకు ఇప్పించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. అయితే దీనికి కూడా రైతులు అంగీకరించడంలేదు. పూర్తిగా పూలింగ్ ప్యాకేజి ఇవ్వాలని కోరుతున్నారు.రాజధాని రైతులకు ఇచ్చినట్లుగా ఫారం.9.14 ఇవ్వాలని, అందులో ఎంత భూమి ఇస్తారు, ఇళ్ల స్థలం ఎంత, వాణిజ్య స్థలం ఎంత? కౌలు ఎన్ని సంవత్సరాలు ఇస్తారన్న విషయాలను స్పష్టం చేయకుండా భూములు ఇచ్చేది లేదని వారు చెబుతున్నారు. అసలు రైల్వే లైన్ అలైన్మెంటే తప్పు అని రైతులు అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ చేసిన గ్రామాల నుంచి కాకుండా బయట నుంచి రైల్వే లైన్ వెళ్లడం వల్ల 4 కిలోమీటర్ల దూరం పెరుగుతుందని వాదిస్తున్నారు. గతంలో ఇచ్చిన మాస్టర్ ప్లాన్‌ను కదపకుండా బయట నుంచి అలైన్మెంట్ ఇచ్చామని మంత్రి నారాయణ చెబుతున్నారు. -
దొంగేడుపు బాబు.. బికారి మాటలు
-
అమరావతికి ఏపీఈఆర్సీ
-
మన నగరాల్లో కాలుష్యం తక్కువే
సాక్షి ప్రతినిధి, అనంతపురం : దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం తక్కువగా ఉన్న 50 నగరాలను ఎంపిక చేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఐదు ఉన్నాయి. అవి కడప–52 ఎంజీ (మిల్లీగ్రాములు/క్యూబిక్ మీటర్), అమరావతి 56 ఎంజీ, తిరుపతి 57 ఎంజీ, విజయవాడ 61 ఎంజీ, రాజమహేంద్రవరం 61 ఎంజీలుగా ఉన్నాయి. 2024 సంవత్సరానికి గాను సీఆర్ఈఏ (సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్) సంస్థ అధ్యయనంలో ఈ విషయం తేలింది. అలాగే, దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా కర్ణాటకలోని కొడగు జిల్లాలోని మడికేరి నగరం చోటు సంపాదించింది. ఇక్కడ వార్షిక సగటు కాలుష్యం కేవలం 32 ఎంజీ మాత్రమే. తమిళనాడులోని పాలలైపెరూర్, కర్ణాటకలోని కొప్పల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అత్యంత క్లీనెస్ట్ జాబితాలో ఇంఫాల్, షిల్లాంగ్, అరియాలూర్, రామనగర, విజయపుర, రామనాథపురం ఉన్నాయి. ఇక అత్యంత కలుషిత నగరాల జాబితాలో రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ వార్షిక సగటు 236 ఎంజీగా నమోదైంది. 226 ఎంజీతో నోయిడా, 211తో ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే, దేశవ్యాప్తంగా 50 అత్యంత కలుషిత నగరాల్లో 15 నగరాలు రాజస్థాన్‌వే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది, బిహార్‌లో ఏడు ఉన్నాయి. ఇందులో ఏపీలోని ఏ నగరం కూడా లేనప్పటికీ విశాఖలో మాత్రం 108 ఎంజీగా నమోదైంది. గత ఏడాది గాలి నాణ్యతా ప్రమాణాల లెక్క వేసినప్పుడు విశాఖపట్నంలో 30 రోజుల వ్యవధిలో ఇలా ఆరుసార్లు కనిపించింది. గత ఏడాది సెప్టెంబరులో విజయవాడలో కూడా ఎక్కువగానే నమోదైంది. కానీ, ఆ తర్వాత గాలి నాణ్యత ప్రమాణాల్లో కాస్త మెరుగుపడింది.నిధుల వినియోగంలో ఏపీ వెరీపూర్..ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా కాలుష్య కారకాలను నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్సీఏపీ (నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం) కింద నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులను వినియోగించుకోవడంలో ఏపీ చాలా వెనుకబడినట్లు సీఆర్ఈఏ అధ్యయనంలో వెల్లడైంది. కేటాయించిన నిధుల్లో 35 శాతం మాత్రమే వినియోగించారు. అదే మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు 90 శాతం నిధులను వినియోగించాయి. -
Amaravati: సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ.. అది దా మ్యాటరు!
అమరావతికి కొత్త కళ! ఇక అమరావతి రయ్, రయ్..!! ఇవి ఎల్లో మీడియాలో తరచూ వచ్చే శీర్షికలు కొన్ని. అమరావతిలో అది జరగబోతోంది..ఇది జరగబోతోంది అంటూ రియల్ ఎస్టేట్ హైప్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ జాకీ మీడియా ఊదరగొట్టేస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడితే ఎవరూ కాదనరు. కాని అది ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి చేస్తేనే అభ్యంతరం అవుతుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కల్లబొల్లి కబుర్లు చెప్పిన పెద్దలు.. దీనికోసం వేల కోట్ల అప్పులు తెస్తున్న వైనం ఆయా వర్గాలను కలవరపరుస్తోంది. అమరావతి కోసం ప్రస్తుతానికి రూ. 50వేల కోట్ల అప్పు చేయాలని తలపెట్టి.. రూ. 31 వేల కోట్ల అప్పును సమీకరించడం.. అందులో రూ.11,467 కోట్ల పనులను చేపట్టే యత్నం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక సంక్షోభంలో ఉందని చెబుతున్నారు. 'తనకు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని ఉన్నా, ఖజానా చూస్తే భయం వేస్తోందని’ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తారు. ప్రజలు ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని.. సూపర్ సిక్స్ అమలులో ఉన్న కష్టాలను గమనించాలని ఆయన పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో చెబుతూ వస్తున్నారు. కాని అప్పుచేసి అమరావతి మాత్రం నిర్మిస్తామని అంటున్నారు. తద్వరా కొన్నేళ్ల తర్వాత వచ్చే ఆదాయంతో ప్రజలకు స్కీములు అమలు చేస్తారట..! ఇది చెబితే నమ్మడానికి జనం మరీ అంత వెర్రివాళ్లా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్లేవని, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని అంటున్నారు. అదే టైంలో ఏకంగా విద్యుత్ చార్జీలు.. పదిహేనువేల కోట్ల రూపాయల మేర పెంచుకున్నారు. గ్రామీన రోడ్లకు కూడా టోల్ గేట్లు పెడతామని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువలు పెంచారు. ఆర్దికంగా ఇంత క్లిష్ట పరిస్థితి ఉంటే.. కేవలం అమరావతిలో అంత భారీ ఎత్తున వ్యయం చేయడం ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి.. ఏకంగా కొత్త నగరం నిర్మిస్తామంటూ 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించారు. అదికాకుండా ప్రభుత్వ అటవీ భూమి మరో ఇరవై వేల ఎకరాలు ఉంది. దీనిని అభివృద్ది చేయడానికి, కేవలం మౌలిక వసతులు కల్పించడానికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబే గతంలో చెప్పేవారు. తొలి దశకుగాను లక్షాతొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు కావాలని గత టరమ్ లోనే చంద్రబాబు కోరారు. ఈ విడత అధికారంలోకి వచ్చాక అమరావతిలో సుమారు 48 వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. ఇక్కడ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్,రిజర్వాయర్ల తదితర నిర్మాణాల కోసమే వేల కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. ఇక భవనాల సంగతి సరేసరి. రకరకాల గ్రాఫిక్స్‌లో భవనాలను, డిజైన్ లను గతంలో ప్రచారం చేశారు. ఆ రకంగా వాటిని నిర్మించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో తెలియదు!. ఈ ఖర్చుల నిమిత్తం కేంద్రం ద్వారా ప్రపంచ బ్యాంకు నుంచి 15వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. ఇది కాకుండా ఇతర మార్గాల ద్వారా మరో పదహారువేల కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విపక్షనేతగా ఉన్న సమయంలో పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి.. రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి అవసరం లేదని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడానికి సిద్దం అవుతున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే ఎన్నివేల కోట్లు అయినా ఖర్చు చేయవచ్చు. ఈ స్థాయిలో డబ్బును కేవలం 29 గ్రామాలలోనే వ్యయం చేయడం ద్వారా కొన్నివేల మందికి మాత్రం ప్రయోజనం కలగవచ్చు. తనవర్గంవారికి, రియల్ఎస్టేట్ వ్యాపారులు కొందరికి లాభం రావొచ్చు. మరి ఏపీలో ఉన్న మిగిలిన కోట్ల మంది ప్రజల సంగతేమిటి?.అమరావతి ప్రాంత గ్రామాల రైతులకు ఇప్పటికే ప్రతి ఏటా కౌలు చెల్లిస్తున్నారు. వారికి పూలింగ్‌లో భాగంగా ప్యాకేజీ కూడా ఇచ్చారు. నిజానికి ఈ రకంగా ప్రభుత్వ డబ్బు భారీగా వినియోగించవలసిన అవసరం లేదని, రాజధానికి నాగార్జున యూనివర్శిటీ సమీపంలో అందుబాటులో ఉన్న సుమారు రెండు వేల ఎకరాలను వాడుకుంటే సరిపోతుందని చాలామంది సూచించారు. అయినా చంద్రబాబు మొండిగా ముందుకు వెళ్లారు. అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుందని టీడీపీ వర్గాలు భావించాయి. తొలుత కొంత హైప్ వచ్చినా, ఆ తర్వాత కాలంలో అది అంతగా కనిపించడం లేదని అంటున్నారు. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టి భూములు కొన్నవారికి ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. పైగా రియల్ ఎస్టేట్ మందగించిందన్న భావన ఏర్పడింది. హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కొంత తగ్గడం కూడా ప్రభావం చూపుతోంది. పైగా ఈసారి చంద్రబాబు ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి భూములు కొంటే ఉపయోగం ఉంటుందో, ఉండదో అనే సంశయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. అయితే.. ఇది సాధారణ పద్దతిలో అయితే అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కట్టే పన్నులను ఇక్కడ ఖర్చు చేయడంపై ఇతర ప్రాంతాలలో సంశయాలు వస్తాయి. అప్పులు తెచ్చినా , ఆ రుణభారం రాష్ట్ర ప్రజలందరిపై పడుతుంది. ఒక్కచోటే కేంద్రీకృత అభివృద్ది జరిగితే ప్రాంతీయ అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉంది. దానికి తోడు ఇతరప్రాంతాలలో ఉన్న కార్యాలయాలను తరలిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే టైంలో సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడడం లేదు.టీడీపీ, జనసేనలు ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్ గురించి ప్రముఖంగా ప్రకటించారు. ఆ సూపర్ సిక్స్ లోని అంశాలలో అమరావతి పాయింట్ లేదు. ఎన్నికల ప్రణాళికలో అమరావతిని అభివృద్ది చేస్తామని చెప్పినప్పటికీ.. సూపర్ సిక్స్‌లో లేకపోవడం గమనార్హమే. అలాంటప్పుడు చంద్రబాబు,పవన్‌లు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి. సూపర్ సిక్స్‌లోని నిరుద్యోగ భృతి కింద రూ.3,000, మహిళా శక్తిలో ప్రతి మహిళకు రూ.1,500, తల్లికి వందనం పేరిట బడికి వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15,000, రైతు భరోసా కింద రూ.20,000 ఇవ్వాల్సి ఉంది. ఆడవారికి ఉచిత బస్ ఊసే లేదు. గ్యాస్ సిలిండర్ల స్కీమ్‌ను అరకొరగానే అమలుచేశారు. వృద్దుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు. సూపర్ సిక్స్ కాకుండా ఎన్నికల ప్రణాళికలో సుమారు 175 వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్.. తదితర హామీలు ఉన్నాయి. ఈ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే అమరావతికి ఎలా వస్తుందని ప్రజలు నిలదీయరంటారా?. ఇప్పటికే ఏడు నెలల్లో రూ.70,000 కోట్ల అప్పులు చేశారు. తొలుత సూపర్ సిక్స్ ,తదితర హామీలను నెరవేర్చిన తదుపరి ఎన్నివేల కోట్ల నిధులను అమరావతిలో ఖర్చు చేసినా ఎవరూ కాదనరు. ఒకవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో అదనపు బాదుడు బాదుతూ, ఇంకో వైపు హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, పైగా తగ్గిస్తామని చంద్రబాబు ఒకటికి రెండుసార్లు చెప్పేవారు. ఇప్పుడేమో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు.అయితే వైఎస్ జగన్ మాత్రం తన పాలనలో ప్రకటించిన ప్రకారం దాదాపు అన్ని హామీలు నేరవేర్చారు. ఆ పథకాల అమలుతో.. ప్రజల వద్ద డబ్బు ఉండేది. ఫలితంగా వ్యాపారాలు కూడా సాగేవి. కానీ అవన్నీ నిలిచిపోవడంతో మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కూడా బాగా తగ్గింది. వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగడం లేదు. దాని ఫలితంగానే జీఎస్టీ నెలసరి ఆదాయం దాదాపు రూ. 500 కోట్లు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అమరావతిలో పనులు ప్రారంబిస్తే, ఆ ప్రాంతం వరకు కొంత ఆర్ధిక లావాదేవీలు జరగవచ్చు. కాని రాష్ట్రవ్యాప్తంగా ఏమీ చేయకుండా రాజదానిలో మాత్రం విలాసవంతమైన భవనాలు నిర్మించితే సరిపోతుందా?. జగన్ విశాఖలో రూ.400 కోట్లతో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే.. వృధా అని ప్రచారం చేసిన కూటమి నేతలు, ఇప్పుడు వేలు.. లక్షల కోట్లతో అమరావతిలో భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనా అమరావతికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తే ఇచ్చుకోవచ్చు. కాని సూపర్ సిక్స్‌ను త్యాగం చేసి ఆ డబ్బంతటిని అమరావతి ప్రాంతానికి మళ్లీస్తే.. మిగిలిన ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరగవచ్చు. ఒకప్పుడు అమరావతిని ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వెచ్చించకుండా నిర్మించవచ్చని గ్యాస్ కొట్టిన కూటమి పెద్దలు.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం వేల కోట్ల ప్రజా ధనాన్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు చేయడానికి సిద్దం అవుతున్నారు. అమరావతిలో పలు స్కాములు జరిగాయని గత ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. వాటి పరిస్థితి ఏమైందో కూడా తెలియదు. కొత్తగా ఎన్ని స్కాములు జరుగుతాయో అనే సందేహం ఉంది. దానికి తగినట్లుగానే అమరావతిలో ఆయా నిర్మాణాల అంచనాలను సుమారు 30 శాతం వరకు పెంచారని వార్తలు వచ్చాయి. ఇది కూడా భవిష్యత్తులో పెను భారం కావచ్చు. ప్రజలు నిజంగా అధికారం కట్టబెట్టారో లేదంటే ఈవీఎంల మేనేజ్ మెంట్ జరిగిందో తెలియదుగాని.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదని చెప్పొచ్చు. దానికి అమరావతి నిర్మాణ తీరు తెన్నులు, అందుకు పెడుతున్న వేల కోట్ల వ్యయమే నిదర్శనం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అసలు సమస్య ముంపే!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని ముంపు ముప్పు నుంచి తప్పించడానికి తొలి దశలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నిధులతో కొండవీటి వాగుపై ఉండవల్లి వద్ద మరో 7,500 క్యూసెక్కులు ఎత్తిపోసేలా ఎత్తిపోతలను నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతోపాటు కొండవీటి వాగు వరదను కృష్ణా నదికి మళ్లించేలా నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.83 కిలోమీటర్ల పొడవున తవ్వే గ్రావిటీ కెనాల్‌పై నాలుగు చోట్ల పది క్యూసెక్కులను ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా ఈ ఐదు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) టెండర్ నోటిఫికేషన్ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేసింది. షెడ్యూళ్ల దాఖలుకు ఫిబ్రవరి 14ను తుది గడువుగా నిర్దేశించింది. రాజధానిని ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు 2018లో ఉండవల్లి వద్ద కొండవీటి వాగుపై 5 వేల క్యూసెక్కులను ఎత్తిపోసేలా రూ.260.48 కోట్లతో ఎత్తిపోతలను పూర్తి చేసింది. దీంతో పాటు ఇప్పుడు శాఖమూరు వద్ద 0.03, కృష్ణాయపాలెం వద్ద 0.10, నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం.. కొండవీటి వాగు, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా వెడల్పు చేయడం, కొండవీటి వాగు వరదను కృష్ణా నదికి మళ్లించడానికి నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.83 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వే పనులకు రూ.1,404.14 కోట్ల వ్యయంతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండో దశలో లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వి.. దానికి అనుబంధంగా లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద మూడు రిజర్వాయర్లు, వైకుంఠపురం వద్ద మరో ఎత్తిపోతలను నిర్మించాలని ప్రపంచ బ్యాంకు–ఏడీబీ ప్రతినిధులు సూచించారని ప్రభుత్వం చెబుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రాజధాని అమరావతిని ముంపు ముప్పు నుంచి తప్పించే పనుల వ్యయమే తడిసి మోపేడయ్యేలా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.222 మి.మీ వర్షం కురిసినా ముప్పు ఉండకూడదురాజధాని అమరావతి ప్రాంతంలో వందేళ్లలో నమోదైన వర్షపాతం గణాంకాలను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం విశ్లేషించింది. వందేళ్లలో ఒకసారి అమరావతి ప్రాంతంలో గరిష్టంగా 222 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ స్థాయిలో వర్షం కురిసినా రాజధాని అమరావతిని వరద ముప్పు నుంచి తప్పించేలా ముంపు నివారణ పనులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల ప్రణాళిక మేరకు రాజధాని ముంపు నివారణ ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ ప్రణాళికలో ప్రధానాంశాలిలా ఉన్నాయి.» రాజధాని ప్రాంతంలో ప్రవహించే వాగుల్లో ప్రధానమైనవి కొండవీటి వాగు, పాలవాగు. కొండవీటి కొండల్లో పేరిచెర్ల వద్ద జన్మించే కొండవీటి వాగు అచ్చంపేట, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల మీదుగా ప్రవహించి ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉండవల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. కొండవీటి వాగు పరివాహక ప్రాంతం 421 చదరపు కిలోమీటర్లు. కొండవీటి కొండల నుంచి ప్రవాహించే ఈ వాగు 31.15 కిలోమీటర్ల ప్రయాణం తరువాత నీరుకొండ వద్ద రాజధానిలోకి ప్రవేశిస్తుంది. » రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు 23.85 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఈ వాగు కనిష్టంగా 6 మీటర్ల నుంచి గరిష్టంగా 20 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తోంది. కృష్ణా నది, కొండవీటి వాగుకు ఒకేసారి వరదలు వస్తే.. కృష్ణా వరద కొండవీటి వాగులోకి 23.85 కిలోమీటర్ల పొడవున ఎగదన్నే ప్రమాదం ఉంది. ఇది రాజధాని ముంపునకు దారితీస్తుంది. » రాజధానికి కొండవీటి వాగు ముంపు ముప్పు నివారించడానికి ఆ వాగు ప్రవాహ సామర్థ్యాన్ని అనంతవరం నుంచి శాఖమూరు మీదుగా నీరుకొండ వరకు (11.6 కి.మీ నుంచి 23.6 కి.మీ వరకు) 2,120 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి. కృష్ణాయపాలెం నుంచి నీరుకొండ వరకు(4.6 కి.మీ నుంచి 11.6 కి.మీ) కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా లోతు, వెడల్పు చేయాలి. కృష్ణాయపాలెం నుంచి ఉండవల్లి వరకు (4.6 కి.మీ నుంచి 0 కి.మీ) కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి. » నీరుకొండ వద్ద 0.4, కృష్ణాయపాలెం వద్ద 0.1, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించాలి. » ఉండవల్లి వద్ద కొండవీటి వాగు నుంచి 5 వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజ్‌లోకి.. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలోకి ఎత్తిపోసేలా ఇప్పటికే ఎత్తిపోతలను నిర్మించారు. దానికి అనుబంధంగా 7,500 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో ఎత్తిపోతల నిర్మించాలి. » పాల వాగు సామర్థ్యాన్ని కృష్ణాయపాలెం నుంచి దొండపాడు వరకు 16.7 కి.మీల పొడవున 8,830 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి.» నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.843 కి.మీల పొడవున 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో గ్రావిటీ కెనాల్ తవ్వాలి. ఈ కెనాల్‌పై నాలుగు చోట్ల పది క్యూసెక్కుల సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాలు నిర్మించాలి. ఈ పనులన్నీ తొలి దశలో పూర్తి చేయాలి.» రెండో దశలో రాజధాని అమరావతి ఆవల ప్రాంతం నుంచి కొండవీటి వాగు వరద ప్రవాహం 12,500 క్యూసెక్కులకు మళ్లించేలా లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వాలి. దానికి అనుబంధంగా లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద రిజర్వాయర్లు నిర్మించాలి. కొండవీటి వాగు వరద ప్రవాహం 5,650 క్యూసెక్కులు కృష్ణా నదిలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల నిర్మించాలి. » రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే రిజర్వాయర్లను ఖాళీ చేయాలి. వరద నియంత్రణను పర్యవేక్షించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. -
పోలవరం, అమరావతికి నిధులు కేటాయించండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు. వచ్చేనెలలో జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రం తరఫున ఆయన పలు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలన్నారు. దావోస్ పర్యటన ముగించుకుని గురువారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోనూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బడ్జెట్లో నిధులు కేటాయించండి..ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో పోలవరం, అమరావతి నిర్మాణాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించాలని నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు కోరారు. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సహకారంపై చంద్రబాబు చర్చించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినందుకు నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీమాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆయన నివాసంలో చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాబు వెంటకేంద్ర ఉక్కు, పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ఉన్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇండోనేషియా ఆరోగ్య శాఖమంత్రి బుది జి సాదికిన్‌తో భేటీ అయినట్లు చంద్రబాబు ‘ఎక్స్’లో తెలిపారు. పరిటాల రవి 20 వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించినట్లు కూడా పేర్కొన్నారు. అలాగే.. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ఆడపిల్లల భద్రత, భవిష్యత్తు తమ ప్రధాన ప్రాధాన్యతలని పోస్ట్ చేశారు. త్వరలో దిగ్గజ సంస్థల సీఈవోలు వస్తారు దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పెట్టుబడులపై జరిగిన చర్చలకు కొనసాగింపుగా పలు దేశాల ప్రతినిధులు, దిగ్గజ సంస్థల సీఈవోలు, ప్రతినిధులు త్వరలో రాష్ట్రానికి వస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు.దావోస్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. సీఎస్ విజయానంద్, సీఎంవో అధికారులతో తన నివాసంలోనే సమావేశమై దావోస్ పర్యటనపై చర్చించారు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులు రాష్ట్ర పర్యటనకు వచ్చే నాటికి తగిన ప్రతిపాదనలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. -
దావోస్.. అంతా తుస్
సాక్షి,విజయవాడ : పెట్టుబడులు తేకుండానే సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. దావోస్ పర్యటనలో ఒక్క పరిశ్రమతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఏపీకి భారీగా పెట్టుబడులు తెస్తామని బయలు దేరిన చంద్రబాబు, లోకేష్..కానీ మూడు రోజుల దావోస్ సమావేశాల్లో ఒక్క ఎంఓయూ కూడా జరగలేదు. అదే సమయంలో దేశంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో జాతీయ,అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 9.3 లక్షల కోట్లు, తెలంగాణ ప్రభుత్వం రూ.56,300 కోట్ల పెట్టుబడుల ఎంవోయూలు చేసుకున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వంతో మాత్రం ఎంవోయూ కుదుర్చుకునేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రాలేదు. దీంతో ఎంవోయూలు లేకుండా పబ్లిసిటీకే చంద్రబాబు దావోస్ పర్యటన పరిమితమైంది.అదే సమయంలో తన దావోస్ పర్యటన కోసం చంద్రబాబు, తనయుడు నారా లోకేష్‌లు రూ.3కోట్లకు పైగా ఖర్చు చేసి జాతీయ మీడియా ఇంటర్వ్యూ ఇచ్చారు. దావోస్ పర్యటనలో రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చి పారిశ్రామిక వేత్తలకు నారా లోకేష్ చెడు సందేశం పంపారు. దావోస్ పర్యటనలో లోకేష్ సీఎం కావాలంటూ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ భజన చేశారు. బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ పబ్లిసిటీకే పరిమితమైంది. ఏపీలో ఎటువంటి కొత్త ప్రాజెక్టుకు ఎంవోయూ చేసుకోని మైక్రోసాఫ్ట్. దావోస్ నుండి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఏపీ అధికారులు తిరుగుముఖం పట్టారు. -
అమరావతిపై కపట ప్రేమ చూపిస్తున్న కూటమి నేతలు
-
మూడు ప్యాకేజీల కాంట్రాక్ట్ విలువ రూ.1,404.14 కోట్లుగా నిర్ధారణ
-
అమరావతి ‘ముంపు టెండర్ల’లో అక్రమాల వరద
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని కొండవీటి వాగు, పాల వాగు వరద ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు చేపట్టే పనుల టెండర్లలో అక్రమాలు వరదెత్తాయి. పనుల అంచనా వ్యయాన్ని 100 నుంచి 250 శాతం పెంచేసి.. మూడు ప్యాకేజీలుగా విభజించి.. ముందుగా ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) అధికారుల ద్వారా ముఖ్యనేతలు మూడు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. వీటి కాంట్రాక్ట్ విలువ (అన్ని పన్నులతో కలిపి) రూ.1,404.13 కోట్లుగా నిర్దేశించారు. పనుల విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్ట్ సంస్థలకు పనులు అప్పగించి.. పెంచిన అంచనా వ్యయం రూ.702.33 కోట్లను కమీషన్ల రూపంలో రాబట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. మూడు ప్యాకేజీల పనులు ఇవీ ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణంగా ఇస్తున్న నిధులతో మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ చేపట్టింది. ఒకటో ప్యాకేజీ కింద కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 23.6 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 16.75 కి.మీ. పొడవున వెడల్పు చేసి, లోతు పెంచడం, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎల్ఎస్ (లంప్సమ్) విధానంలో 24 నెలల్లో పూర్తి చేయడంతోపాటు మరో రెండేళ్లు నిర్వహించాలని నిబంధనతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.462.26 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా రూ.60.53 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ (నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ ప్యాకేజీ పనుల అంచనా వ్యయం రూ.522.79 కోట్లు. రెండో ప్యాకేజీ ఇదీ రెండో ప్యాకేజీ కింద నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడం.. కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో రెండేళ్లలో పూర్తి చేసి, మరో రెండేళ్లు నిర్వహించాలనే షరతుతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.303.73 కోట్లుగా నిర్దేశించింది.దీనికి అదనంగా రూ.38.57 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా విలువ రూ.342.3 కోట్లు. ఒకటో, రెండో ప్యాకేజీ పనులకు షెడ్యూళ్లు దాఖలు చేయడానికి ఈనెల 31 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరిచి.. అర్హత ఉన్న కాంట్రాక్ట్ సంస్థలు దాఖలు చేసిన ఆరి్థక బిడ్లను ఫిబ్రవరి 5న తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించనున్నారు. మూడో ప్యాకేజీ కింద.. మూడో ప్యాకేజీ కింద మంగళగిరి మండలం నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో ఈ నెల 1న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.470.74 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.68.30 కోట్లను రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా వ్యయం రూ.539.04 కోట్లు. ఈ పనుల టెండర్లలో షెడ్యూళ్ల దాఖలుకు ఈ నెల 22 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్, ఈనెల 25న ఆర్థిక బిడ్ తెరిచి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్ట్ సంస్థకు పనులు కట్టబెట్టనున్నారు. అంచనాల్లో పొంగిపొర్లిన అక్రమాలు రాజధాని ప్రాంతం నల్లరేగడి భూమితో కూడుకున్నది. పెద్దగా రాళ్లు, రప్పలు ఉండవు. పొక్లెయిన్లు వంటి యంత్రాలతో సులువుగా కాలువ తవ్వవచ్చు. పైగా ఇవేమీ కొత్తగా తవ్వే కాలువలు కాదు. కొండవీటి వాగు, పాల వాగులను విస్తరించడమే.. కొత్తగా 7.843 కిమీల పొడవున మాత్రమే కాలువ తవ్వాలి. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి తవ్వడానికి ప్రస్తుతం గరిష్టంగా రూ.100 చెల్లిస్తున్నారు.ఈ లెక్కన 8 నుంచి 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కి.మీ. పొడవున కాలువ తవ్వకం పనుల అంచనా వ్యయం రూ.4.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు మించదని, 10 నుంచి 11 వేల క్యూసెక్కుల కాలువ తవ్వకం పనులకు కి.మీ. రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల (జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ వంటి పన్నులతో కలిపి)కు మించదని జలవనరుల శాఖలో అనేక ప్రాజెక్టుల్లో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక అధికారి తేల్చిచెప్పారు.ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మించడానికి అంచనా వ్యయం జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లకు మించదని రిజర్వాయర్ల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న మరో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఒకరు స్పష్టం చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఒకటో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం రూ.301.75 కోట్లకు మించదు. కానీ.. ఈ ప్యాకేజీ కాంట్రాక్ట్ విలువను జీఎస్టీ వంటి పన్నులతో కలిపి రూ.522.79 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.221.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. కొండవీటి వాగు, పాల వాగు లోతు, వెడల్పు పెంచే పనులకు కి.మీ. రూ.5 కోట్లు చొప్పున వేసుకున్నా రూ.201.75 కోట్లు అవుతుంది. శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.వంద కోట్లు లోపే అవుతుంది.జ్యుడీషియల్ ప్రివ్యూ ఉండి ఉంటే..జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ ఉండి ఉంటే టెండర్ ముసాయిదా షెడ్యూల్ దశలోనే ఈ అక్రమాలు బహిర్గతమయ్యేవని.. అందుకే ఆ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఒకరు స్పష్టం చేశారు. జాయింట్ వెంచర్‌గా ఏర్పడి టెండర్ షెడ్యూల్ దాఖలు చేయడానికి వీల్లేదని నిబంధన పెట్టడం ద్వారా ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్ట్ సంస్థకే పనులు అప్పగించేందుకు ముఖ్యనేతలు ఎత్తుగడ వేసినట్టు స్పష్టమవుతోంది. అదే టెండర్ నోటిఫికేషన్లో 50 శాతం పనులను సబ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే వెసులుబాటును కల్పించడాన్ని బట్టి చూస్తే ముఖ్యనేతల దోపిడీ పన్నాగం బట్టబయలవుతుందని రిటైర్డ్ ఎస్ఈ ఒకరు స్పష్టం చేశారు.రాష్ట్రంలో 2014–19 మధ్య టెండర్ల వ్యవస్థను నీరుగార్చి, ప్రతిపాదన దశలోనే పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. అస్మదీయ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి.. వాటిని కమీషన్ల రూపంలో వసూలు చేసుకుని జేబులో వేసుకోవడానికి ముఖ్య నేతలు మరిగారు. 2019 మే 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని చేసి.. టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సు విధానాన్ని రద్దు చేశారు. రూ.100 కోట్లు.. అంతకంటే వ్యయం ఎక్కువగా ఉన్న పనులకు సంబంధించి టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలి.దీన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసి.. ఇంజనీర్లు, మేధావులు, ప్రజలు, కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఆన్లైన్లో జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి అభిప్రాయాలను తీసుకుంటారు. వాటి ఆధారంగా ముసాయిదా షెడ్యూల్లో మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసిన ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదిస్తారు. దాంతోనే సంబంధిత శాఖ అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూను రద్దు చేసింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని పునరుద్ధరించింది. ఇది జరిగాకే రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు టెండర్లు పిలుస్తున్నారు. మిగిలిన రెండు ప్యాకేజీల్లోనూ ఇదే తీరురెండో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.197.05 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం పన్నులతో కలిపి రూ.342.3 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే అంచనా వ్యయం రూ.145.25 కోట్ల మేర పెంచేసినట్టు స్పష్టమవుతోంది. 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడానికి.. కిలోమీటర్‌కు రూ.6 కోట్ల చొప్పున రూ.47.05 కోట్లు అవుతుంది.కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం రూ.150 కోట్లకు మించదు. మూడో ప్యాకేజీ కింద నీరుకొండ వద్ద 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.200 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.339.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. మొత్తమ్మీద ముంపు ముప్పు నివారించడానికి చేపట్టిన మూడు ప్యాకేజీల పనుల్లో అంచనా వ్యయాన్ని రూ.702.33 కోట్లు పెంచేసినట్టు తేటతెల్లమవుతోంది. -
అమరావతిని అక్రమాలపురంగా మారుస్తున్న కూటమి సర్కార్
-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో అడుగడుగునా కమీషన్లు... సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్ ‘హ్యాపీ నెస్ట్’ టెండర్లలో విచ్చలవిడిగా అక్రమాలు
-
ఏం.. తమాషాలు చేస్తున్నారా?.. పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి,అమరావతి: గుంటూరు పట్టాభిపురం పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేశాం. అయినా ఎందుకు తలదూరుస్తున్నారు’ అంటూ మండిపడింది. మంగళవారం హైకోర్టులో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సోదరి వజ్ర కుమారి, వసంత ఇంటి వ్యవహార కేసు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించినా.. సివిల్ వ్యవహారంలో పట్టాభిపురం పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ వజ్రకుమారి, వసంతల తరఫున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ వ్యతిరేక వర్గానికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారని చెప్పారు. అనంతరం, తమ ఆదేశాలను ధిక్కరించిన పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు న్యాయమూర్తి పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆదేశాలను కచ్చితంగా అమలు అయ్యేటట్లు చూడాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించారు. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తే సదరు పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. -
డిప్యూటీ సీఎం పవన్‌తో దిల్ రాజు భేటీ.. ఈ అంశాలపైనే చర్చ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు అమరావతిలో భేటీ అయ్యారు. తాను నిర్మించిన 'గేమ్ ఛేంజర్' సినిమా త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో వారిద్దరి భేటీ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల ధరల పెంపుతో పాటు విజయవాడలో సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమం ఏర్పాటు గురించి పవన్‌తో దిల్ రాజు చర్చించనున్నారు.తెలంగాణలో సంధ్య థియేటర్ ఘటన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో బెనిఫిట్‌షోలు, టికెట్ ధరల పెంపు వంటి అంశాలు ఉండవని ఆయన క్లియర్‌గా చెప్పేశారు. దీంతో సంక్రాంతి సినిమాలపై భారీగా ప్రభావం పడింది. ఈ క్రమంలో దిల్ రాజు- రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్' జనవరి 10న విడుదల కానుంది. తెలంగాణలో ఈ చిత్రానికి ఎలాంటి బెనిఫిట్‌షోలు, టికెట్ ధరల పెంపు ఉండదు. దీంతో కనీసం ఏపీలో అయినా ఈ సౌలభ్యం పొందాలని చిత్ర యూనిట్ భావించింది. ఈమేరకు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. ఏపీలో టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వాలని ఆయన్ను కోరనున్నట్లు సమాచారం. జనవరి 4,5 తేదీలలో విజయవాడలో గేమ్ ఛేంజర్ మెగా ఈవెంట్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చేలా చూడాలని పవన్‌ను కోరనున్నారు. ఈ భేటీ అనంతరం దిల్ రాజు పూర్తి విషయాలు ప్రకటించే అవకాశం ఉంది. -
అమరావతికి అప్పుల వరద.. బాబు సూపర్ షాక్..
-
హ్యాపీనెస్ట్ నిర్మాణానికి టెండర్లు
సాక్షి, అమరావతి: అమరావతిలోని నేలపాడులో నిర్మించనున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం అమల్లో ఉన్న సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టెండర్ డాక్యుమెంట్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. కానీ అప్పటి నుంచి టెండర్లను ఆహ్వానించకుండా.. జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దు చేసిన తర్వాత ఇప్పుడు సీఆర్డీఏ ద్వారా టెండర్లను ఆహ్వానించడం గమనార్హం. అలాగే ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.720 కోట్ల నుంచి రూ.930 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇప్పుడు సీఆర్డీఏ ద్వారా ఈ ప్రాజెక్టుకు రూ.818.03 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ కాంట్రాక్టు విధానంలో టెండర్లను ఆహ్వానించింది. ప్రాజెక్టు పూర్తికి 24 నెలల గడువుఈ ప్రాజెక్టులో భాగంగా జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 అపార్ట్మెంట్ యూనిట్లు నిర్మించాలని టెండర్ డాక్యుమెంట్లో సీఆర్డీఏ పేర్కొంది. షేర్ వాల్ టెక్నాలజీ వినియోగం ద్వారా హ్యాపీనెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. అంతర్గత–బాహ్య విద్యుత్ పనులు, ప్లంబింగ్, శానిటరీ, అగ్నిమాపక పనులు, లిఫ్ట్‌లు, ల్యాండ్ స్కేపింగ్ తదితర పనులు చేపట్టాలని పేర్కొంది. ఓపెన్ టెండర్ విధానంలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు సీఆర్డీఏ తెలిపింది. టెండర్ దక్కించుకున్న సమయం నుంచి 24 నెలల్లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్లంబింగ్, శానిటరీ, ల్యాండ్‌స్కేప్, ఫైర్ ఫైటింగ్, లిఫ్ట్‌లు, సెక్యూరిటీ వ్యవస్థ, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ తదితరాలను అంశాల వారీగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే పనులు పూర్తి చేసినప్పటి నుంచి మూడేళ్ల సమయాన్ని డిఫెక్ట్ లయబిలిటీగా సీఆర్డీఏ పేర్కొంది.10% మొబిలైజేషన్ అడ్వాన్స్..కాంట్రాక్టు వ్యయంలో 10శాతం మేర మొబిౖలెజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పనులు దక్కించుకున్న సంస్థలకు ముందుగానే పనుల విలువలో పది శాతం మేర మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు టెండర్లో పేర్కొంది. అంచనావ్యయానికి ఐదు శాతంలోపు కోట్ చేసిన టెండర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. అంతకన్నా ఎక్కువ కోట్ చేసిన టెండర్లను తిరస్కరించనున్నట్లు వెల్లడించింది. టెండర్ల దాఖలుకు వచ్చే నెల 8 వరకు గడువు ఇచ్చింది. 8వ తేదీ సాయంత్రం సాంకేతిక బిడ్‌ను తెరవనున్నట్లు ప్రకటించింది. జనవరి 10న ఆర్థిక బిడ్‌ను తెరవనున్నట్లు తెలిపింది. -
పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ
పుణే: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. మహారాష్ట్రలోని పుణే నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అమరావతికి చెందిన కార్మికులు వారి కుటుంబాలతోపాటు రెండు రోజుల క్రితం ఉపాధి కోసం పుణేకు వచ్చారు. వఘోలి ప్రాంతంలోని కెస్నాడ్ ఫటా ఫుట్‌పాత్‌పై వీరంతా నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 12.55 గంటల సమయంలో అదుపు తప్పిన ఓ ట్రక్కు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైగా దూసుకెళ్లింది. ఘటనలో రెండేళ్లలోపు ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ గజానన్ టొట్రేను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
రాజధానికే రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా?
సాక్షి, విశాఖపట్నం: రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలోనే నిధులను ఖర్చు చేసి... ఇతర ప్రాంతాలకు అన్యాయం చేయడం సరికాదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విమర్శించారు. రాజధానికే రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా? అని ఆయన ప్రశి్నంచారు. రాజధాని పేరుతో ఉత్తరాం«ధ్ర, రాయలసీమలను పట్టించుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈఏఎస్ శర్మ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ‘గుంటూరు జిల్లా అమరావతిలో రానున్న మూడేళ్లలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణాలు, ఇతర నిధులన్నీ దాదాపు రూ.50వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నామంటూ ప్రభుత్వం ప్రకటించడం ఆందోళన కలిగించే అంశం. ఈ రుణభారం భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలపైనా పడుతుంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల నుంచి కూడా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలి. అమరావతి రాజధాని వల్ల మిగిలిన ప్రాంతాలకు ఎంత లాభం ఉందో తెలీదు కానీ... అన్యాయం మాత్రం తీవ్రంగా జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తిగా భావిస్తున్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తుంటే దాన్ని ఆపకుండా... పక్కనే నక్కపల్లిలో ప్రైవేట్ కంపెనీ ఆర్సెల్లరీ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను స్థాపించేందుకు మొగ్గు చూపడం ఎంతవరకు సమంజసం? ఈ ఒక్క నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వానికి ఉత్తరాంధ్రపై ఉన్న ఉదాసీనత బట్టబయలైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం విభజన చట్టంలో ఉన్న హామీలపై ఇంతవరకు కూటమి ప్రభుత్వం కేంద్రంతో చర్చించకపోవడం కూడా మీ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ వ్యవహారంపై మీరు చూపించిన చొరవపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. రాజధాని పేరుతో బిల్డింగులు, హంగులపై ప్రజల నిధులు ఖర్చు చేసే బదులుగా.. ప్రభుత్వ విధానాల్లో వికేంద్రీకరణ, ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకురావడం, ప్రజాస్వామ్య విధానాలపై దృష్టి సారిస్తే మంచిది. వెనుకబడిన ప్రాంతాలను విస్మరించి వేల కోట్ల రూపాయలను రాజధానికి ఖర్చు చేస్తే రాష్ట్ర ప్రజలు హర్షించరన్న విషయాన్ని గుర్తించాలి..’అని లేఖలో శర్మ పేర్కొన్నారు. -
అమరావతికి కేంద్రం ఇచ్చేది గ్రాంట్ కాదు అప్పే
-
అప్పులతోనే అమరావతి.. పెండింగ్ పనులకు 30వేల కోట్లు!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ అప్పులు చేయడంలో ఫుల్ బిజీ అయిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పులతోనే అమరావతిలో నిర్మాణాలకు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ ద్వారా కేంద్రం అప్పులు ఇప్పిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి కోసం బాబు సర్కార్ 30వేల కోట్ల అప్పులు చేస్తోంది.అప్పులతోనే అమరావతి చేస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు నుండి రూ.6,800 కోట్ల అప్పు తీసుకునేందుకు నిన్న బోర్డు మీటింగ్‌లో ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఏడీబీ ద్వారా అమరావతి కోసం ప్రభుత్వం రూ.6700 కోట్లు అప్పు తెస్తోంది. ప్రపంచబ్యాంకు, ఏడీబీ అప్పులు కలుపుకుంటే అమరావతి కోసమే బాబు సర్కార్ రూ.13,500 కోట్లు అప్పులు చేస్తోంది.ఈ నేపథ్యంలో అమరావతికి కేంద్రం ఇచ్చేది గ్రాంట్ కాదు అప్పు మాత్రమేనని మరోసారి తేలింది. కేంద్రం నిధులు ఇస్తోందంటూ ఇన్నాళ్లూ చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. కానీ, కేంద్రం కేవలం.. ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు మాత్రమే ఇప్పిస్తోంది. ఈ అప్పులన్నింటీనీ కూటమి సర్కార్.. అమరావతి కోసం మళ్లిస్తోంది. మరోవైపు.. హడ్కో ద్వారా 11వేల కోట్లు, కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా 5 వేల కోట్లను బాబు సర్కార్ అప్పుగా తీసుకుంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అమరావతి కోసం సుమారు 30 వేల కోట్ల అప్పు చేస్తోంది. అమరావతిలో పెండింగ్ భవనాల కోసం అప్పులు చేస్తూ.. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో అభివృద్ధి పనులను నిలిపి వేసింది. ప్రస్తుతం అప్పులన్నీ అమరావతికే కేటాయిస్తోంది. -
ఇది ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం
తాడేపల్లి: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపిన కూటమి ప్రభుత్వం...ఈ విషయంలో తక్షణమే పెంచిన భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజల తరుపున వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలు, మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ..ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంరాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోపిన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా ఏఈ లేదా డీఈ కార్యాలయంకు వెళ్ళి, అధికారులకు మెమోరాండంను సమర్పించాలి. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలని సూచించారు.‘ఇది అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి, వారికి న్యాయం జరిగేలా ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, ప్రజాసమస్యలపై ఎంత దృఢంగా ఉందో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడయింది. జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ రెండో కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి’ అని పిలుపునిచ్చారు.ఇందుకు సంబంధించి వైఎస్సార్ సిపి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి. ఈ కార్యక్రమాన్ని ముందు జిల్లా స్ధాయిలో నిర్వహించాలని భావించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నియోజకవర్గ స్ధాయిలో చేయాలని మన అధినేత జగన్ అందుబాటులో ఉన్న నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్ధాయిలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఆయా నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు అందరూ తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. నియోజకవర్గ ఇంఛార్జ్‌లంతా కూడా తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ దోపిడినీ ఎండగట్టాలని సజ్జల పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి..ఈ నెల 21 న మన అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి, జగన్‌గారిపై ఉన్న ప్రజాభిమానం ఈ సందర్భంగా వెల్లడవ్వాలి, పార్టీ క్యాడర్ అంతా ఉత్సాహంగా పాల్గొని జగన్‌గారిపై ప్రజాభిమానం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలి, ఈ వేడుకలను అందరం విజయవంతం చేద్దాం’ అని సజ్జల పేర్కొన్నారు.సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉందాంసోషల్ మీడియాకు సంబంధించి కొత్తగా మరికొంతమంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారు, వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు లీగల్ సెల్ సిద్దంగా ఉంది, ఏ సమయంలో ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే లీగల్ సెల్‌ను అప్రమత్తం చేసి వారికి అండగా నిలబడాలి. ఇటీవల సోషల్ మీడియా యాక్టివిస్టుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పోలీసులకు తెలియజేసి, దానిని అతిక్రమిస్తే వచ్చే ఇబ్బందులను పోలీసులకు తెలియజేయాలి. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు అవసరమైన సహాయం చేసేందుకు పార్టీ నాయకులు కూడా వెంటనే అందుబాటులో ఉండాలి’ అని సజ్జల హితవు పలికారు. -
అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంతలు తొక్కుతుందని ఎల్లోమీడియాలో కథనాలు
-
అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయమవుతోంది
సాక్షి, హైదరాబాద్: అమరావతి అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు వెళ్తాయేమోననే అభిప్రాయం ఉండేదని, ఇటీవల అమరావతిలో సంభవించిన వరదలతో ఆ భావన పోయిందన్నారు. పొంగులేటి సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోందన్నారు. సెప్టెంబర్‌తో పోలిస్తే నవంబర్‌లో, నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో కొంత పురోగతి కనిపిస్తోందని, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా పెరుగుతోందని చెప్పారు. పెట్టుబడులు ఆంధ్రకు వెళ్లే అవకాశముందా అని విలేకరులు ప్రశ్నించగా... పెట్టుబడిదారులంతా తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారని, కొందరు బెంగళూరు వైపు చూస్తున్నారని చెప్పారు. ‘అమరావతిలో ఇటీవల వచ్చిన వరదలతో సీన్ మారిపోయింది. వాళ్లు ఎంత బూస్టప్ ఇవ్వాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకున్నా వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు’అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల్లో హైడ్రా పట్ల భయం పోయిందని, మొదట్లో తప్పుడు ప్రచారం వల్ల కొంత వేరే అభిప్రాయం ఉన్నా.. ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసిపోయిందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. సంక్రాంతికి రైతు భరోసా తప్పకుండా ఇస్తామని చెప్పిన పొంగులేటి.. రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు రూ.12వేలను రెండు దఫాల్లో ఇస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని, ఇందుకోసం విడతకు రూ.1000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.7 లక్షల కోట్లు అప్పు వాస్తవమని, ఈ విషయంలో చర్చ నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ గొడవ చేయాలని చూస్తోందన్నారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు లెక్కలోకి రావా అని ప్రశ్నించారు. అసలు కార్పొరేషన్ల నుంచి ఒక్క రూపాయి అయినా ఆదాయం వచ్చే పరిస్థితి ఉందా అని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, సినిమా వాళ్లు, జర్నలిస్టులు, ప్రజలందరూ తమకు సమానమేనని అన్నారు. శాసనసభలో ఎవరి పాత్ర వారు పోషించాల్సిందేనని, భట్టిపై ప్రివిలేజ్ తీర్మానం ఇవ్వడం బీఆర్ఎస్ హక్కు అని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని, ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో చర్చలో మాట్లాడాలని తనకు కూడా కోరికగా ఉందని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, ఆదానీ విషయంలో ఏఐసీసీ విధానమే తమ విధానమని స్పష్టంచేశారు. -
‘అమరావతి’కి ఇచ్చేది అప్పే!
సాక్షి, అమరావతి: అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన రూ.15 వేల కోట్లు రుణమని తేలిపోయింది. ఈ మొత్తం కేంద్రం నుంచి గ్రాంట్‌గా ఇస్తున్నట్లు ఇప్పటికే శాసనసభలో ప్రకటించిన సీఎం చంద్రబాబు.. అందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా సభలో ధన్యవాదాలు సైతం తెలిపారు. ఇక ప్రకటించిన మొత్తంలో రూ.13,500 కోట్లు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి కేంద్రం రుణం తీసుకుని ఏపీ రాజధాని నిర్మాణానికి గ్రాంట్‌గా ఇస్తున్నట్లు కూటమి నేతలు ప్రచారం చేశారు. కానీ, ఇవన్నీ అబద్ధమని.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు ఇచ్చేది పూర్తిగా షరతులతో కూడిన రుణమని తాజాగా బహిర్గతమైంది. ఈ మేరకు గురువారం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సమావేశమైన ఆసియా అభివృద్ధి బ్యాంకు బోర్డు అధికారులు ‘అమరావతి ఇన్‌క్లూజివ్ అండ్ సస్టెయినబుల్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్’కి 788.8 మిలియన్ డాలర్ల రుణాన్ని (సుమారు రూ.6,694.36 కోట్లు) ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఈ రుణం మొత్తం థీ121.97 బిలియన్ల జపనీస్ యెన్‌లో అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తంతో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పథకం కింద వాటాదారులుగా ఉన్న రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వ కాంప్లెక్స్, మౌలిక సదుపాయాలతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ఖర్చుచేయాలని సూచించారు. ఈ మొత్తాన్ని ఇతర బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల (మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్) సహకారంతో ప్రోగ్రామ్‌కు మద్దతు ఉంటుందని ఏడీబీ భారతదేశ కంట్రీ డైరెక్టర్ మియో ఓకా తెలిపారు. ఇక రుణంగా ఇచ్చే మొత్తానికి వడ్డీ ఉండదని, కానీ 20 ఏళ్ల తర్వాత వాయిదాలుగా ఆనాటికి ఉన్న డాలర్ల విలువకు సమానంగా చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే, అప్పటికి డాలర్ విలువ 20 రెట్లు పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమరావతికి వచ్చే రూ.15,000 కోట్లలో ఏడీబీ, ప్రపంచ బ్యాంకులు ఇచ్చే రూ.13,500 కోట్ల రుణం కాగా, మిగిలిన మొత్తాన్ని కేంద్రం ఇవ్వనుంది.