Anoop Singh
-
సమాచారం పంపండి
► నియోజకవర్గాల పరిధిలో గ్రామాల జాబితా ఇవ్వండి ► జిల్లా యంత్రాంగానికి కేంద్ర ఎన్నికల కమిషన్ లేఖ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నియోజకవర్గాల సమగ్ర సమాచారం నివేదించాలని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) జిల్లా యంత్రాంగానికి లేఖ రాసింది. ఆయా నియోజకవర్గాల పరిధిలోకి ఏయే మండలాలు, గ్రామాలు వస్తాయనే వివరాలను తక్షణమే పంపాలని ఆదేశించింది. అదే పట్టణ నియోజకవర్గాలయితే.. వార్డుల హద్దుల సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనూప్‌సింగ్ లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనను నిర్వచిస్తూ లేఖలో రాసినప్పటికీ, ఇది రొటీన్ లో భాగంగా జరుగుతున్న ప్రక్రియ మాత్రమేనని అధికారవర్గాలంటున్నాయి. ఇదిలా ఉండగా, ఈసీ అడిగిన సమాచారాన్ని తక్షణమే పంపాలని ఆర్డీఓ, తహసీల్దార్లను జిల్లా యంత్రాంగం ఆదేశించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు వేర్వేరు జిల్లాల్లో కలిసినందున.. దానికి అనుగుణంగా సమాచారాన్ని సేకరించాలని నిర్దేశించింది. -
కొడుక్కి టికెట్.. తండ్రి గరంగరం!
అమృత్సర్: రాజకీయాల్లో సాధారణంగా కొడుకుకు టికెట్ కావాలని పైరవీలు చేసే తండ్రులను చూస్తుంటాం. తాము పోటీ చేసే స్థానాన్ని కొడుకు కోసం 'త్యాగం' చేసే తండ్రులనూ చూస్తాం. అయితే.. పంజాబ్‌లో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా.. ఏమాత్రం వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించని విధంగా చోటు చేసుకున్న ఓ ఘటన ఆసక్తిగా ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖేమ్ కరణ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సుఖ్‌పాల్ సింగ్ అనే వ్యక్తికి కాంగ్రెస్ నుంచి టికెట్ ఖరారైంది. సుఖ్పాల్కు టికెట్ దక్కినందుకు అత్యంత బాధపడేది ఎవరంటే.. ఆ టికెట్‌ను ఆశించిన అతడి తండ్రి గురుచేత్ సింగ్, సోదరుడు అనూప్ సింగ్. గురుచేత్ సింగ్(75) ఈ విషయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు లేఖ రాశారు. ఖేమ్ కరణ్ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం తన ఇద్దరు కుమారులకు కాకుండా తనకే ఇవ్వాలంటూ లేఖలో గురుచేత్ సింగ్ అభ్యర్థించారు. తన ఇద్దరు కుమారుల మధ్య వివాదాలున్నాయని.. వారిద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీకి నష్టం జరుగుతుందని లేఖలో పేర్కొన్నాడు. గతంలో మంత్రిగా పనిచేసిన గురుచేత్ సింగ్ 2007, 2012 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తన వంతుగా అనూప్ సింగ్ సైతం సోనియా గాంధీకి లేఖ రాశారు. తన సోదరుడిపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయని, అతడికి క్లీన్ ఇమేజ్ లేనందున టికెట్ తండ్రికి కేటాయించాలని ఆయన కోరారు. ఇందిరా గాంధీ హంతకులకు నివాళులర్పించే కార్యక్రమానికి సైతం సుఖ్‌పాల్ హాజరయ్యాడని చెబుతూ.. దానికి సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్పంగ్లను సైతం లేఖకు అనూప్ జతచేశాడు. టికెట్ పొందిన సుఖ్‌పాల్.. తాను 1998 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నానని.. 2012 ఎన్నికల్లో తండ్రి పోటీ చేసే సమయంలోనే.. 2017లో తానే అని కుటుంబం నిర్ణయం తీసుకుందని చెబుతున్నాడు. చూడాలి మరి ఇంట్లోనే ఉన్న ఇద్దరు అసంతృప్తులతో సుఖ్‌పాల్ ఎలా నెగ్గుకొస్తాడో!