ఆర్థిక అక్షరాస్యతపై ఆవగాహన
ఖిల్లాఘనపురం: ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉన్నప్పుడు అభివృద్ధి సాధ్యమని వెల్కిచెర్ల ఏపీజీవీబీ మేనేజర్ రోహిత్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అప్పారెడ్డిపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరూ చదువుకున్నప్పుడే డబ్బులు ఎలా సంపాదించాలి,సంపాదించిన డబ్బులు ఎలా ఖర్చు చేయాలి, ఉన్న సంపాదనలో ఎంత పొదుపుచేసుకోవాలి అనే అవగాహన కల్గుతుందన్నారు. మహిళాసంఘాల సభ్యులు ప్రతి నెల సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. ప్రభుత్వం రూ.5 లక్షల వరకు వడ్డిలేని రుణాన్ని పొందే అవకాశం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సింహరెడ్డి, బ్యాంక్ ఫీల్డ్ ఆఫిసర్ రవికుమార్, బ్యాంక్ మిత్ర వెంకటేష్, గ్రామ పెద్దలు శంకర్‌గౌడ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.