armed police
-
శ్రద్ధా కేసు: అఫ్తాబ్‌కి ఆ సమయంలో రక్షణగా ఉన్న పోలీసులకు రివార్డు
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసులోని నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాని తీసుకువెళ్తున్న వాహనంపై కొందరూ దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో అతడికి రక్షణగా ఉన్న ఐదుగురు పోలీసులు గాల్లో కాల్పులు జరిపి పరిస్థితిని చాలా చాకచక్యంగా అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ ఆ సమయంలో సరైన విధంగా స్పందించిన ఢిల్లీ ఆర్మీ పోలీస్ బృందానికి చెందిన మూడవ బెటాలియన్ పోలీస్ కమాండ్‌కి రివార్డులు బహుకరించారు. ఈ మేరకు సబ్ఇన్స్పెక్టర్లు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రివార్డు అందజేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లకు రూ 5000/-లు మరోక కానిస్టేబుల్ రూ. 5000లు బహుకరించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ పోలీసులు అప్తాబ్‌ను పాలీగ్రఫీ టెస్ట్ నిమిత్తం సోమవారం ఎఫ్ఎస్ఎల్ ల్యాబొరేటరీకి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఇక అఫ్తాబ్‌కి నిర్వహించాల్సిన టెస్ట్‌లు పూర్తి అయిన తదనతరం రక్షణగా ఉన్న ఢిల్లీ ఆర్మీ పోలీసు బృందం వ్యాన్ని పూర్తిగా తనిఖీ చేసి తీహార్ జైలుకి తరలించేందుకు సిద్ధం అయ్యారు. సరిగ్గా వ్యాన్ రోహిణి ప్రాంతంలోని కార్యాలయం నుంచి గేటు దాటుతుండగా... అకస్మాత్తుగా ఒక గుంపు జైలు వ్యాన్‌పై దాడి చేసింది. దీంతో ఢిల్లీ ఆర్మ్డ్ పోలీస్(డీఏపీ) బృందం అద్భుతమైన తెగువను ప్రదర్శించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రక్షించింది. ఇది చాలా ప్రశంసించదగ్గ విషయం అని ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ పేర్కొంటూ వారికి రివార్డులు అందజేసింది. కాగా అప్తాబ్ పోలీస్ వాహనంపై దాడికి పాల్పడ్డ నిందితులు కుల్దీప్ ఠాకూర్, నిగమ్ గుర్జార్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వారిని అక్కడి నుంచి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. మిగిలిన నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. (చదవండి: ‘మా సోదరిని వాడు 35 ముక్కలు చేశాడు సార్.. మేం 70 ముక్కలు చేస్తాం’) -
తుపాకీతో హెడ్‌కానిస్టేబుల్ హల్చల్
సాక్షి, వరంగల్/రామన్నపేట: వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి వద్ద ఆర్ముడ్ రిజర్వ్ హెడ్‌కానిస్టేబుల్ తుపాకీతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎంజీఎం ఆస్పత్రి ప్రిజనరీ (ఖైదీల) వార్డు వద్ద విధులు నిర్వర్తిస్తున్న కొండవీటి విఘ్నేశ్వర బాలప్రసాద్ శనివారం రాత్రి భోజనానికి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అతిగా మద్యం సేవించి తన వద్ద ఉన్న తుపాకీతో ప్రజలను బెదిరించడం మొదటుపెట్టాడు. ఇది గమనించిన స్థానికులు 100 నంబర్‌కు డయల్ చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతడి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకోవడంతో పాటు, రక్త నమూనాలు సేకరించారు. అనంతరం మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. హెడ్‌కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏసీపీ గిరికుమార్ తెలిపారు. -
హోటల్ గదిలో కానిస్టేబుల్ రాసలీలలు
సాక్షి, అనంతపూర్: హోటల్ గదిలో ఏఆర్ కానిస్టేబుల్ బాగోతం బయటపడింది. ఏఆర్ కానిస్టేబుల్ మరో మహిళతో హోటల్ గదిలో ఉండగా.. సదరు మహిళ భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ వ్యవహారం వెలుగు చూసింది. బ్యూటిషిషన్గా పనిచేస్తున్నానంటూ తన భార్య ఏఆర్ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని మహిళ భర్త ఆరోపించాడు. భార్య ప్రవర్తనపై పోలీసుల వద్ద వాపోయాడు. ఏర్ కానిస్టేబుల్ని, మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. (చదవండి: క్యాంపస్‌లోనే మహిళపై లైంగిక దాడి) (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
పులిని పట్టుకోడానికి వెళ్లిన పోలీసులకు షాక్
లండన్: సెవనోక్స్లోని ఇఘ్తామ్ ప్రాంతంలో పులి సంచరిస్తోందని వార్తలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే సాయుధ దళానికి చెందిన పదిమంది పోలీసులను ఆ ప్రాంతానికి పంపించారు. తీరా ఆ ప్రాంతాన్ని గాలింపు చేపట్టడానికి వెళ్లిన పోలీసులకు పెద్ద షాక్ తగిలినట్లైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇఘ్తామ్ గ్రామంలో పులి కనిపించిందంటూ వార్తలు రావడంతో పోలీసులు శనివారం నాడు రంగంలోకి దిగారు. ఇంతలో ఓ ఇంటి ముందు పులి కనిపించింది. ఇంకేముందీ.. వెంటనే దాన్ని పట్టుకునేందుకు ఆ ఇంటిపైనే హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టారు. అయితే పులిలో కాస్తైనా కదలిక లేకపోవడంతో దగ్గరగా వచ్చి పరిశీలించిన పోలీసులకు షాక్ తగిలినట్టైంది. (ట్రాక్టర్‌పై పెద్ద పులితో పోరాడి..) ఎందుకంటే అక్కడ ఉన్నది పులీ కాదు పిల్లీ కాదు.. ఉట్టి పులి బొమ్మ. ఇంతలో హెలికాప్టర్ల శబ్ధంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన జూలియట్ సింప్సన్ అనే బామ్మ పోలీసులు ఇంటిని ముట్టడించడం చూసి నవ్వాపుకోలేకపోయింది. అనంతరం తాను తయారు చేసిన పులి బొమ్మను వారికి పరిచయం చేసింది. అది బొమ్మలా లేదని నిజమైన పులిలా కనిపిస్తోందని వారు చెప్పుకొచ్చారు. దీని కోసమేనా ఇంతలా ప్రయత్నించింది అని నవ్వుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇక ఆ ప్రదేశాన్ని పూర్తిగా గాలించిన తర్వాత అక్కడ ఎలాంటి జంతువు లేదని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఇక ఈ విషయాన్ని ఆ ఇంట్లోని యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.(ఆడతోడు కోసమేనా..?) -
ఆర్మీ, పారా మిలిటరీ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
సాక్షి, ఖమ్మం: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో అర్హులైన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆర్మీ, పారా మిలిటరీ(సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్)ఉద్యోగాల్లో చేరేందుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి చదివిన యువకులు 18 నుంచి 27 సంవత్సరాలు వయసు కలిగి ఉండి 167 సెం.మీ. ఎత్తు, 77 సెం.మీ. చాతి ఉన్న యువకులకు కైరోస్ కాంపోజిట్ సర్వీసెస్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా హైదరాబాద్‌లో 45 రోజుల పాటు హాస్టల్ వసతితో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులైన ఉండి ఆసక్తి గల వారు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో ఈ నెల 24వ తేదీ లోపు బీసీ స్టడీసర్కిల్ నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి సమాచారం కోసం 08742–227427, 9573859598 నంబర్లను సంప్రదించాలన్నారు. -
సీఏపీఎఫ్ రిటైర్మెంట్ @ 60 ఏళ్లు
న్యూఢిల్లీ: అన్ని రకాల కేంద్ర సాయుధ పోలీసు బలగాల(సీఏపీఎఫ్) పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లుగా నిర్ణయిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ బలగాల్లో కానిస్టేబుల్ నుంచి కమాండెంట్ (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సమాన హోదా) స్థాయి వరకు ఉన్న నాలుగు కేంద్ర బలగాల అధికారులు (సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్, సహస్త్ర సీమా బల్) ఇకపై 57 ఏళ్లకు బదులుగా 60 ఏళ్లకు పదవీ విరమణ చేయనున్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(డీఐజీ) నుంచి అత్యున్నత ర్యాంకు డైరెక్టర్ జనరల్(డీజీ) వరకు ఉన్న ఈ నాలుగు బలగాల అధికారుల రిటైర్మెంట్ వయస్సు కూడా ఇకపై 60 ఏళ్లే. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్ బలగాలకు చెందిన అన్ని స్థాయిల అధికారులకు 60 ఏళ్ల వరకు పనిచేసే అవకాశం ఉండగా తమకు మాత్రమే 57 ఏళ్లను రిటైర్మెంట్ వయస్సుగా నిర్ణయించటం వివక్ష చూపడమేనంటూ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఏకీభవించిన న్యాయస్థానం.. ఇలా వేర్వేరు పదవీ విరమణ వయస్సులను నిర్ధారించడం ‘రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితం’ అని, బలగాల మధ్య అంతరం చూపడమేనని వ్యాఖ్యానించింది. ఈ విధానాన్ని సవరించాలని జనవరిలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలని ఆయా బలగాలను ఆదేశిస్తూ సోమవారం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎవరైనా రిటైరై ఉంటే అలాంటి వారు తాము పొందిన రిటైర్మెంట్ ప్రయోజనాలను వాపసు చేసి తిరిగి విధుల్లో చేరవచ్చనీ లేదా 60 ఏళ్లు వచ్చే వరకు విధుల్లో కొనసాగి, రిటైర్మెంట్ ప్రయోజనాలను అందుకోవచ్చని తెలిపింది. రిటైరైన తర్వాత న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన వారు, స్టే పొందిన కూడా 60 ఏళ్లు వచ్చే దాకా తమ విధుల్లో కొనసాగవచ్చని కూడా స్పష్టత ఇచ్చింది. ఈ నాలుగు బలగాలకు చెందిన కమాండెంట్ స్థాయి దిగువ హోదా వారికి ఏడో వేతన సంఘం కమిషన్ సిఫారసులు సీఐఎస్ఎఫ్ మాదిరిగానే వర్తిస్తాయని పేర్కొంది. అయితే, తక్షణం కార్యక్షేత్రం దూకాల్సిన అవసరం ఉండే సీఆర్పీఎఫ్ వంటి బలగాల అధికారుల ఫిట్నెస్ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రానికి సీఏపీఎఫ్ నాయకత్వం తెలిపింది. -
డ్రంక్ – డ్రైవ్‌లో ఆర్మ్డ్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారి పనిపట్టేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరింత బలగంతో బరిలోకి దిగుతున్నారు. ఈ విషయంలో ఇకపై ట్రాఫిక్ పోలీసులకు ఆర్మ్డ్ రిజర్వ్డ్ సిబ్బంది సహకరించనుంది. ఐటీ కారిడార్, నగర శివారు ప్రాంతాల్లో రిసార్ట్లు, వైన్స్‌లు కుప్పలుతెప్పలుగా ఉండటంతో మద్యం తాగి రోడ్డెక్కిన డ్రంకెన్ డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలు చేస్తుండటాన్ని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. వీరిని పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని నిర్ణయించారు. ట్రాఫిక్ విభాగంలో అంతంత మాత్రంగానే సిబ్బంది ఉండడంతో డ్రంకెన్ డ్రైవ్‌లో ఆర్మ్డ్ పోలీసుల సేవల వినియోగానికి చర్యలు తీసుకున్నారు. అల్వాల్, బాలానగర్, జీడిమెట్ల, కూకట్పల్లి, మాదాపూర్, మియా పూర్, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, ఆర్జీఐ ఎయిర్‌పోర్టు, షాద్‌నగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో ప్రతి శుక్ర, శనివారాల్లో నిర్వహించే డ్రంకెన్ డ్రైవ్‌లో ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందిని వినియోగించుకోవాలని ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్‌కు సూచించారు. మద్యం మత్తు దించుతారు... సైబరాబాద్ కమిషనరేట్‌లోని పది ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 7,791 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి 84,36,550 జరిమానా విధించారు. 1379 మందిని జైలుకు పంపించారు. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు కూడా బరిలోకి దిగుతుండటంతో రానున్న 4 నెలల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. డ్రంకెన్ డ్రైవ్ కేసులిలా... జనవరి నుంచి జూన్ వరకు జరిగిన డ్రంకెన్ డ్రైవ్‌లో అత్యధికంగా శంషాబాద్‌లో 1,288 కేసులు నమో దుకాగా ఆ తర్వాతి స్థానంలో రాజేంద్రనగర్‌లో 1,079 కేసులు నమోదయ్యాయి. కూకట్‌పల్లిలో 995, అల్వాల్‌లో 949, బాలానగర్‌లో 850, మియాపూర్‌లో 843, జీడిమెట్లలో 806, మాదాపూర్‌లో 550, గచ్చిబౌలిలో 276, షాద్‌నగర్‌లో 155 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు. ఈ మొత్తం 7,791 కేసుల్లో 5,811 కేసులు పరిష్కరించారు. 1980 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన 7,791 మందిలో 1,100 మందికి ఒకటి నుంచి ఐదు రోజులు, 279 మందికి ఆరు నుంచి 13 రోజులు జైలు శిక్ష పడిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
ఆమెకు ఆరుగురు పోలీసుల కాపలా
సాక్షి, తిరువనంతపురం: అది కేరళలోని కొట్టాయం జిల్లా, తిరుమణి వెంకటపురం (టీవీ పురం అని పిలుస్తారు) గ్రామంలోని ఓ ఇల్లు. ఇంటి వెలుపల ఎప్పుడూ ఆరుగురు సాయుధ పోలీసులు, షిప్టుల పద్ధతిలో 24 గంటలపాటు కాపలా ఉంటారు. ఆ ఇంటి పరిసరాల దరిదాపుల్లోకి ఎవరిని రానివ్వరు. ముఖ్యంగా జర్నలిస్టులను అసలే రానివ్వరు. ఇంటినిగానీ, ఇంటి పరిసరాలనుగాని కనీసం ఫొటోలు కూడా తీయనివ్వరు. ఆ ఇంటికి సంబంధించిన బంధువులొస్తే వచ్చేటప్పుడు, పోయేటప్పుడు వారిని తనిఖీ చేస్తారు. అలా అని అది పెద్ద రాజకీయ నాయకుడి ఇల్లు కాదు, సెలబ్రిటీ ఇల్లు అంతకన్నా కాదు. టెర్రరిస్టు ఇల్లు అసలే కాదు. అది సీఆర్పీఎఫ్లో డ్రైవర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన అశోకన్ మణి అనే వ్యక్తి ఇల్లు. అందులో ఆయన భార్య పొన్నమ్మ, వారి 24 ఏళ్ల కూతురు అఖిల అశోకన్ ఉంటున్నారు. వారి ముగ్గురి కోసం ఆ ఇంటికి అంత భద్రత ఎందుకో తెలసుకోవాలంటే కాలక్రమంలో వెనక్కి వెళ్లి రావాలి. అఖిల స్థానికంగా తన హైస్కూలు, ఇంటర్ చదువు ముగించుకొని తన 18వ ఏట, అంటే 2011లో ఊరు నుంచి పై చదువుల కోసం 400 కిలోమీటర్ల దూరంలోవున్న తమిళనాడులోని సేలంకు వెళ్లారు. అక్కడి శివరాజ్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో ‘బ్యాచ్లర్స్ ఇన్ హోమియోపతిక్ మెడిసన్ అండ్ సర్జరీ (బీహెచ్ఎంఎస్)లో చేరారు. అక్కడి కళాశాల హాస్టలో ఆమెకు ఫుడ్ నచ్చ లేదు. చదువు మీద కూడా పెద్దగా శ్రద్ధ పెట్టలేదు, దాంతో మొదటి సంవత్సరంలో ఒకసారి, ఆఖరి సంవత్సరంలో ఒకసారి ఫెయిలయ్యారని ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీ. కన్నన్ తెలిపారు. అఖిల మొదటి సంవత్సరం పూర్తికాగానే నలుగురు క్లాస్‌మేట్స్‌తో కలసి బయట రూమ్ తీకున్నారు. వారిలో ఇద్దరు హిందువులు కాగా, జసీనా సహా మరో ఇద్దరు ముస్లిం యువతులు ఉన్నారు. 2015, నవంబర్ తన తాతగారు చనిపోవడంతో అఖిల సొంతూరు టీవీ పురంకు వచ్చారు. తాత కర్మకాండలో పాల్గొనేందుకు ఇష్టపడలేదు. అనవసర తతంగమంటూ విసుక్కున్నారు. ఎప్పుడు గుడులు చుట్టూ తిరిగే తల్లి పొన్నమ్మ వెంట ఒక్క గుడికి వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు. కూతురులో వస్తున్న ఈ మార్పేమిటో తల్లిదండ్రులు గ్రహించేలోగానే అఖిల చదువు కోసం సేలం వెళ్లిపోయారు. తన రూమ్మేట్ జసీనా, ఆమె చెల్లెలు ఫసీనాతో అఖిలకు మంచి స్నేహం ఏర్పడింది. 2016, జనవరి 2వ తేదీన అఖిల మల్లపురం జిల్లాలోని పెరింథాలమన్న గ్రామంలోని జసీనా, ఫసీనాల ఇంటికి వెళ్లింది. వేళకు ప్రార్థనలు చేయడం లాంటి ముస్లిం సంప్రదాయం తనకు నచ్చిందని, తాను ముస్లిం మతం స్వీకరిస్తానని స్నేహితురాళ్లకు చెప్పింది.ఈ విషయాన్ని అఖిల స్నేహితురాళ్లు వారి తండ్రి అబూబ్యాకర్ దష్టికి తీసుకెళ్లారు. ముందుగా చదువు పూర్తి చేసుకున్నాక మతం మారవచ్చని, అంతవరకు ఓపిక పట్టుమని అఖిలకు నచ్చ చెప్పేందుకు అబూబ్యాకర్ ప్రయత్నించారు. అందుకు అంగీకరించకపోవడంతో ఆయన అఖిలను కోజికోడ్‌లోని ‘తెరబియ్యాతల్ ఇస్లామ్ స్కూల్ ’కు తీసుకెళ్లారు. ఇస్లామ్ మతంలో చేరాలంటే ఎవరి ప్రభావం లేకుండా స్వచ్ఛందంగా చేరుతున్నానంటూ నోటరీ నుంచి అఫిడ్‌విట్ తీసుకరావాలని, ఇస్లామ్ మతంలో 60 రోజుల కోర్సు చేసి పాసవ్వాలని సభ ప్రిన్సిపాల్ ఉమర్ ఫాయిజీ చెప్పారు. ఖురాన్‌లోని కొన్ని సురాలు (మొత్తం 114 సురాలు ఉంటాయి), అంటే కొన్ని అధ్యాయాల నుంచి ప్రశ్నలు ఉంటాయని చెప్పారు. తల్లిదండ్రులను వెంట తీసుకు రానందున సభలో ఉండి చదువుకోవడానికి ఆయన ఒప్పుకోలేదు. బయట ఉండి కోర్సు చేయడానికి అంగీకరించారు. కేరళ ప్రభుత్వం మత మార్పిడి సర్టిఫికెట్లను గుర్తించే సంస్థల్లో ఈ సభ ఒకటి. దాంతో ఆబూబ్యాకర్ను అఖిలను 2016, జనవరి 5వ తేదీన మల్లప్పురం జిల్లా, మంజేరిలోని మర్కాజుల్ ఇదయా సత్య శరాణి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్‌కు తీసుకెళ్లారు. అక్కడ కూడా అఫిడవిట్ లేనందున అఖిలను చేర్చుకునేందుకు నిరాకరించారు. ఇంతకుమించి తాను సహాయం చేయలేనని, సేలం వెళ్లాల్సిందిగా ఆమెను అబూబ్యాకర్ కోరారు. ఆమె అలాగేనని చెప్పి ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఈలోగా తన కూతురు సేలంలో లేదని తెలుసుకున్న అశోకన్ జనవరి 7వ తేదీన పెరింథాలమన్నా పోలీసు స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసును దాఖలు చేశారు. జనవరి 14వ తేదీన కేరళ హైకోర్టుకు వెళ్లి ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈలోగా మిస్సింగ్ కేసు దర్యాప్తును చేపట్టిన పోలీసులు కేరళ పోలీసు చట్టంలోని 57 చట్టం కింద అబూబ్యాకర్ను అరెస్ట్ చేసి విచారించారు. రెండు రోజుల నిర్బంధం అనంతరం ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. 2016, జనవరి 19వ తేదీన అఖిల కేరళ హైకోర్టుకు హాజరై తాను ఎక్కడికి తప్పిపోలేదని, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను ఇష్టపూర్వకంగానే మర్కాజుల్ ఇదయా సత్య శరాణి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్‌లో చదువుకుంటున్నానని చెప్పారు. సేలం వెళ్లిపోతానని అబూబ్యాకర్కు చెప్పిన అఖిల వెళ్లిపోకుండా అఫిడవిట్ తీసుకొని తిరిగి మర్కాజుల్ ఇదయాకు మళ్లీ వెళ్లారు. పెద్ద వాళ్ల ప్రమేయం లేకుండా తాము చేర్చుకోమని అప్పుడు కూడా ట్రస్ట్ మేనేజర్ మొహమ్మద్ రఫీ చెప్పారట. ఇస్లాంలో కోర్సు చేయాలన్న ఆసక్తి తనకు ఎంతో ఉందని చెప్పడంతో ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’కు అనుబంధంగా నడుస్తున్న జాతీయ మహిళా సంఘటన జాతీయ అధ్యక్షులైన సాయినాభను కలవాల్సిందిగా ఆయన సూచించారట. ఆ సూచన మేరకు అఖిల ఆమెను కలసుకొని తన కథంతా చెప్పి ఆమెతో ఉండిపోయారు. తండ్రి కోర్టులో అఫిడవిట్ వేసిన విషయం తెలుసుకొని అఖిల సాయినాభను తీసుకొని హైకోర్టుకు వచ్చారు. కేరళలో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డులోని ఏకైక మహిళా సభ్యురాలు సాయినాభ హైకోర్టు అఖిల తండ్రి అశోకన్ దాఖలు చేసిన చేసిన పిటిషన్‌ను జనవరి 25వ తేదీన కొట్టివేయడంతో అఖిల తిరిగి సాయినాభతో కలసి ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ శరాణి ట్రస్ట్ షరతుపై సేలం వెళ్లి హోమియోపతి ఫైనల్ ఇయర్లో మిగిలిపోయిన సబ్జెక్టులను పూర్తి చేసి, తిరిగి ట్రస్ట్‌కు చేరుకొని అక్కడి 50 రోజుల ఇస్లాం కోర్సు చేసి పాసయ్యారు. తన పేరును హిదయాగా మార్చుకుని ఇస్లాం సర్టిఫికెట్ తీసుకున్నారు. అనంతరం ముస్లింల పెళ్లిళ్ల వెబ్సైట్ ‘వే టూ నిఖా డాట్ కామ్’లో తన పేరును నమోదు చేసుకున్నారు. 20 మంది ముస్లిం యువకుల నుంచి అమెకు ప్రతిపాదనలు వచ్చాయి. అయితే హదియా హిందూ మతాన్ని మార్చుకోవడం వల్ల మున్ముందు గొడవలు రావచ్చనే భయంతో పెళ్లి చేసుకోవడానికి వారెవరూ ముందుకు రాలేదు. ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’కు చెందిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ సభ్యుడైన షాఫిన్ జహాన్‌ను పెళ్లి చేసుకునేందుకు హదియాగా మారిన అఖిల నిర్ణయించుకున్నారు. ఈలోగా తన కూతురును సిరియాలో పోరాడేందుకు ఐఎస్ టెర్రరిస్టులు తీసుకెళ్లారని ఆరోపిస్తూ అఖిల తండ్రి అశోకన్ మరోసారి కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. హదియా మళ్లీ కోర్టుకు హాజరై తాను సిరియా వెళ్లేందుకు తన వద్ద పాస్‌పోర్టు కూడా లేదని, తాను ఎలా వెళతానని కోర్టుకు నివేదించారు. తాను ఇష్టపూర్వకంగా సాయినాభ దగ్గరే ఉంటున్నానని చెప్పారు. ఈసారి కోర్టు సాయినాభతో ఉండేందుకు అనుమతించలేదు. తల్లిదండ్రులతో ఉండాల్సిందిగా సూచించింది. అందుకు హదీనా అంగీకరించకపోవడంతో ఆమెను ఎర్నాకులంలోని లేడీస్ హాస్టల్ ఉంచి నిఘా ఉంచాల్సిందిగా కేరళ పోలీసులను కోర్టు ఆదేశించింది. తాను ఏ నేరం చేయనప్పటికీ తనను బలవంతంగా హాస్టల్లో ఉంచి, పోలీసు నిఘా పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తూ ఆమె సెప్టెంబర్ 29న హైకోర్టుకు లేఖ రాశారు. తిరిగి సాయినాభతో ఉండేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. హదియా హోమియోపతి సబ్జెక్టులన్నీ పాసైనప్పటికీ హౌజ్‌సర్జన్ పూర్తి చేయలేదు. అందుకు తన తండ్రి తీసుకెళ్లిన తన సర్టిఫెకెట్లన్నింటినీ ఇప్పించాల్సిందిగా హదియా కోరుతూ 2016, అక్టోబర్ 24వ తేదీన హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు సర్టిఫికెట్లు అందుకున్న ఆమె సేలం వెళ్లి హౌజ్ సర్జన్లో చేరారు. 2016, డిసెంబర్ 19వ తేదీన ముస్లిం సంప్రదాయం ప్రకారం షాఫిన్ను నిఖా చేసుకున్నారు. ఆ పెళ్లిని కూడా తండ్రి వ్యతిరేకించడంతో డిసెంబర్ 21వ తేదీన హదియా తన భర్తతో కలసి కోర్టుకు హాజరయ్యారు. వారి పెళ్లి పట్ల హైకోర్టు కూడా అసంతప్తి వ్యక్తం చేసింది. హదియా కోర్టు వ్యవహారంతో తన పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని, ఆమె ఇస్లాం మతం స్వీకరించాకే తనకు పరిచయం అయ్యారని, పెళ్లికి ఆమె తండ్రిని కూడా ఆహ్వానించానని పెళ్లి కుమారుడు కోర్టుకు తెలిపారు. పెళ్లి కుమారుడి పూర్వపరాలను విచారించాల్సిందిగా స్థానిక డీజీపీని ఆదేశించిన కోర్టు హదియాను తిరిగి వుమెన్ హాస్టల్‌కు పంపించింది. షాఫిన్పై చదువుకునే రోజుల్లో ఓ క్రిమినల్ కేసు దాఖలైందని, గత అక్టోబర్‌లో ఐఎస్ టెర్రరిస్టులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన మాన్సి బురాఖితో పరిచయం ఉందని పోలీసులు నివేదిక ఇవ్వడంతో హైకోర్టు గత మే నెలలో షాఫిన్తో హదియాకు జరిగిన పెళ్లిని రద్దు చేసింది. అది కాలేజీలో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన సాధారణ ఘర్షణ కేసని, ఇక బురాఖితో తనకు ఎలాంటి సంబంధం లేదని షాఫిన్ వాదించినా హైకోర్టు పట్టించుకోలేదు. హదియాను స్వగ్రామమైన టీవీ పురంలో తల్లిదండ్రులతో ఉండాల్సిందిగా ఆదేశిస్తూ పోలీసుల కాపలాను ఏర్పాటు చేసింది. హైకోర్టు తమ పెళ్లిని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆగస్టు 16వ తేదీన షాఫిన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ’ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హదియాగా మారిన అఖిల ఇంటి ముందు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ కేసును కొన్ని పత్రికలు, కొన్ని సంస్థలు ‘లవ్ జిహాదీ’గా పేర్కొన్నాయి.హదియా మాత్రం తీవ్రవాదులతోగానీ, వారి సంస్థలతోగానీ తనకుగానీ, తన భర్తకుగాని ఎలాంటి సంబంధాలు లేవని చెబుతూ వస్తున్నారు. ఆమె తన చదువు, ఇస్లాం కోర్సు, మత మార్పిడి, పెళ్లి అన్నింటికి సంబంధించిన రుజువులను భద్రంగా దాచుకున్నారు. హదియాను ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా ఎంత ప్రయత్నించినా కోర్టు నుంచిగానీ, పోలీసుల నుంచిగానీ అనుమతి లభించలేదు. శబరిమల సీనియర్ పూజారి మనవడు, సామాజిక కార్యకర్త రాహుల్ ఈశ్వర్ మాత్రం బుధవారం నాడు హదియాను, ఆమె తల్లి పొన్నమ్మను ఇంట్లోకి వెళ్లి కలసుకున్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లినప్పుడు ఇళ్లంత నిశబ్దంగా ఉంది. తల్లీ కూతుళ్లు ఎవరూ కూడా మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడలేదు. ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోవడం లేదని తల్లి చెప్పగా, ముఖంపై నుంచి దుప్పట్టా వేసుకున్న హదియా తనను నమాజు కూడా చేసుకోనివ్వకుండా హింసిస్తున్నారని ఆరోపించింది. ‘ఇంకెంతకాలం నాకీ నిర్బంధం’ అన్న హదియా అడిగిన ప్రశ్నకు రాహుల్ వద్ద సమాధానం లేకపోవడంతో మౌనంగా బయటకు వచ్చారు. -
అసెంబ్లీలోకి ఆగంతకుడు
* ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం ధ్వంసం * సాయుధ పహరా కళ్లుగప్పి.. గేటు దూకి వెళ్లిన అశోక్‌రెడ్డి * ప్రవేశ ద్వారం తలుపులు ముక్కలు ముక్కలు చేసిన వైనం * ఆగంతకుడిని వాచ్మన్లు గుర్తించటంతో అప్రమత్తం.. అరెస్ట్ * అశోక్‌రెడ్డికి మతి స్థిమితం లేదని చెప్తున్న కుటుంబసభ్యులు * ఘటనపై దర్యాప్తు - శాసనసభ భద్రత మరింత కట్టుదిట్టం సాక్షి, హైదరాబాద్: నిరంతరం మూడంచెల సాయుధ పోలీసులు పహరా ఉండే అసెంబ్లీ భవనంలోకి ఒక అగంతకుడు ప్రవేశించి ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఘటన అనంతరం స్పందించిన పోలీసులు ఆ అగంతకుడిని పట్టుకుని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా పస్రకు చెందిన అశోక్‌రెడ్డి అనే వ్యక్తి.. అత్యంత పటిష్టమైన భద్రత మధ్య ఉండే అసెంబ్లీ భవనంలోకి ఆరు అడుగులకు పైగా ఎత్తుండే ఒకటో నంబరు గేటు ఎక్కి ప్రవేశించాడు. ఈ గేటు వద్ద 24 గంటలూ సాయుధ పోలీసులు పహరాకాస్తుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభ కార్యదర్శులు తమ కార్యాలయాల్లోకి ప్రవేశించే ప్రధాన ద్వారం గేటు తెరుచుకుని.. లోపలకు వెళ్లి ఎమ్మెల్యేల ప్రవేశద్వారాన్ని ధ్వంసం చేశాడు. అశోక్‌రెడ్డి దెబ్బకు కలపతో చేసిన ఆ ద్వారంలోని రెండు తలుపుల్లో ఒకటి ముక్కలు ముక్కలై నేలపై పడింది. ఆ ద్వారానికి ఉండే అద్దం కూడా ధ్వంసమైంది. ధ్వంసమైన ద్వారం గుండా సమావేశ మందిరంలోకి ప్రవేశించిన అశోక్‌రెడ్డి కొద్దిసేపు అక్కడి ఉండి ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర మంత్రుల ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లి కూర్చున్నాడు. ఈ సమయంలో గమనించిన అసెంబ్లీ వాచ్మన్లు అతడిని ప్రశ్నించే సరికి పొంతన లేని సమాధానాలివ్వడంతో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారు అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్‌కు సమాచారం అందించారు. ఆయన హైదరాబాద్ నగర పోలీసులకు సమాచారం అందించారు. సెంట్రల్ జోన్ డీసీపీ వి.బి.కమలాసన్‌రెడ్డి అసెంబ్లీకి చేరుకుని ద్వారం ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనకు పాల్పడిన అశోక్‌రెడ్డిని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ గౌరీనగర్‌లో నివాసం ఉంటున్న అశోక్‌రెడ్డి పూర్వాపరాలను ఆయన భార్యను విచారించి తెలుసుకున్నారు. ఆ తరువాత డీసీపీ మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అశోక్‌రెడ్డి మానసికస్థితి బాగోలేదని, బుధవారం ఉదయం ఐదు గంటల సమయంలో ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు చెప్పారని వివరించారు. అశోక్‌రెడ్డి ఒకటో నంబరు గేటు నుంచి అసెంబ్లీ భవన సముదాయంలోకి ప్రవేశించినట్లు సీసీ టీవీలో రికార్డైందని వివరించారు. అశోక్‌రెడ్డిపై 447, 427 పబ్లిక్ డ్యామేజ్ యాక్ట్ కింద కేసు నమోదుచేసినట్లు సైఫాబాద్ ఇన్స్పెక్టర్ పగడాల అశోక్ చెప్పారు. ఘటన అనంతరం అసెంబ్లీ ఆవరణలో భ ద్రత కట్టుదిట్టం చేశారు. ధ్వంసమైన ద్వారాన్ని పరిశీలించే ందుకు ఎవరినీ అనుమతించలేదు. అసెంబ్లీ సమావేశ మందిరానికి మరమ్మతులు టేకుతో తయారైన ద్వారాన్ని ఎలాంటి పరికర సాయం లేకుండా ధ్వంసం చేయటం సాధ్యమయ్యే పనికాదు. ఒకవేళ అశోక్‌రెడ్డి మానసిక వికలాంగుడై కాళ్లు లేదా చేతులతో తన్ని ద్వారాన్ని ధ్వంసం చేశారని అనుకున్నా ఆయన శరీరంపై ఎలాంటి గాయా లు లేవు. ఆ సమయంలో శబ్దం కూడా రాలేదు. ప్రస్తుతం సమావేశ మందిరంలో మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో అందుకు ఉపయోగించే సామాగ్రిని ఏమైనా ఉపయోగించారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలావుంటే సంఘటన గురించి అసెంబ్లీ అధికారులు విదేశీ పర్యటనలో ఉన్న స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు వివరించినట్లు సమాచారం. ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా, ఈ ఘటనకు కారకులుగా భావిస్తూ నలుగురు ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. -
అక్రమ రవాణాకు చెక్
ఇక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడనుంది. ఇసుక.. రేషన్ సరుకులు.. ఇలా పలు రకాల వస్తువులు యథేచ్ఛగా జిల్లా సరిహద్దులు దాటి వెళుతున్నాయి. వీటికి ‘చెక్’ పెట్టడంలో ఇంతకాలం ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులు ఇకపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇందుకోసం చెక్‌పోస్టుల వద్ద సాయుధులైన పోలీసులతో పహారాను పెంచాలని భావిస్తున్నారు. దీనిపై పలు శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. చెక్‌పోస్టుల్లో ఇక ‘సాయుధ’ పహారా - రాత్రి సమయాల్లో ప్రత్యేక నిఘా - ‘రేషన్’ పక్కదారి పట్టకుండా చర్యలు - అవసరమైన చోట ఎస్ఐ స్థాయి అధికారితో బందోబస్తు - త్వరలోనే వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో ఉన్న చెక్‌పోస్టుల్లో నిఘా పటిష్టం కానుంది. ఇప్పటివరకు కేవలం రవాణా శాఖకు చెందిన ఓ అధికారి, నలుగురైదుగురు సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించిన చెక్‌పోస్టులు త్వరలోనే సాయుధ పోలీసుల పహారాలోకి వెళ్లనున్నాయి. జిల్లా నుంచి అక్రమంగా తరలుతున్న కోట్ల రూపాయల రేషన్ సరుకులు, ఇసుకకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ఈ చర్యలకు పూనుకుంటోంది. దీనిపై త్వరలోనే జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ నేతృత్వంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఆర్టీఏ, ఇతర భాగస్వామ్య శాఖలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం అన్ని చెక్‌పోస్టుల్లో నిఘా పెంచనున్నారు. ఉపయోగం లేని ‘చెక్’.. జిల్లాలో ఉన్న చెక్‌పోస్టుల ద్వారా ప్రస్తుతం మొక్కుబడి తనిఖీలే నడుస్తున్నాయి. చెక్‌పోస్ట్ గుండా వెళుతున్న వాహనాలపై అనుమానం వచ్చినప్పుడో, అధిక లోడుతో వెళుతోందని గుర్తించినప్పుడో సిబ్బంది ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప.. అక్రమ రవాణాను అడ్డుకునే దిశలో కృషి చేయడం లేదు. కాగా, సక్రమంగా వెళుతున్న వాహనాలను ఆపి తనిఖీల పేరుతో ఇబ్బందులు పెడుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇక, రాత్రి వేళల్లో విధులు నిర్వహించడం చెక్‌పోస్టు సిబ్బందికి కత్తిమీద సాములా తయారైంది. కొందరు అక్రమ వ్యాపారులు బెదిరింపులకు పాల్పడడం, మరికొన్ని సందర్భాలో సరుకు తీసుకు వెళుతున్న వారే చెక్‌పోస్టు సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలు కూడా జరిగాయి. పెద్ద ఎత్తున ఇసుక రవాణా... ఆంధ్ర ప్రాంతంతో పెద్ద ఎత్తున సరిహద్దులున్న జిల్లా నుంచి లక్షల టన్నుల నిత్యావసరాలు, వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలి వెళుతున్నాయి. ఇసుక అయితే పెద్ద ఎత్తున హైదరాబాద్ కూడా తరలివెళుతోంది. అయినా వీటిని నియంత్రించేందుకు చెక్‌పోస్టుల సామర్థ్యం సరిపోవడం లేదు. ఇటీవలి కాలంలో చెక్‌పోస్టుల సంఖ్య పెంచినా ఫలితం లేకుండా పోయింది. ఈ అక్రమ రవాణాలో కింది స్థాయి సిబ్బంది నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు భాగస్వాములేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు చెక్‌పోస్టు వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించడంతో ఈ దిశలో యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. చెక్పోస్టుకో కానిస్టేబుల్... అవసరమైతే ఎస్ఐ కూడా నిఘాను పటిష్టం చేసేందుకు ప్రతి చెక్‌పోస్టు వద్ద పోలీసు బలగాలను కాపలా ఉంచాలని కలెక్టర్ భావిస్తున్నారు. ఇందుకోసం పోలీసు శాఖ సహకారంతో ప్రతి చెక్‌పోస్టు దగ్గర కనీసం సాయుధుడైన కానిస్టేబుల్‌ను ఉంచాలని, తద్వారా చెకింగ్ నిర్వహిస్తున్న సిబ్బందికి మానసిక స్థైర్యం కల్పించాలనే యోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఎస్పీ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు కేవలం రవాణా శాఖ సిబ్బంది నేతృత్వంలోనే నడిచిన చెక్‌పోస్టుల్లో సిబ్బందిని పెంచడంతో పాటు పోలీసు కాపలా కూడా పెట్టడం ద్వారా రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమ రవాణాను నియంత్రించాలన్నది జిల్లా యంత్రాంగం ఆలోచనగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాత్రి 11 నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు సరుకులు అక్రమంగా జిల్లా దాటివెళుతున్నాయని అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆ సమయంలో ప్రత్యేక నిఘా ఉంచాలని, అవసరమైతే ఎస్ఐ స్థాయి అధికారిని కాపలా ఉంచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనిపై త్వరలో నిర్వహించబోయే సమావేశంలో కలెక్టర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇసుకపైప్రత్యేక దృష్టి... జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలను బంగారు బాతులుగా చేసుకుని కొందరు అక్రమార్కులు లక్షల రూపాయలు అర్జిస్తున్నారు. పట్టాదారు స్థలాల్లో తవ్వకాల పేరుతో ఇసుక నిల్వలను హరించివేస్తున్నారు. గోదావరి తీరంలో గిరిజన సొసైటీల ద్వారా ఇప్పటికే సేకరించిన దాదాపు 20 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలున్నాయి. వీటి విలువ రూ. కోటి పైమాటే. ఇప్పుడు ఈ నిల్వలు అక్రమంగా తరలివెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ ఇసుకను ఎలా వినియోగించాలన్న దానిపై కూడా సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు పట్టాదారు స్థలాల్లో తవ్వకాలకు సంబంధించిన అనుమతులను పరిశీలించి, సర్వే చేసి, ఆ స్థలాలను మార్కింగ్ చేయడంతో పాటు రెడ్ఫ్లాగ్లు ఏర్పాటు చేయడం ద్వారా పట్టాదారులు తమ స్థలాలకు మించి ఇసుక తవ్వకాలు చేపట్టకుండా నియంత్రించే దిశలో కృషి జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జిల్లా నుంచి కోట్లాది రూపాయల విలువైన అక్రమ సరుకు రవాణా ఏ మేరకు నియంత్రించగలరో, పోలీసు పహారా ఏ మేరకు ఫలితాలనిస్తుందో వేచిచూడాల్సిందే.