ఇక సినిమాలకు గుడ్ బై..?
వినాయకుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన, కేరళ కుట్టి శరణ్య మోహన్.. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటి, తరువాత దక్షిణాదిలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. హీరోయిన్ రోల్స్‌తో పాటు చెల్లెలి పాత్రల్లో కూడా అలరించిన ఆమె ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పేసినట్టే అన్న టాక్ వినిపిస్తుంది.
ఈ మధ్యే కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో అరవింద్ కృష్ణన్ ను పెళ్లాడిన శరణ్య.. సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తుందట. అయితే స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్, సింగర్ అయిన శరణ్య ఆ రంగాల్లో తన కెరీర్ ను కంటిన్యూ చేయాలనుకుంటుంది. మరి శరణ్య అనుకున్నట్టుగా సినిమాలకు దూరమవుతుందో లేక అందరూ హీరోయిన్ల లాగే లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.