అశ్వద్ రాజీవ్ 9/48
అయినా సీకే బ్లూస్‌కు తప్పని ఓటమి ఎ-డివిజన్ వన్డే లీగ్
సాక్షి, హైదరాబాద్: అశ్వద్ రాజీవ్ (9/48) సంచలన బౌలింగ్‌తో రాణించినప్పటికీ... అతని జట్టు సీకే బ్లూస్ బ్యాటింగ్ వైఫల్యంతో పరాజయం చవిచూసింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సెయింట్ ప్యాట్రిక్స్ 69 పరుగుల తేడాతో సీకే బ్లూస్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన సెయింట్ ప్యాట్రిక్స్ 246 పరుగుల వద్ద ఆలౌటైంది. సాయి వినయ్ (51), రోహిత్ యాదవ్ (44), సాహిల్ కృష్ణ (39) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సీకే బ్లూస్ 177 పరుగులకే ఆలౌటైంది. బాలకృష్ణ (51) అర్ధసెంచరీ సాధించగా, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. రోహిత్ 6, సుమిత్ 2 వికెట్లు పడగొట్టారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
ఆల్ సెయింట్స్: 319/8 (సాత్విక్ రెడ్డి 168, సయ్యద్ తమీమ్ 73; నీరజ్ కుమార్ 2/60, దేవేందర్ అగర్వాల్ 2/ 37); జై సింహా: 315/9 (ప్రమోద్ మహాజన్ 93, నీరజ్ 68, సాయి తేజ 52; ముజ్తజా 3/92, సాత్విక్ రెడ్డి 3/75).
గ్రీన్లాండ్స్: 269/5 (సుధీంద్ర 109, పృథ్వీ రాజ్ 57, అనుజ్ యాదవ్ 51; గోపి 2/ 49); హైదరాబాద్ పాంథర్స్: 145 (ఆలౌట్) (విఘ్నేశ్ పటేల్ 26; నిఖిల్ 5/25, పృథ్వీరాజ్ 3/32).
సెయింట్ ప్యాట్రిక్స్: 246 (ఆలౌట్) (సాయి వినయ్ 51, రోహిత్ యాదవ్ 44; రాజీవ్ 9/48); సీకే బ్లూస్: 177 (ఆలౌట్) (బాలకృష్ణ 57 నాటౌట్, సుశాంత్ 30; రోహిత్ యాదవ్ 6/41, సుమిత్ 2/44).
వాకర్ టౌన్: 151 (ఆలౌట్) (చంటి 36, ప్రశాంత్ 29 నాటౌట్; మదన్ క్షీరసాగర్ 5/36, పవన్ వర్మ 3/49); హైదరాబాద్ పేట్రియాట్స్: 152/5 (మహేశ్ 62, విజయ్ 30; ఆశిష్ 2/23).
ఎస్‌యూసీసీ: 251/9 (చరణ్ తేజ 120, యశ్వంత్ 38; ప్రభాజన్ 4/62); యునెటైడ్: 82/10 (అభయ్ స్వరూప్ 3/29).
లాల్‌బహదూర్ పీజీ: 50 ( సాయి కార్తీక్ 6/5); మణికుమార్: 51/1.
స్వస్తిక్ యూనియన్: 307 (అగ్రజ్ 50, వినోద్ కుమార్ 38,విజయ్ 100; ఫహీముద్దీన్ 3/52, లఖన్ 3/10); నోబెల్ సీసీ: 178 ( వినాయక్ 50, శంషుద్దీన్ 57; విజయ్ కుమర్ 5/46).
టైమ్ సీసీ: 184 (సుమంత్ 44, బాబర్ 38); సత్యం కోల్ట్స్: 82 (చేతన్ 3/19, బాబర్ 5/10).