balamma
-
హైదరాబాద్ బాలాపూర్ లో దారుణం
-
‘రీడర్స్ డెజైస్ట్’కు రూ.5 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: మోసపూరిత పోటీలతో తన అమ్మకాలను పెంచుకునేందుకు యత్నించిన ‘రీడర్స్ డెజైస్ట్’అనే మేగజీన్‌పై ఢిల్లీ వినియోగదారుల కమిషన్ కొరడా ఝళిపించింది. మేగజీన్‌కు వ్యతిరేకంగా కేసు వేసిన మైసూరుకు చెందిన బాలమ్మ అనే 86 ఏళ్ల వృద్ధురాలికి రూ.5 లక్షలు చెల్లించడంతోపాటు, కనువిప్పు కలిగేలా మరో రూ.50 లక్షలను వినియోగదారుల సంక్షేమ నిధి వద్ద డిపాజిట్ చేయాలని మేగజీన్‌ను ఆదేశించింది. తాము ఒక పోటీని నిర్వహిస్తున్నామనీ, అందులో గెలిచిన వారికి రూ.24 లక్షల డబ్బు, ఒక విలాసవంతమైన కారు బహుమతిగా అందజేస్తామని మేగజీన్ ఇచ్చిన మోసపూరిత ప్రకటనపై బాలమ్మ ఫిర్యాదుచేసింది. -
పాముతో 40 నిమిషాలు !
హైదరాబాద్ : ఒకటి..రెండు కాదు ఏకంగా నలభై నిమిషాలు ఓ విషసర్పం వృద్ధురాలి కాలిని చుట్టుకుంది. అది ఎక్కడ కాటు వేస్తుందోనని ఆమె వణికిపోయింది. స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఏమీ చేయకుండా వెళ్లిపోయింది. ఈ సంఘటన మంగళవారం హయత్‌నగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో వృద్ధురాలు కొండ్రు బాలమ్మ (91) ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని ఉంది. చెట్ల పొదల నుంచి వచ్చిన తాచుపాము ఆమె కాలుకు చుట్టుకుంది. దీంతో ఆమె భయంతో వణికిపోయింది. సుమారు 40 నిముషాల పాటు ఆమె కాలుకు పాము చుట్టుకుని ఉంది. దీన్ని గమనించిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన చెందారు. కాటు వేయకుండా పాము వెళ్లిపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. హయత్‌నగర్ 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని బాలమ్మకు ప్రథమ చికిత్స అందించారు.